Pages

తెలుగు సూక్తులు

తెలుగు సూక్తులు 
సత్యవాక్కు, దాన గుణముల గొప్పతనం పై సూక్తులు, నినాదాలు :

ఆడి తప్పకు - ఇచ్చి దెప్పకు 
పలికి బొంకకు - ఇచ్చి పుచ్చుకోకు 
సత్యమే సర్వమతసారం 
సత్యమున్నచోటనే ధర్మము - ధర్మమున్నచోటునే జయము తథ్యము 
సత్యంబు గలచోట సమకూరు శుభములు 
దాతలేని కొంప, దయ్యాల పెనువాడ 
సత్యస్య వచనం శ్రేయః 
సత్యాన్ని మించిన ధర్మం లేదు 
సత్యము నూర్గురు పుత్రుల కంటే శ్రేష్టము 
సత్యం కంటె సుకృతము, అసత్యం కంటె పాతకము లేదు 
సత్యాన్ని మించిన ధర్మము, తల్లిని మించిన దైవము లేదు 
సత్యం ముందర, సర్వధర్మాలూ ధూళి సదృశాలు 
దానధర్మాలకు కాని ధనం, ఎంతున్నా దండగే 
నేటి దానం, భావి జన్మ సుఖానికి ప్రధానం 
పెట్టిన వాడికే, పుట్టెడు సొమ్ములు 
సత్యాన్నాస్తి పరోధర్మః 
తన ఆకలిని సహించుకునే తపోధనుడి శక్తి కన్నా, ఇతరుల ఆకలిని తీర్చే దానశీలి శక్తి మిన్న!
ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అది కంఠశోష. 
సంకల్పమే సకల విజయాలకు మూలం. సాధించాలనే తపనే విజయం వైపు వేసే తొలి అడుగు. 
పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి. 
అవి బాగుపడాలంటే నువ్వు బాగుపడాలి. 
మారుతున్న ప్రపంచంతో పాటు మనమూ మారాలి. 
సహజమైన పర్యావరణ పరిసరాల వల్ల జీవానందం పునరుత్తేజం పొందుతుంది. జీవించాలనే తపన నిరంతరం పునరావృతమవుతుంది. 
మంచి సమాజం మనిషి శరీరం వంటిది. అందుకే శరీరమైనా, సమాజమైనా - అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగినా, నివారణకు అందరూ నడుం బిగించాలి. 
తన తోటివారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ, గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్నిస్తుంది. 
సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యము. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. 
మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం, మృతి చెందకుండా ఉంటే చాలు. ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది. 
చరిత్ర స్వదేశాభిమానాన్ని నేర్పే చక్కనైన సాధనం. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు