Pages

Telugu Grammar - Sandhi Karyamulu

వ్యాకరణం - సంధి కార్యములు 
1. ఏకాదేశమనగా నేమి?
సమాధానం : మొదటి పదంలోని చివరి అచ్చును, రెండవ పదంలోని మొదటి అచ్చును పోయి వాటికి సమానమైన మరొక అచ్చు గాని లేక రెండవ పదము మొదటి అచ్చు (పరాచ్చు) గాని వచ్చుటను ఏకాదేశమందురు. 

ఉదా: ఉదయ + అద్రి = ఉదయాద్రి 
           రాముఁడు + అతఁడు = రాముఁడతఁడు

2. ఆదేశమనగా నేమి?
సమాధానం : ఒక అక్షరమును తొలగించి వేరొక అక్షరము శత్రువు వలె వచ్చుటను ఆదేశమందురు. 

ఉదా: అతఁడు + చేయ = అతఁడుసేయ 
          ఇందు "చ" కు "స" ఆదేశముగా వచ్చినది. 

3. ఆగమమనగా నేమి?
సమాధానం : రెండు పదముల మధ్య మరొక అక్షరము మిత్రుని వలె అధికముగా వచ్చి చేరుటను "ఆగమము" అందురు. 

ఉదా: పెంకు + ఇల్లు = పెంకుటిల్లు 
            ఇందు "ట ఆగమముగా" వచ్చినది. 

4. నిత్యమనగా నేమి?
 సమాధానం : విధించిన సంధి కార్యము తప్పని సరిగా వచ్చుటను నిత్యమందురు. 

ఉదా: రామ + అయ్య = రామయ్య 

5. విభాష(వైకల్పికము) అనగా నేమి?
సమాధానం : విధించిన సంధి కార్యము ఒకసారి వచ్చుటను మరొకసారి రాకపోవుటను విభాష లేక వైకల్పికము అందురు. 

ఉదా: మేన + అత్త = మేనత్త, మేనయత్త 
           ఇందు సంధి జరిగినప్పుడు 'మేనత్త' గను, సంధి జరుగనపుడు యడాగమము వచ్చి 'మేనయత్త' గను మారినది. 

6. బహుళమనగా నేమి?
సమాధానం : విధించిన సంధి కార్యము ఒకసారి నిత్యమగును, వేరొకసారి వైకల్పికముగను(విభాష), మరొకసారి అసలు రాకుండుటను, ఇంకొకసారి విధించిన కార్యమునకు బదులు వేరొక కార్యము వచ్చుటను బహుళ మందురు. 

ఉదా: రామ + అయ్య = రామయ్య (నిత్యము)
         పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు, పుట్టిన యిల్లు (విభాష)
          వనిత + ఆమె = వనితాయమె (సంధి రాకుండుట)
         ఒక + ఒక = ఒకానొక (అన్య విధము)

7. ఆమ్రేడితమనగా నేమి?
సమాధానం : రెండుసార్లు చెప్పబడిన పదములలో రెండవ పదమును 'ఆమ్రేడితము' అందురు. 
              ఉదా: ఔర + ఔర = ఔరౌర 
                         ఇందు రెండవ 'ఔర' ఆమ్రేడితము

8. ద్విరుక్తమనగా నేమి?
 సమాధానం :  రెండుసార్లు చెప్పబడిన దానిని ద్విరుక్తమందురు. 

                    ఉదా: ఓహో + ఓహో = ఓహోహో 
                               ఇందు 'ఓహో' ద్విరుక్తము. 

9. ద్విత్వమనగా నేమి?
సమాధానం :  ఒక హల్లు క్రింద అదే హల్లు వచ్చిన ద్విత్వమందురు. 

               ఉదా: అక్క - ఇందు 'క్క' ద్విత్వము. 

10. సంయుక్తము అనగా నేమి?
సమాధానం :  ఒక హల్లుతో వేరొక హల్లు చేరిన 'సంయుక్తము' అందురు. 

                        ఉదా: విద్య - ఇందు 'ద్య' సంయుక్తము. 

11. సంశ్లేషమనగా నేమి?
సమాధానం : సంధి జరుగునపుడు మొదటి పదము చివరి హల్లు, రెండవ పదము మొదటి హల్లుతో చేరుటను సంశ్లేమందురు. 

                ఉదా: రామున్ + గొలిచెద = రామున్గోలిచెద. ఇందు ' న్గో' అనునది సంశ్లేషము. 

12. లోపమనగా నేమి?
 సమాధానం : అక్షరము లోపించుటను 'లోపము' అందురు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు