Pages

తెలుగు వ్యాకరణం - సంధులు - గ,స,డ,ద ,వ దేశ సంధి - 10th class

                                 తెలుగు వ్యాకరణం - సంధులు - గ,స,డ,ద ,వ దేశ  సంధి - 10th class
గ,స,డ,ద ,వ దేశ  సంధి: 1) ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళంగా వచ్చును. (వికల్పంగా ఆదేశమగును)
2) ద్వంద్వంబు మీది పరుషములకు గ, స, డ, ద, వ లు నిత్యంగా వస్తాయి. 
3) ప్రథమ సంస్కృత పదములకు గ, స, డ, ద, వ లు రావు. 
4) ఈ కార్యము కళలైన క్రియా పదము మీద సహితం వచ్చును. 
ప్రథమ మీది: ప్రథమా విభక్తి ప్రత్యయములతో కూడినది. 
పరుషములు: వర్గ ప్రథమాక్షరములు 
బహుళం: ప్రవృత్తి, అప్రవృత్తి, నిత్యము, అన్యము 
కళ: "న" కారము చివర లేనిది కళ (ధ్రుత ప్రకృతికం కానివి కళలు)
దృతము: :న" కారము దృతము; న కారం చివర ఉన్న పదం, ధ్రుత ప్రకృతికం. 
ఉదాహరణలు 1 సూత్రం: 
వాడు + కొట్టె = వాడుగొట్టె, వాడు కొట్టె 
                                        అపుడు + చనియె = అపుడుసనియె, అపుడుచనియె 
                                       నీవు + టక్కరివి = నీవు టక్కరివి, నీవు డక్కరివి 
                                       నీవు + తప్ప = నీవుదప్ప, నీవుతప్ప 
                                       వాడు + పోయెను = వాడుపోయెను, వాడుబోయెను 
కళల రూపాలు : 
రారు + కదా = రారుగదా, రారుకదా 
                          వత్తురు + పోదురు = వత్తురుపోవుదురు
సంస్కృత పదాలకు గ, స, డ, ద, వ లు రావు: 
వాడు + కంసారి = వాడుకంసారి 
వీడు + చక్రపాణి = వీడుచక్రపాణి 
అది + తథ్యము = అతితథ్యము 
ద్వంద్వం: ఉభయ పద అర్థ ప్రధానమైనది
కూర + కాయ = కూరగాయలు
కాలు + చేయి = కాలుసేతులు
తల్లి + తండ్రి = తల్లితండ్రులు
ఊరు + పల్లెలు = ఊరువల్లెలు
టక్కు + టెక్కు = టక్కుడెక్కులు                                                                  

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు