ఎంతో మంది రాజులు
| రేరాజు చంద్రుడు |
| దినరాజు సూర్యుడు |
| యక్షరాజు కుబేరుడు |
| మృగరాజు సింహం |
| ఫణిరాజు ఆదిశేషుడు |
| సురరాజు దేవేంద్రుడు |
| రారాజు దుర్యోధనుడు |
| నటరాజు పరమేశ్వరుడు |
| నగరాజు హిమవంతుడు |
| ఖగరాజు గరుత్మంతుడు |
| రామరాజు విప్లవవీరుడు |
| విఘ్నరాజు వినాయకుడు |
| ధర్మరాజు పాండవాగ్రజుడు |
| యమధర్మరాజు కృతాంతుడు |
| రాజరాజు రాజరాజనరేంద్రుడు |
| ఈ రాజులు గాక రాజ్యము లేని రాజులు, రాజుల ముందు తలవంచని తెలుగురాజులు ముగ్గురు ఉన్నారు. వారు |
| గుడులు కట్టించే కంచర్ల "గోపరాజు" |
| రాగములు కూర్చె కాకర్ల "త్యాగరాజు" |
| పుణ్యకృతి వ్రాసె బమ్మెర "పోతరాజు" |
| రాజు లీమువ్వురును భక్తి రాజ్యమునకు. |
0 comments:
Post a Comment