Pages

విదుర నీతులు - Vidura Nitulu

విదుర నీతులు 

సంజయ రాయభారం పూర్తయింది. కుటిలచిత్తులకు భయం వెంటాడుతుంది. మనస్సు వికలత్వం పొందిన ధృతరాష్ట్రునికి భవిష్యత్ చెడుగా కన్పిస్తోంది. రాత్రి నిదురపట్టడం లేదు. ద్వారపాలకుని ద్వారా సర్వధర్మ మర్మజ్ఞుడు విదురుని రప్పించుకొని  తన మనస్సుకు శాంతి కలిగించే మాటలు చెప్పమన్నాడు. ఆనాడు విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన మంచి మాటలే  యీ విదురనీతులు. ఇవి ఆనాటి నుండి నేటి వరకూ అందరికీ శిరోధార్యములుగానే వర్తించుచున్నవి. వీటిని మనము ఆచరించుదాము . 


ఓ ధృతరాష్ట్ర మహారాజా !
  • బలవంతులతో విరోధం మంచిదికాదు.
  • మన శత్రువు బలవంతుడైతే మనకు నిద్ర పట్టదు. (అతనెప్పుడు దాడి చేస్తాడోననే భీతి మనలకు నిద్ర పట్టనివ్వదు)  
నిద్రరానివారు : 
  • అన్యాయముగా ఇతరుల సంపద దొంగిలించాలనుకొనేవారు.(పాండవుల రాజ్యం అపహరించాలన్న కాంక్ష ధృతరాష్ట్రునికి నిద్ర రాకపోవడానికి కారణం)
  • పరస్త్రీయందు మనస్సున్నవాడు (పరస్త్రీయందు లగ్నమైన వానికి ఆమెను ఎలా లొంగదీసుకోవాలో అనే ప్రయత్నమే తప్ప వేరే ఆలోచనలేక నిద్ర వుండదు) 
  • దొంగతనం చేసేవాడు
మంచిగుణాలున్నవారు ఎటువంటి కష్టాలనైనా సహనంతో భరిస్తారు.
అసమర్థులు రాజ్యాన్ని పాలిస్తే శాంతికి భంగము కలుగుతుంది. (అరాచక శక్తులను అసమర్ధులు అణచలేరు) 
ఎన్నటికీ నష్టపోనివారు :
  • సాధుజీవి
  • ఉద్యోగి 
  • దుఃఖములయందు ధైర్యము గలవారు.
  • ధర్మబుద్ధి గలవాడు. 
పండిత లక్షణములు :
  • చెడు పనులకు దూరముగా నుండుట 
  • దైవభక్తి
  • శ్రద్ధాసక్తులతో మంచి పనులు చేయుట. 
పండితుడు దూరముగా ఉంచవలసినవి :
  • కోపము 
  • సిగ్గు 
  • గర్వము 
  • స్వీయ ప్రశంస 
ప్రజలు ఎవరి నుండి సలహాలు ఎక్కువగా స్వీకరిస్తారోవారే పండితులు. 
అనవసర విషయాలు మాట్లాడవద్దు.(ఇది  నేటి సమాజములో చాలా ఎక్కువగా వుంది) 
పోయినవాటి గురించి ఆలోచించవదు. (ఇలా శోకించడం వల్ల పోయినవి రావు కదా, ఉన్నవి కూడా పోయే అవకాశమున్నది) 
గొంతెమ్మ కోర్కెలు వద్దు.
కష్టాలలో నిబ్బరంగా వుండు.
సోమరిగా ఉండకు. 
పండితుడు గౌరవ, తిరస్కారములను ఒకేలా స్వీకరిస్తాడు.
ఉపాయంలో అపాయాలు లేకుండా చూసుకొనేవాడు పండితుడు.(ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి విశ్లేషించుకొని అప్పుడే ఆ పని చేస్తాడు పండితుడు. పండితుడంటే తెలివైనవాడుగా మనం గ్రహించాలి)
ప్రారంభించిన పనిని మధ్యలో ఆపకు.
ఒక పని చేయడానికి అది చిన్నదైనా పండితుడు నామోషీగా భావించడు.
తెలివైనవాడి మాటకు తిరుగుండదు. 
గ్రంథములోని విషయాలను తెలివైనవాడు సులభముగా గ్రహించగలడు.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు