Pages

తెలుగు వ్యాకరణం - సంధులు - పుంప్వాదేశ సంధి - 10th class

తెలుగు వ్యాకరణం - సంధులు - పుంప్వాదేశ సంధి  - 10th class
పుంప్వాదేశసంధి:  కర్మధారయ సమాసాలలో "ము" వర్ణకానికి బదులు "పుంపు" లు ఆదేశంగా వస్తాయి. 

కర్మధారయమనగా: సమాస పదాలలో ఒక పదం విశేషణం, ఒక పదం విశేష్యం (నామవాచకం) తో కూడినది కర్మధారయం అంటారు. దీనినే సమానాధికారణం అంటారు. 
ఉదా:  అచ్చము + పూలతోట = అచ్చపు పూలతోట, అచ్చంపు పూలతోట
             నీలము + కండ్లు = నీలపు గండ్లు, నీలంపు గండ్లు
             ముత్యము + సరులు = ముత్తెపు సరులు, ముత్తెంపు సరులు
              సరసము + మాట = సరసపు మాట, సరసంపు మాట
              సింగము + కొదమ = సింగపు కొదమ, సింగంపు కొదమ
              ముత్యము + చిప్ప = ముత్యపు చిప్ప, ముత్యంపు చిప్ప 
              కొంచెము + నరుడు = కొంచెపు నరుడు, కొంచెంపు నరుడు 
              ప్రపంచము + అంగడి = ప్రపంచపు అంగడి
              వజ్రము + గనులు = వజ్రపు గనులు 
              కనకంబము + గుళ్ళు = కనకంబపు గుళ్ళు  

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు