Pages

ఉప్పు - కర్పూరం - వేమన పద్యసూక్తి

 విశ్వదాభిరామం

ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు;

చూడ చూడ రుచులజాడ వేరు;

పురుషులందు పుణ్యపురుషులు వేరయా! 

విశ్వదాభిరామ! వినుర వేమ!

అర్థము: పోలిక = విధము; రుచులజాడ= రుచులవిధము; పుణ్యపురుషులు = పుణ్యాత్ములు.

భావం: ఉప్పూ, కర్పూరం చూడటానికి ఒక్కలాగే ఉంటాయి. కాని రెండింటి రుచులలో తేడా ఉంటుంది.  అలాగే మనుషులందరూ ఒక్కలాగే కనిపిస్తారు. కాని వారి వారి నడతల్లో, నడకల్లో తేడాలు స్పష్టంగా గోచరిస్తాయి. అప్పుడు తెలుస్తుంది. వాళ్లు ఉత్తమ పురుషులా, ఉత్తపురుషులా అని. కొందరు కేవలం తమ కోసం మాత్రమే బతుకుతూ లోకోపకారకంగా జీవిస్తారు. ఇటువంటి వారిని లోకం మరిచిపోదు. వారే ఉత్తములు. 

వివరణ: ఉప్పూ కర్పూరం పైకి ఒకే మాదిరిగా కన్పిస్తాయి.కాని పరిశీలిస్తే వాటిలోపలి గుణాలు వేరు. కర్పూరం పూజలవంటి ఉత్తమకార్యాలలో వినియోగింపబడుతుంది. ఔషధంగా అనేక బాధలు తీరుస్తుంది. సముద్రంనుంచి ఉప్పు సులువుగా ధారాళంగా లభిస్తుంది.కర్పూరం అరుదుగా దొరుకుతుంది. లోకంలో విలువ ఎక్కువ. మానవులలో ఉత్తములు కూడా అంతే. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు