Pages

తెలుగు వ్యాకరణం - సంధులు - రుగాగమ సంధి - 10th class

తెలుగు వ్యాకరణం - సంధులు - రుగాగమ సంధి - 10th class
సూత్రము : "పేదాది" (పేర్వాది) శబ్దములకు "ఆలు" శబ్దం పరమైనపుడు రుగాగమంబగు. 
పేదాది (లేదా) పేర్వాది శబ్దములు: పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, మనుమ, గొడ్డ, అయిదువ, ముగ్ధ 
ఆగమము: మిత్రాగమము 
2) కర్మధారయములో తత్సమ శబ్దాలకు "ఆలు" శబ్దం పరమైనపుడు పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వమును రుగాగమంబగు. 
కర్మధారయము అనగా: విశేషణ విశేష్యాలతో కూడినది కర్మధారయం(సమానాధికరణము)
తత్సమ శబ్దాలు: సంస్కృత పదాలు: ధీర, గుణవంత, విద్యావంత, ధైర్యవంత, శ్రీమంత, బుద్ధిమంత 
సూత్రము 1. ఉదాహరణలు: (ద్ +అ +ర్ +ఆ)
పేద + ఆలు = పేదరాలు 
బీద + ఆలు = బీదరాలు 
ముద్ద + + ఆలు =  ముద్దరాలు 
బాలెంత + ఆలు = బాలెంతరాలు 
కొమ + ఆలు = కొమరాలు 
మనుమ + ఆలు = మనుమరాలు 
గొడ్డ + ఆలు = గొడ్రాలు, గొడ్డరాలు 
అయిదువు + ఆలు = అయిదవరాలు 
ముగ్ధ + ఆలు = ముగ్ధరాలు 

సూత్రము 2. ఉదాహరణలు: (త్  +అ +ర్ +ఆలు)
శ్రీమంత + ఆలు = శ్రీమంతురాలు 
ధీర + ఆలు = = ధీరురాలు 
గుణవంత + ఆలు = గుణవంతురాలు 
విద్యావంత + ఆలు = విద్యావంతురాలు 
ధైర్యవంత + ఆలు = ధైర్యవంతురాలు 
బుద్ధిమంత + ఆలు = బుద్ధిమంతురాలు 
పుణ్యాత్మ + ఆలు = పుణ్యాత్మురాలు 
పాపాత్మ + ఆలు = పాపాత్మురాలు 

1 comments:

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు