Pages

సంస్కృత సంధులు - విసర్గ సంధి

సంస్కృత సంధులు - విసర్గ సంధి 
1) అ కారమునకు తరువాత నున్న విసర్గమునకు అ, హ, య, వ, ర, ల - లును, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములను పరమైనచో ఆ విసర్గము - ఉ కారముగా మారును. అపుడు గుణసంధి జరుగును. 
ఉదా: రక్ష + వల్లభుఁడు --> రక్ష + ఉ+ వల్లభుఁడు -->రక్షోవల్లభుఁడు 
         సుమనః + మధువు ---> సుమన + ఉ+ మధువు ----> సుమనోమధువు 
         యశః + గానము ---> యశ + ఉ+ గానము ---> యశోగానము 
         మనః+ధనము --> మన + ఉ+ ధనము ----> మనోధనము 

2) విసర్గమునకు శ, ష, స - లు పరమైనచో శ, ష, స - లు ఆదేశమగును. 
ఉదా: తపః + శక్తి ---> తప + శ్ + శక్తి ---> తపశ్శక్తి 
          ఉచ్చై + స్వరము ---->  ఉచ్చై + న్ + స్వరము ----> ఉచ్చైస్స్వరము

3) కొన్ని చోట్ల విసర్గమునకు రేఫమాదేశమగును 
ఉదా: చతు + భుజుఁడు ---> చతు + ర్ + భుజుడు ---> చతుర్భుజుడు 
           ధనుః + విద్య ----> ధను + ర్ + విద్య ---> ధనుర్విద్య 
         ధనుః +భంగము ---> ధను + ర్ + భంగము ---> ధనుర్బంగము 
           

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు