Pages

Telugu grammar - Samskruta Sandhulu explanation

సంస్కృత సంధులు 
ప్రశ్న: సంస్కృత సంధులు అనగా నేమి?
సమాధానము: సంస్కృత పదముల మధ్య జరుగు సంధులను సంస్కృత సంధులు అందురు. 

ఉదా: ముని + ఇంద్రుఁడు = మునీంద్రుఁడు 

ప్రశ్న: సంస్కృత సంధులు ఎన్ని విధములు?
సమాధానము: సంస్కృత సంధులు రెండు విధములు.
అవి: 1. స్వర సంధులు (అచ్సంధులు)
          2. హల్సంధులు

ప్రశ్న: స్వర సంధులనగా నేమి? అవి ఎన్ని?
సమాధానము: అచ్చుల మధ్య జరుగు సంధులను 'స్వర సంధులు' అందురు.  సంస్కృతంలో స్వర సంధులు ప్రధానముగా 4 విధములు. అవి:
1. సువర్ణ దీర్ఘ సంధి
2. గుణ సంధి
3. వృద్ధి సంధి
4. యణా దేశ సంధి

ప్రశ్న: సవర్ణ దీర్ఘ సంధిని గురించి వ్రాయుము?
సమాధానము: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములు పరమైనపుడు దీర్ఘము ఏకదేశముగా వచ్చును.

సవర్ణములనగా సమానమైన వర్ణములు. సవర్ణములకు దీర్ఘ మేకాదేశముగా వచ్చు సంధి కావున సవర్ణ దీర్ఘ సంధి అయినది.
'అ' వర్ణానికి           'అ - ఆ' లు సవర్ణాలు
'ఇ ' వర్ణానికి           'ఇ - ఈ' లు సవర్ణాలు
'ఉ' వర్ణానికి              'ఉ - ఊ' లు సవర్ణాలు
'ఋ' వర్ణానికి            'ఋ - ౠ' లు సవర్ణాలు

ఉదా: - "అ" కారము 
 అ + ఆ --------> ఆ - రామ + ఆలయము -------> రామాలయము
ఆ + అ --------> ఆ - విద్యా  + అర్థి  -------> విద్యార్ధి
అ + అ  --------> ఆ - రామ + అనుజుఁడు  -------> రామానుజుఁడు
ఆ + ఆ  --------> ఆ - మహా  + ఆనందం  -------> మహానందం

ఉదా: - "ఇ" కారము 
 ఇ + ఇ --------> ఈ - కవి + ఇంద్రుడు  -------> కవీంద్రుడు
ఇ + ఈ  --------> ఈ - కవి + ఈశ్వరుడు   -------> కవీశ్వరుడు 
ఈ  + ఈ   --------> ఈ - మహీ +  ఈశుడు -------> మహీశుడు
ఈ  + ఇ  --------> ఈ - మహీ  + ఇంద్రుడు   -------> మహీంద్రుడు

ఉదా: - "ఉ" కారము 
 ఉ + ఉ --------> ఊ - భాను + ఉదయము   -------> భానూదయము
ఉ + ఊ  --------> ఊ - ధేను + ఊధస్యము    -------> ధేనూధస్యము (ఆవు పాలు)
ఊ  + ఉ   --------> ఊ - వధూ + ఉపేతుఁడు  -------> వధూపేతుఁడు
ఊ  + ఉ  --------> ఊ - వధూ + ఊర్మిళ    -------> వధూర్మిక (కోడలి ఉంగరం)

ఉదా: - "ఋ" కారము 
 ఋ  + ఋ  -  ౠ - పితృ + ఋణము ----------> పితౄణము, పితృఋణము
ఋ కారమునకు ఋ కారము పరమగునపుడు దీర్ఘము వికల్పముగా వచ్చును.

పితృ + ఋణము ----------> పితౄణము, పితృఋణము









0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు