Pages

తెలుగు వ్యాకరణం - సంధులు - ఆమ్రేడిత సంధి - 10th class

తెలుగు వ్యాకరణం - సంధులు - ఆమ్రేడిత సంధి 

సంధి పరిచ్ఛేదము :
సంధి: పూర్వ పర స్వరములకు పరస్పరం ఏకాదేశమగుటను సంధి అంటారు. 

1. ఆమ్రేడిత సంధి: అచ్చునకు ఆమ్రేడితం పరమైనపుడు సంధి తరచుగా అగును. 
ఆదేశాలు రెండు(2) రకములు 
1) ఆదేశము         2) ఏకాదేశము 

1)ఆదేశము: ఆదేశము అనగా ఒక వర్ణము యొక్క స్థానములో ఒకే వర్ణము శత్రువు వలె వచ్చిచేరుట (శతృవాదేశము) ఉదా: వాడు + కొట్టెను = వాడుగొట్టెను 

2) ఏకాదేశము: ఏకాదేశము అనగా రెండు వర్ణముల యొక్క స్థానములో ఒకే వర్ణము శత్రువు వలె వచ్చిచేరుట. ఉదా: ఉప  + ఇంద్రుడు  = ఉపేంద్రుడు 

ఆమ్రేడిత సంధి సూత్రం ఉదాహరణలు:
ఔర + ఔర = ఔరౌర 
ఆహా + ఆహా = ఆహాహా 
తరచుగా అనడం వలన ఒక్కొక్కసారి వికల్పముగా వస్తుంది. 
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి వికల్పం (లేదా)వైకల్పికం 
ఓహోహో = ఓహో + ఓహో 
అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు 
ఎట్లు + ఎట్లు = ఎట్టెట్లు (వైకల్పికం)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి 
అరె + అరె = అరెరె 
ఎంత + ఎంత = ఎంతెంత (వైకల్పికం)

ఆమ్రేడితం అనగా :- ఒక పదం రెండు సార్లు వచ్చినప్పుడు (పూర్వ+పర) రెండవసారి వచ్చిన పదమును ఆమ్రేడితం అంటారు. దీనినే పదము యొక్క "పరరూపం" అని కూడా అంటారు. 

వికల్పం (లేదా)వైకల్పికం :- "విశేషణ కల్ప్యతే - ఇతి వైకల్పికం" అంటే అర్థం సామాన్య రూపము గాక కల్పింపబడిన (సాధింపబడిన) మరియొక రూపము కలది. (సంధి జరిగే రూపం, జరగని రూపం)

విభాషా : "విశేషణ రూపేణ భాష్యతే - ఇతి విభాషా" అంటే అర్థం సామాన్య రూపముతో పాటు. మరియొక విశేష రూపంతో పలుకబడినది. 
ఉదాహరణ: పూచెనుగలువలు ----->సామాన్య రూపం 
                     పూచేగలువలు, పూచెంగలువలు ------> విశేష రూపం 

సూత్రం 2:  ఆమ్రేడితం పరమైనపుడు "కడాదుల" తొలియచ్చు, మీది వర్ణాల కెల్ల అదంతమైన ద్విరుక్తటకారం  వస్తుంది. 
కడాదులు అనగా కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు, మొదలు మొదలగునవి. 
ఉదా: పగలు + పగలు = పట్టపగలు 
కడ + కడ = కట్టకడ 
ఎదురు + ఎదురు = ఎదురెదురు 
తెన్ను + తెన్ను, పిడుగు + పిడుగు, కొన + కొన, తెరువు + తెరువు, బయలు + బయలు, చివర + చివర, నడుమ + నడుమ, మొదలు + మొదలు, తుద + తుద, పగలు + పగలు, మొదట + మొదట 

సూత్రం 3: "అందందుకు" ప్రభృతులు యథా ప్రయోగంబు గ్రాహ్యంబు 
              ఉదా: అందుకు + అదుకు 
                          చ్చెర + చ్చెర
                         చెదురు + చెదురు = చెల్లాచెదురు 
                          విడి + విడి = విచ్చలవిడి 

సూత్రం 4: ఆమ్రేడితం పరమగునపుడు "ఇంచుక" నాడు ఇత్యాదులందు అంత్యమాక్షర లోపంబగు 
 ఇంచుక + ఇంచుక = ఇంచించుక 
నాడు + నాడు = నానాడు 
దాపు + దాపు = దాదాపు   

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు