Pages

సామెతలు - proverbs

జనజీవన మాధ్యమాల వేదిక - మన సామెతలు
కుక్క కాటుకు చెప్పుదెబ్బ.     కుక్క తోక పట్టుకొని గోదారీదినట్టు.
ఋణ శేషము, అగ్ని శేషము, శత్రు శేషం ఉంచరాదు.    ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు గదా!      
ఏపాటు తప్పినా సా పాటు తప్పదు.      ఏనుగు మీద  దోమ వాలినట్లు.
ఏట్లో వేసినా ఎంచి పార వేయాలి.        ఏటి ఆవలి ముత్యాలు తాటికాయలంత అన్నట్లు.      
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు.గోరంత దీపం కొండంత వెలుగు.
గోటితో పోయ్యేది గొడ్డలితో దాక వచ్చింది.     గోడలకు చెవులుంటాయి.     
గోరంత దీపం కొండంత వెలుగు.గోచీకి పెద్దది అంగవస్త్రానికి చిన్నది.     
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు.       కొండంత తెలివి కంటె గోరంత కలిమి మేలు! 
ఈన గాచి నక్కల పాలు చేసినట్లు.  కూర ఎంతైనా కూడు కాదు.   
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.     ఈవూరి కావూరెంత దూరమో, ఆ వూరికి ఈ వూరూ అంతే దూరం.     
చక్కనమ్మ చిక్కినా అందమే!     ఒంటికి ఓర్చలేనమ్మ రెంటికి వోర్చునా!
ఒకే  దెబ్బకు రెండు పిట్టలు.     కొండవీటి చేంతాడంత.     
కొండను తవ్వి ఎలును పట్టినట్టు.     చందమామను చూచి కుక్కలు మెరిగినట్లు.     
గోరు చుట్టు మీద రోకటి పోటు.    ఒకపూట తినే వాడు యోగి, రెండు పూటలు తినే వాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి. 
కొన్నది వంకాయ కొసిరింది గుమ్మడికాయ. కొండ నాలుకకి మందువేస్తే ఉన్న నాలుక ఊడింది.     
చాపకింద నీరులాగా!      ఓడలు బండ్లగును బండ్లు ఓడలగును.     
ఒక దెబ్బకు రెండు ముక్కలు.     కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు.     
ఒక కలగంటే తెల్లవారుతుందా?    కొత్త అప్పుకుపోతే పాత అప్పు బయటపడట్లు. 
కొట్టి కోలాహలం చేసినట్టు.     చచ్చిన వాని పెళ్ళికి వచ్చిందే కట్నం.     
చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు. చచ్చిన వాని కళ్ళు చారెడు.      
చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద.      కడుపు నిండిన వానికి గారెలు చేదు.      
చింత చచ్చినా పులుపు చావదు.     కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ గడ్డి కోసం అన్నట్టు.        
కొంపలంటుకున్న తరువాత నుయ్యి తవ్వుట.    చదివేస్తే ఉన్న మతి పోయినట్టు.      
ఒక చెయ్యి తట్టితే చప్పుడవుతాదా!    చంద్రునికో నూలుపోగు.    
కూటికి పేదయితే గుణానికి పేదా?    గుర్రం గుడ్డి దైనా దాణా తప్పదు.      
ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసినట్టు.     ఋణ శేషము, అగ్ని శేషము, వ్రణ శేషం ఉంచరాదు.   
ఎక్కిరించబోయి వెల్లకిలా పడ్డాడంట. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది,  అన్నీ ఉన్న విస్తరి ఆణిగిమణిగి ఉంటుంది.    
అందని   ద్రాక్షపళ్ళు పుల్లన అన్నట్టు.      అ ఆ లు రావు అగ్రతాంబూలం కావాలి.      
ఇంటి దొంగను ఈశ్వరుడయినా పట్టలేడు.  ఎండకాచిన చోటే వెన్నెల కాచేది.     
ఇంటి కన్న గుడి పదిలం.      ఇంటి చక్కదనం ఇల్లాలే చెబుతుంది.        
ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరగదు.     ఇంట గెలిచి రచ్చ గెలువు.       
ఇంత బతుకు బతికి ఇంటెనుక చచ్చినట్లు.      ఏ ఎండకా గొడుగు. ఏ గాలికి ఆ చాప. 
ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు. ఎవరికి వారే యమునా తీరే.          
ఇసుక తక్కెడ పేడ తక్కెడ.       ఈతకాయతో తాటికాయ.
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు!       ఏపుట్టలో ఏ పాముందో!           
ఇంటి చక్కదనం ఇల్లాలే చెబుతుంది.   ఏగూటి చిలుక ఆ గూటిపలుకు పలుకుతుంది. 
ఏటి ఈతకు లంకమేతకు సరి.       ఎగదీసే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య.     
ఎనుబోతు మీద వాన కురిసినట్లు.     ఎవరిగోతిలో వారే పడతారు.      
ఎరను చూపి చేపను లాగినట్టు.          ఎవరి బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది?
ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు.      ఇంటి పేరు కస్తూరి ఇంటిలో గబ్బిలాల కంపు. 
ఏకులు పెడితే బుట్ట చినుగుతుందా!  ఎద్దు పుండు కాకికి ముద్దా!        
ఇల్లలకగానే పండగవుతుందా?     ఇచ్చేవాడ్ని చూస్తే చచ్చినవాడు లేచాడు.     
ఇంట్లో పులి వీధిలో పిల్లి.          ఏకు అయివచ్చి మేకు అయిన తీరు.    
అంగట్లో అరువు, తలమీద బరువు.   అంగిట బెల్లము. ఆత్మలో విషం.
ఎందుకురా ఒగర్పు అంటే ఎల్లుండి సంతకు పోవాలి గదా! అన్నాడట.    ఎక్కడయినా బావగాని వంగతోటకాడ  మాత్రం కాదు.     
ఎవరి వెర్రి వారికి ఆనందం.      ఇల్లు ఇరకటం ఆలు మర్కటం.     
ఎద్దును అడిగా గంత కట్టేది?         ఇంటిలో ఈగలమోత బయట పల్లకీమోత.     
ఎలుకకు పిల్లి సాక్షం చెప్పినట్టు.     ఇంటికళ ఇల్లాలే చెబుతుంది.    
ఆత్రగానికి బుద్ధి మట్టు.    ఎక్కడున్నావే కంబలీ అంటే వేసిన చోటనే ఉన్నా వెంగళి అన్నదట!         
అప్పుడే తినేవాడిని గదా!   అంత్య   నిష్ఠూరం కన్నా ఆది నిషూరమే మేలు
అయాసం ఒకరిది అనుభవం మరొకరిది.       ఆవగింజంత సందుంటే అరవయి గారెలు 
ఆదిలోనే హంసపాదు.          ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.        
 ఆశకు అంతులేదు      ఆరునెలలు సహవాసం చేసే వారు వీరవుతారు
ఎంతవారలయినా కాంతదాసులే          ఆడబోయిన తీర్థమెదురైనట్లు    
ఎంచబోతే మంచమంతా కంతలే    ఎంచిన ఎరువేదీ అంటే యజమాని పాదమే     
ఊరంతా చుట్టాలు ఉట్టికట్ట తావులేదు.    ఉలిదెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది. 
ఆరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది    ఊరికే వస్తే మావాడు మరొకడున్నాడు      
అవ్వా కావలెను బువ్వా కావలెను      అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు     
అర ఘడియ భోగం ఆర్నెల్ల రోగం.     అరచేతిలో వైకుంఠం చూపినట్లు
అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు?       అయ్యవారిని చేయబోతే కోతి అయింది   
అమ్మబోతే అడవి కొనబోతే కొరివిఅయిన వారికి ఆకుల్లోను కానివారికి కంచాల్లోను.  
అప్పుచేసి పప్పుకూడు.      అప్పులేని వాడే అధిక  సంపన్నుడు.       
అన్నీ వేసి చూడు నన్ను వేయకుండా చూడు అన్నదట ఉప్పు       అన్ని సాగితే రోగమంత భోగము లేదు.            
అనుభవము ఒకరిది ఆర్బాట మరొకరిది.      అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు.
అద్దం మీద ఆవగింజ.      అనుమానం పెనుభూతం        
అద్దం అబద్ధం ఆడుతుందా!     అద్దెకు వచ్చిన గుర్రం అగడ్త దాటుతుందా!         
అదిగో అంటే ఆరు నెలలు.       అదిగో తోక అంటే ఇదిగో పులి. 
అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న.         అతిరహస్యం బట్టబయలు.       
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.           అడ్డాలనాటి బిడ్డగాని గడ్డాల నాటి బిడ్డగాదు!       
అడవిలో కాచిన వెన్నెల ముదిమిని చేసిన పెళ్లి        అడగందే అమ్మయినా అన్నం పెట్టదు.
  అగ్నిలో మిడత పడినట్లు.            అగ్నిహోత్రంలో ఆజ్యం పోసినట్లు          
అగ్గిమీద గుగ్గిలం అయినట్టు.        అగ్నికి వాయువు తోడైనట్లు.        
అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తే వాడొకడు.     అగడ్తలో పిల్లికి అదే వైకుంఠం. 
అందితే సిగ అందకపోతే కాళ్ళు     అంధునకు అద్దం చూపినట్లు.           
అందరికి నేను లోకువ నాకు నంబి లోకువఅందరిదీ ఒకదారి ఉలిపి కట్టెదొక దారి!         
అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.   అందని పండ్లకు అర్రులు చాచినట్లు.      
ఆడలేనమ్మ మద్దెల ఓడు అన్నదట!      అంగటిలో అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని      
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం!      ఉపకారానికి పోతే అపకారం ఎదురైనట్లు
ఆడే కాలు పారే నోరు ఊరకుండదు.    ఉన్నమాటంటే ఉలుకెక్కువ.       
ఆకాశానికి నిచ్చెన వేయుట.ఉడత ఊపులకు కాయలు రాలునా?       
ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికెక్కుద్దా!    ఉడుతకేలరా ఉళ్లో  పెత్తనం.     
ఉట్టికట్టుకు ఊరేగుతారా!    ఆకలి రుచి ఎరుగదు, నిదసుఖం ఎరుగదు.  
మద్దెలపోయి రోలుతో మొర పెట్టుకున్నట్టు. అకలి ఆకాశమంత నోరు సూది బెజ్జమంత     
పిట్ట కొంచెం కూత ఘనం.ముక్కు పిండి వసూలు చేయడం.
ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి. మంగలి కత్తికి మాకులు తెగునా 
బోడితలకు బొండు మల్లెలు ముడిచినట్లు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా !
పిచ్చి కుదరింది తలకి రోకలి చుట్టమన్నట్టు.ముంజేతి కంకణానికి అద్దం దేనికి? 
పాలు త్రాగి రొమ్ము గుద్దినట్టు...బాలవాక్కు బ్రహ్మవాక్కు 
బడాయి బారెడు పొగ చుట్ట మూరెడు. పిండి కొద్దీ రొట్టె.
జీతం లేకుండా తోడేలు మేకలు కాస్తానన్నదటపైసలు ఇచ్చి పాపం కొనుక్కున్నట్టు.
పంది బలిసినా నందితో సమానమాబందరు బడాయి గుంటూరు లడాయి
పైత్యపు రోగికి పంచదార చేదుజిల్లేడు చెట్టుకు పారిజాతాలు పూయునా 
పండాకుని చూచి పసరాకు నవ్వినట్టుబంగారం ఉంటే సింగారానికేమి కొదవ.
జానెడు ఇంట్లో మూరెడు కర్ర పండిత పుత్ర పరమశుంఠ
పెయ్యను కాపాడమని పెద్దపులికిచ్చినట్లు.జింక కన్నీరు వేటగానికి ముద్దా !
చేసేవి శివపూజలు చెప్పేవి అబద్ధాలు పంటచేను విడిచి పరిగ ఏరినట్లు 
 నోరు కల్లలపుట్ట పేరు హరిశ్చంద్రుడు.పులి మీసాలు కుందేలు మేసినట్లు. 
పాలుపోసి పెంచినా పాముకు విషం పోదు. చేపపిల్లకు ఈత నేర్పవలెనా
పుట్టిననాటి గుణం పుడకలతో గాని పోదు.పులికి ఆకలైతే గడ్డి తింటుందా? 
నిండిన కడుపు నీతి ఎరుగదు. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుంది. 
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి. చిలుక ముక్కుకు దొండపండు ఉన్నట్లు. 
పిల్లిని చంకబెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్టు. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది.
నాచేతి మాత్ర వైకుంఠ యాత్ర నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. 
పట్టుచీర ఎరువిచ్చి పీట పట్టుకు తిరిగినట్టు. చావుకూ పెళ్ళికీ ఒకటే మంత్రమన్నట్లు. 
పిరికి వానికే పిడికెడంత మీసాలు.పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్దీ బిడ్డలు. 
నవ్విన నాపచేనే పండుతుంది.నిప్పుముట్టనిదే చేయికాలదు. 
సొమ్మొకడిది సోకొకడిది.నోరు మంచిదయితే ఊరు మంచిదే అగును. 
నిప్పు లేనిదే పొగరాదు.హనుమంతుడి ముందా నీ కుప్పి గంతులు ! 
సిరిరా మోకాలొడ్డినట్టు.నరుని కంట నల్లరాయి పగులును.
మీ ఇంట్లో పాలల్లోకి పంచదార లేకపోడమూ మా ఇంట్లో గంజిలోకి ఉప్పులేకపోవడం ఒకటే ! నుదుట రాసి నోట పలికించుట.
నిప్పుముట్టనిదే చెయ్యి కాలదు. స్థానబలిమి గాని తన బలిమి కాదు.
మనిషి కాటుకు మందు లేదు. నడమంత్రపు సిరి నరాలమీది పుండు.
సముఖాన రాయబారమేల? నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు. 
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా!నిజమాడితే నిష్టూరం.
నడమంత్రపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట.మనసుంటే మార్గం ఉంటుంది. 
మంచివానికీ మాటే మందు. నిండుకుండ తొణకదు.
దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే. శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు. 
దీపం పేరు చెబితే చీకటి పోతుందా మగ్గం చేసిన తప్పు సాలె తీర్చాలి.
దాసుడి తప్పులు దండంతో సరి.నారు పోసినవాడే నీరు పోస్తాడు. 
దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు. శంఖంలో పోస్తేనేగాని తీర్థం కాదు.
తులసి వనంలో గంజాయి మొక్క. దొంగకు తేలుకుట్టినట్టు
త్రాడు చాలదని బావి పూడ్చుకున్నట్లు. దేవుడు వరమిచ్చినను పూజారి వరమీయడుగదా !
తెడ్డు  వుండగా చెయ్యి కాల్చుకున్నట్లు.దూరపు కొండలు నునుపు. 
రాజు కొట్టగా మొగసాలెకు మొరపెట్టుట. దురాశ దుఃఖానికి చేటు. 
తుపాకి కడుపున ఫిరంగి పుట్టినట్లు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టమన్నట్టు.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు. దీపముండగనే ఇల్లు చక్కబెట్టుకోవలె. 
తిలా పాపం తలో పిడికెడు. దినదిన గండం నూరేళ్ళు ఆయుష్షు. 
తిండికి ముందు తగువుకు వెనుకకు. దంచినమ్మకు బొక్కిందే దక్కుడు. 
భక్తి లేని పూజ పత్రిచేటు. తెగించిన వానికి తెడ్డెలింగం. 
మంచమున్నంతవరకూ కాళ్ళు చాచుకో !బోడి తలకూ మోకాలుకు ముడి. 
వీపు మీద కొట్టినా ఫరవాలేదు గాని, కడుపు మీద మాత్రం కొట్ట కూడదు.బూడిదలో పోసిన పన్నీరు.
వడ్లగింజలో బియ్యపు గింజ.దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి. 
లావు మీద వంపు తెలియదు. విస్సన్న చెప్పిందే వేదం !
లంకమేత గోదారీత. విరిగే దాని కంటే వంగేదే మేలు.
పేదవాని కోపం పెదవికి చేటు.బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు.
రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరవనేల.రౌతు కొద్దీ గుర్రం 
పెరుగుట విరుగుట కొరకే. పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట!
పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు. రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టినట్టు ! 
పెదవి దాటితే పెన్న  దాటినట్టు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. 
పూల వాసన నారకు పట్టినట్టు.రెక్కాడితే గాని డొక్కాడదు. 
రాజును చూచిన కళ్ళతో మొగుణ్ణి చూచిన మొట్టబుద్ది. రాయి గుద్దనేల చేయి నొవ్వనేల.
రాజు కొట్టగా మొగసాలెకు మొరపెట్టుట. పూలమ్మిన చోటనే పుల్లలమ్మవలసి రావడం.
మొరుగుతున్న కుక్క కరవదు కదా?మోసేవానికే తెలుసు బరువు.
పుల్లయ్య వేమవరం వెళ్ళినట్టు. పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది.
మొక్కె వంగనిది మానై వంగునా?పులిని చూచి నక్క వాత పెట్టుకొనుట. 
పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం. పుండు మీద కారం జల్లినట్టు.
మేఘాన్ని చూచి ఉన్న ముంతెడు నీళ్ళూ  ఒలక బోసినట్లు!పిల్లకి ఎలుక సాక్ష్యం చెప్పుట. 
పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం. పిల్ల కాకికేమో తెలుసు ఉండేలు దెబ్బ. 
తీట గలవానికి, తోట గలవానికి తీరిక ఉండదు.మెరిసేదంతా బంగారం కాదు!
చెరువులు తెంచి చేపలు పంచినట్లు.తినకుండ రుచులు, దిగకుండ లోతులు తెలియవు.
తిండికి ముందు, దండుకు వెనుక. కంట్లో కారం గొట్టి, నోట్లో బెల్లం పెట్టినట్లు.
చెట్టు లేని చేను, చుట్టము లేని ఊరు. జుట్టు కాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగినట్లు. 
ఆకలి ఆకాశమంత నోరు సూది బెజ్జమంత ఆకలి రుచి ఎరుగదు; నిద్ర సుఖం ఎరుగదు. 
అవ్వాకావలెను బువ్వా కావలెను అరటిపండు ఒలచి చేతిలో పెట్టినట్లు 
అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం అరచేతిలో వైకుంఠము చూపినట్లు 
అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు?అయ్యవారిని చేయబోతే కోతి అయింది. 
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అయిన వారికి ఆకుల్లోను కానివారికి కంచాల్లోను 
అప్పుచేసి పప్పుకూడు అప్పులేని వాడే అధిక సంపన్నుడు 
అన్నపు చొరవే గాని అక్షరం చొరవ లేదు అన్నీ సాగితే రోగమంత భోగము లేదు 
తిట్టే వారికి సుఖమూ లేదు, ఓర్చుకునే వారికి దుఃఖమూ లేదు. అనుభవం ఒకరిది ఆర్భాటం మరొకరిది 
అగడ్తలో పిల్లికి అదే వైకుంఠమ్. అగ్గి మీద గుగ్గిలం అయినట్లు. 
అంధునకు అద్దం చూపినట్లు. అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తే వాడొకడు. 
అందరిదీ ఒక దారి ఉలిపి కట్టెదొక దారి. అందితే సిగ అందకపోతే కాళ్ళు. 
అందనీ పండ్లకు అర్రులు చాచినట్లు. అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ. 
అంగటి లో అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. 
కట్టులేని ఊరు, గట్టులేని   చెరువు.                                                                                                                                                       వివరణ: ఊరివాళ్ళ లో ఐకమత్యం ఉండాలి.
 లేకుంటే  ఆ ఊరు అభివృద్ధి చెందదు. అలాగే చెరువుకు కట్ట ఉండాలి.లేకుంటే అందులో నీరు నిలువదు. 
కడుపుకు పెట్టిందే కన్నతల్లి.                        వివరణ : మనిషి ఆకలిని గ్రహించి అన్నం పెట్టినవాళ్ళు కన్నతల్లితో సమానం.                
కర్ణునితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి.  
          
 వివరణ: దుర్యోధనుని బలం  కర్ణుడు. కర్ణుడు మరణించిన తరువాత భారత యుద్ధం అయిపోయినట్లే. అలాగే కార్తీకమాసం తర్వాత వానలు ముగిసినట్లే.
కూసే గాడిద వచ్చి, మేసే గాడిదను చెరచిందట.           వివరణ: పనిచేయని వానికి ఏం చేయాలో తోచదు.
               కనుక చేసేవాడి పనికి అడ్డం పడతాడు.
               పని చెడుపుతాడు.
రఘడియ భోగం ఆర్నెల్ల రోగం
రచేతిలో వైకుంఠమ్ చూపినట్లు
వ్వాకావలెను బువ్వాకావలెను
రటిపండు వలచి చేతిలో పెట్టినట్లు.
కలి ఆకలి అత్తగారూ అంటే, రోకలి మింగే కోడలా అన్నదట!
చిత్తం శివుని పైన భక్తి చెప్పుల పైన 
నోరు మంచిదైతే ఊరు మంచిదే 
కాని వారి మాట కంటిలో నలుసు 
కంచు మ్రోగునట్లు కనకం మ్రోగునా 
నీరు పల్లమెరుగు నిజం దేముడెరుగు 
సత్యమాడుట పిరికి పందల గుణం 
నిజాన్ని నిర్భయముగా చెప్పవలెను 
ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత 
కోతిపుండు బ్రహ్మరాక్షసి 
విస్సన్న చెప్పిందే వేదం 
నీరు  పల్లమెరుగు నిజం దేవుడెరుగు 
ఎంకి పెళ్ల్లి సుబ్బి చావుకొచ్చినట్లు 
గ్నికి ఆజ్యం పోసినట్లు 
వరి వెఱ్రి వారికి ఆనందం.
రంగు రంగుల గౌను కుంచెతో డిజైను. 
గొడుగు ఉంటే  వానకు తడవం, టోపీ ఉంటే ఎండకు బెదరం 
మే ! మే ! అంది మేక, కూ ! కూ ! అంది రైలు.
అంగటిలో అన్ని ఉన్నాయి అల్లుని నోట్లో శని.
అంత్య నిష్టూరం కన్నా ఆది  నిష్టూరం మేలు.
అందని పండ్లకు అర్రులు చాచినట్లు.
న్న  ఊరు  కన్నతల్లి  వంటిది.




0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు