Pages

తెలుగు వ్యాకరణం - ఉచ్చారణము - దంత్యములు - తాలవ్యములు

తెలుగు వ్యాకరణం - ఉచ్చారణము  - దంత్యములు - తాలవ్యములు  

ప్రశ్న :- ఉత్పత్తిస్థానమును బట్టి వర్ణములు ఎన్ని విధములుగా విభజింప బడినవి? అవి ఏవి? 

సమాధానము : ఉత్పత్తి స్థానమును బట్టి వర్ణములు తొమ్మిది విధములుగా విభజింపబడినవి. 

అవి 1. కంఠ్యములు 2. తాలవ్యములు 3. మూర్ధన్యములు 

        4. దంత్యములు 5. ఓష్ఠ్యములు 6. నాసిక్యములు 

        7. కంఠతాలవ్యములు 8.కంఠోష్ఠ్యములు 9. దంతోష్ఠ్యములు.

 ప్రశ్న :- కంఠ్యములనగానేమి?

సమాధానము : కంఠము నుండి పుట్టిన వర్ణములను కంఠ్యములందురు. 

అవి: - అ - ఆ - క - ఖ - గ - ఘ - ఙ - హ - ః. 

 ప్రశ్న :- తాలవ్యములనగానేమి?

సమాధానము : తాలువు (దౌడ) ల నుండి పుట్టిన వర్ణములను తాలవ్యము

లందురు. 

అవి : ఇ - ఈ - చ - ఛ - ఙ - ఝ - ఞ - య - శ. 

ప్రశ్న :- మూర్ధన్యములనగానేమి?

సమాధానము : మూర్ధము (నోటిపై భాగం) నుండి పుట్టిన వర్ణములను

మూర్ధన్యములందురు. 

అవి: - ఋ - ౠ - ట - ఠ - డ - ఢ - ణ - ర - ఱ - ల - ళ - ష 

 ప్రశ్న :- దంత్యములనగానేమి?

సమాధానము : దంతములనుండి పుట్టిన వర్ణములను దంత్యములందురు.

అవి:  త - థ - ద - ధ-న - ల - స - ౘ - ౙ. 

ప్రశ్న :- ఓష్ఠ్యములనగానేమి?

సమాధానము : ఓష్ఠ్యము (పెదవి) ల నుండి పుట్టిన వర్ణములను ఓష్ఠ్యము 

లందురు. 

అవి:  ఉ - ఊ - ప - ఫ - బ - భ - మ. 

ప్రశ్న :- నాసిక్యములనగానేమి?

సమాధానము : నాసిక (ముక్కు) నుండి పుట్టిన వర్ణములను నాసిక్యము లందురు. 

అవి:  ఙ - ఞ - ణ - న - మ - ౦ - ఁ - ః

ప్రశ్న :- కంఠతాలవ్యములనగానేమి? 

సమాధానము : కంఠము - తాలువుల నుండి పుట్టిన వర్ణములను కంఠతాలవ్యము లందురు. 

అవి:  ఎ - ఏ - ఐ 

ప్రశ్న :- కంఠోష్ఠ్యములనగానేమి?

సమాధానము : కంఠము -  పెదవుల నుండి పుట్టిన వర్ణములను కంఠోష్ఠ్యములందురు. 

అవి: ఒ - ఓ - ఔ

 ప్రశ్న :- దంతోష్ఠ్యమనగానేమి? 

సమాధానము : దంతము - పెదవుల నుండి పుట్టిన వర్ణమును 'దంతోష్ఠ్యము' అందురు. 

అది: 'ప'. 

              దంత్యములు - తాలవ్యములు 

 ప్రశ్న :- చ, జ లు ఎన్ని విధములు? అవి ఏవి?

సమాధానము : చ - జలు రెండు విధములు. 

అవి: 1. దంత్యములు  2. తాలవ్యములు. 

 ప్రశ్న :- దంత్య చ -  జ లనగా నేమి? వాటిని ఎట్లు పలుకుదురు?

ఎట్లు వ్రాయుదురు? 

సమాధానము : (1) అ - ఆ - ఉ - ఊ - ఒ - ఓ - ఔ లతో గూడిన చ - జ లను దంత్యములందురు. 

(2) వీనిని పలుకునప్పుడు నాలుక కొన ముందరి పండ్ల యొక్క వెనుక

భాగమును తాకవలయును. 

(3) వ్రాతయందు వీనికి తలపైన '౨'  ఈ గుర్తు నుంచెదరు.

ఉదా : చలి - చాప - చుక్క- చూపు

చొక్క- చోటు - చౌక

 జత - జాతర - జున్ను- జూలు

 జొన్న- జోల - జౌకు మున్నగునవి.

(శిష్ట వ్యావహారిక భాషలో "౨" ఈ గుర్తు ఉంచకపోయినను ప్రమాదము  లేదు. గ్రాంధిక భాష వ్రాయునప్పుడు ఈ గుర్తునుంచవలయును.)

ప్రశ్న :- తాలవ్యము చ - జ లనగానేమి? వాటినెట్లు పలుకవలయును?

సమాధానము : 1. ఇ - ఈ - ఎ - ఏ లతో కూడియున్న చ - జలను తాలవ్యములందురు. 

2. వీనిని పలుకునప్పుడు నాలుక కొన తాలువును స్పృశింపవలయును.

ముందరి పండ్లకు పైభాగమున నున్న మెత్తని భాగమును తాలువు అందురు.

3. వీనిని వ్రాయునపుడు వీనికి తలపైన ''౨"  గుర్తు నుంచరు.

ఉదా : చిలుక - చీమ - చెలువ - చేమ - జిలుగు - జీడి- జెఱ్ఱి - జేజే మున్నగునవి. 

 ప్రశ్న :-చ - జలలోని విభేదమును తెలిసికొనుట వలన ప్రయోజనమేమి?

సమాధానము : చ - జ లలోని విభేదమును తెలిసికొనుట వలన వాటి ఉచ్చారణ సక్రమముగా నుండును.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు