తెలుగు వ్యాకరణం - పద్యాలు - భేదాలు
పద్యాలు - భేదాలు
వృత్తాలు: అక్షర గణాలతో ఏర్పడే పద్యాలు.
ఉదా: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం మొదలైనవి.| వృత్తపద్యాలు | గణాలు | పాదాలు | అక్షరాల సంఖ్య | యతి స్థానం | ప్రాసనియమం |
| ఉత్పలమాల | భ - ర - న - భ - భ - ర - వ | 4 | 20 | 10 | ఉంది |
| చంపకమాల | న - జ - భ - జ - జ - జ - ర | 4 | 21 | 11 | ఉంది |
| శార్దూలం | మ -స - జ - స - త - త - గ | 4 | 19 | 13 | ఉంది |
| మత్తేభం | స - భ - ర - న - మ - య - వ | 4 | 20 | 14 | ఉంది |
జాతి పద్యాలు : ఇవి మాత్రాగణాలతో ఏర్పడతాయి. వీటిలో సూర్య గణాలు(ఇవి 2 : న గణం - lll గలం - Ul) ఇంద్ర గణాలు(ఇవి 6: నల - నగ - సల - భ - ర - త) ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది.
ఉదా: కందం, ద్విపద, తరువోజ మొదలైనవి.
ఉపజాతులు : ఇవి కూడా మాత్రాగణాలతో ఏర్పడతాయి. ప్రాసనియమం పాటించవు. యతికి బదులు ప్రాసయతి పాటిస్తాయి. ఉదా: ఆటవెలది, తేటగీతి, సీసం
| జాతి పద్యం | గణాలు | పాదాలు | యతి స్థానం | ప్రాస నియమం | విశేషాలు |
| కందం | గగ - భ - జ - స - నల | 4 | 4 వ గణం మొదటి అక్షరం | ఉంది | 1. బేసి గణంలో జ గణం ఉండకూడదు. 2. 6 వ గణం నలం / జ గణం ఉండాలి. 3. 2 - 4 పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి. |
| ద్విపద | 3 ఇంద్ర గణాలు + 1 సూర్య గణం | 2 | 3వ గణం తొలి అక్షరం | ఉంది | - |
| తరువోజ | 3 ఇంద్ర గణాలు + 1 సూర్య గణం + 3 ఇంద్ర + 1 సూర్య గణాలు | 4 | 1-3-5-7 గణాల తొలి అక్షరాలు | ఉంది | - |
ఉపజాతులు : ఇవి కూడా మాత్రాగణాలతో ఏర్పడతాయి. ప్రాసనియమం పాటించవు. యతికి బదులు ప్రాసయతి పాటిస్తాయి. ఉదా: ఆటవెలది, తేటగీతి, సీసం
| ఉపజాతి పద్యం | గణాలు | పాదాలు | యతిస్థానం | ప్రాసనియమం |
| ఆటవెలది | 3 సూర్య గణాలు + 2 ఇంద్ర గణాలు + 5 సూర్య గణాలు ఇనగణత్రయంబునింద్రద్వయంబు హంసపంచకంబు ఆటవెలది | 4 | 1 - 4 గణాల మొదటి అక్షరాలు | లేదు |
| తేటగీతి | 1 సూర్య గణం + 2 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు | 4 | 1 - 4 గణాల మొదటి అక్షరాలు | లేదు |
| సీసం | 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు | 4 | 1-3-5-7 గణాల మొదటి అక్షరాలు | లేదు |
0 comments:
Post a Comment