బంగారు మాట
ఉచ్చులను గుర్తించడంలో నక్కలా ఉండాలి. తోడేళ్లను జడిపించడంలో సింహంలా ప్రవర్తించాలి. |
ఓర్పు చేదుగా ఉంటుంది. కానీ, దాని ఫలితం మధురంగా ఉంటుంది! |
మన సమస్యలను పరిష్కరించే మంత్రదండం అంటూ ఏదీ లేదు. మనం చేసే పని, మన క్రమశిక్షణలోనే పరిష్కారాలు దాగి ఉంటాయి. |
తను వెళ్లాల్సిన దారిని మొదట వెతుక్కున్న వాడే.. ఇతరులకు దారి చూపగలడు. |
మంచి మిత్రుల స్నేహం, సత్ప్రవర్తన మిమ్మల్ని డబ్బు తీసుకుపోలేని చోటుకు కూడా తీసుకుపోగలవు. |
సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ని పేదవానిగా చేస్తుంది! |
విజ్ఞతను మించిన మిత్రుడు ...... అజ్ఞానాన్ని మించిన శత్రువు ఈ లోకంలో లేడు. |
వైకల్యం అనేది ఓ మానసిక భావన మాత్రమే. మీరు ఒక్క పని మంచిగా చేసినా సరే...ఇంకొకరికి మీ అవసరం ఉంటుంది. |
మందలింపు తర్వాత ప్రోత్సహించడ మన్నది ..... వాన తర్వాత వచ్చే ఎండ లాంటిది. |
కాలంతో పాటు పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి. వాటితో పాటు నా అభిప్రాయాల్లోనూ మార్పులు వచ్చాయి. |
పూజ, ఉపవాసాలు.. ఆత్మ బలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు! |
భగవంతుడు మీకు ఇచ్చిన శక్తిని మంచికి వాడుకోవాలనుకుంటే ఇతరులకు సేవ చేయండి. అది మీకు సంతృప్తిని, సంతోషాన్ని తీసుకువస్తుంది. |
చెట్టులా ఉపయోగకరంగా ఉండాలి. ఇతరులకు ప్రాణం పోయాలి. ప్రతి ఒక్కరికీ నీడను ఇవ్వాలి. అందరికీ పండ్లను పంచాలి. మొత్తంగా... చెట్టులా మంచిగా బతకాలి. |
నవ్వడం, నవ్వించడం అలవాటైతే.. జీవితంలోని ఒడుదొడుకులు ఏమీ చెయ్యలేవు! |
సంతోషం ఉంటే.. అన్ని నిధులూ ఉన్నట్టే! అదే లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థమే! |
పుస్తక ప్రేమికులు గని కార్మికుల్లాంటి వాళ్లు. బంగారం కోసం వాళ్లు అన్వేషిస్తూనే ఉంటారు. |
మనిషి ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. అలానే, ఆ వ్యక్తి సంపాదించే వేతనం అతను బతకడానికైనా సరిపోవాలి. |
మీరు బయటికి ప్రదర్శించే దాని కంటే ఎక్కువ మొత్తాన్ని దాచుకోండి. మీకు తెలిసిన దాని కంటే కొంత తక్కువ మాట్లాడండి. |
గంగానది... చిరస్మరణీయమైన గతానికి ప్రతీక. వర్తమానంలో ప్రవహించడమే కాదు, భవిష్యత్తు అనే మహాసముద్రంలోకి కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. |
సహనం అంటే వేచిచూడటమే. అలాగని నిర్లిప్తంగా ఉండిపోవడం మాత్రం కాదు. అది సోమరితనం! నడక కష్టంగా, నెమ్మదిగా సాగుతున్నప్పుడు కూడా నడుస్తూ ఉండటమే సహనమంటే. మనిషికి రెండు శక్తిమంతమైన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. అవి.. సహనం, కాలం. |
ఎలాంటి ప్రయోజనమూ ఇవ్వని కష్టాన్ని నేను కొంచెం కూడా ఇష్టపడను. కష్టం అనేది సృజనాత్మకంగా ఉండాలి. ఏదో ఒక మంచికి జన్మనివ్వాలి. ఎంతో కొంత మార్పునకు కారణం కావాలి. |
ప్రతీ తరం కూడా తన ముందు తరం కంటే తెలివైనదే అనుకుంటుంది. అదే సమయంలో, రాబోయే తరం కంటే కూడా విజ్ఞానవంతులమే అనుకుంటుంది. |
మనం దుష్కార్యం చేస్తే దుష్పలితాన్నీ, సత్కార్యం చేస్తే సత్ఫలితాన్నీ అనుభవించే తీరాలి. దాన్ని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదు. కారణం ఉంటే కార్యం ఉండి తీరాలి.దాన్ని ఏదీ ఆపలేదు. |
దృఢసంకల్పం' లేకపోతే ఎందరు దేవుళ్ళు మనకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చినా మన సోమరితనాన్ని పోగొట్టలేరు. |
చమురులో తడిసిన కాగితం మీద వ్రాయలేము. అలాగే దుర్గుణాలు, విషయభోగాలు అనే నూనెలో నాని పాడైన మనస్సులో పారమార్థిక భావాలు నిలువవు. |
దేవాలయమనే హృదయతాళాన్ని తీయాలంటే తాళంచెవిని వెనక్కు తిప్పాలి. అంటే భగవంతుణ్ణి పొందడానికి మనస్సును ప్రాపంచిక భోగాల నుండి భగవంతునివైపుకు మరల్చాలి. |
శరీరమనే ప్రమిదలో నిష్ఠ అనే నూనె వేసి, వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, హృదయంలో ఉన్న ఆత్మను దర్శింపజేసుకోవడానికి చేసే ప్రయత్నమే దీపారాధనలోని ఆంతర్యం. |
కార్యాచరణకు మూలం ఆలోచన. కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలతో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపండి. వాటినే స్మరించండి. అప్పుడే అద్భుతాలను సాధించగలరు. |
యౌవనోత్సాహం పరవళ్ళు తొక్కుతున్నప్పుడే మీ భవిష్యత్తును నిర్దేశించుకోండి. ఒక ఆదర్శాన్ని స్వీకరించి, దాన్నే మీ జీవితంగా చేసుకోండి. ఇతర విషయాలను వదలిపెట్టండి. |
పిల్లలు ముందంజ వేయడానికి మీరు తోడ్పడాలి. విషయాన్ని నిర్దేశం చేయడం మీ పనికాదు, అడ్డంకులను తొలగించడమే మీ పని. అప్పుడు వారిలో జ్ఞానం దానంతట అదే వస్తుంది. |
మనం ఇతరులపై నిందలను మోపుతున్నంతవరకు మన తప్పులను మనం గుర్తించలేం.కాబట్టి మన తప్పులకు ఇతరులను నిందించకుండా పూర్తి బాధ్యతను మనమే వహించాలి. |
మనం చేసే ప్రతి పని లోనూ ఆనందం లేకపో వచ్చు. కానీ.. ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని పొందలేం. |
ఒక్కక్షణం సహనం ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. |
కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్దాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు |
విజయం అంటేనీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడం. |
గెలిచిన వారికి గతం ఉంటుంది. ఓడిన వారికి భవిష్యత్తు ఉంటుంది. |
మంచి పుస్తకం చదువడం అంటే ఇష్టమైన ప్రాంతానికి ప్రయాణించడం. పూర్తిగా చదివితే గమ్యాన్ని చేరుకున్న అనుభూతి కలుగకమానదు. |
మారాలి అనుకునే వాళ్ళు మారిపోతారు. నేనింతే అనుకునే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు. |
యౌవనం అంటే పాటలు, ఆనందం అని తేలికగా తీసుకోకు. దాని మీద దయతలచి, నీ గులాబీలు ఎంత త్వరగా వాడిపోతాయో గుర్తుచేసుకో. |
మన శక్తి కన్నా సహనం చాలా సార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. |
నేను సత్యాన్ని తప్ప మరొకటి చెప్పలేను. ఎవరినో సంతృప్తి పరచడం కోసం విధి నిర్వహణలో వెన్ను చూపలేను. |
కోరికలు అనుభవించేకొద్దీ ఇంకా పెరుగుతాయే కానీ తరుగవు |
ధనానికి అందరూ దాసులే |
దైవం వక్రించినపుడు గడ్డిపోచ కూడా వజ్రాయుధమవుతుంది |
దానంతో శత్రువులు కూడా మిత్రులవుతారు |
విశ్వాసపాత్రుడైనవాడే మిత్రుడు |
పడిన శ్రమకు ఫలితం లభించినప్పుడు శ్రమగా తోచదు |
అన్ని అనర్థాలకు కోపమే మూలం |
పనిచేసేవాడికి దేనికీ కరువు ఉండదు |
ఉపకారం పొందినపుడు ప్రత్యుపకారం చేయాలి |
చెడుపని చేయనంతవరకే కీర్తి ఉంటుంది |
మహాత్ములకు ధర్మమే ధనం |
కష్టపడే వాడే ఫలితాన్ని పొందుతాడు |
సజ్జనుల మాట పాటించాలి |
కలహం పెరగడానికి సహాయపడొద్దు |
కోరికలు కష్టాలకు లోను చేసే శత్రువులు |
పీడితులకు సహకరించేదే ఉత్తమమైన హస్తం |
శ్రమించని వారిని దేవతలు అనుగ్రహించరు |
గర్వం చేతికి చిక్కిన పనిని కూడా చెడగొడుతుంది |
వట్టి ప్రగాల్భాలు పలికేవానికన్నా కార్యాచరణ చేసి చూపేవాడు గొప్పవాడు |
దానం చేసేవాడి ధనం ఎప్పుడూ వ్యర్థంగా పోదు |
కఠినమైన వాక్కును త్యజించు |
ఈర్ష్య కలహానికి మూలం; ఓర్పు సంపదలకు మూలం |
ఆశయమే పరమ దుఃఖం, నిరాశ పరమ సుఖం |
తండ్రి వందమంది ఆచార్యులతో సమానం |
ఆచార్యుణ్ణి దేవునిగా భావించు |
పెద్దల ఆశ్రయం ఉన్నప్పుడు, అసమర్ధుడు కూడా శోభిస్తాడు |
విద్య రాని బ్రతుకు వ్యర్థం |
బుద్ధిమంతుడు తన లేమిని మనస్తాపాన్ని వెల్లడించకూడదు |
శత్రువునుండైనా సచ్చిలం నేర్చుకోవాలి |
విద్య అభ్యాసాన్ని బట్టీ, కర్మను బట్టీ ఉంటుంది |
అన్నదానం కన్నా ఉత్తమదానం లేదు |
దైవం అనుకూలిస్తే అందరికీ శుభం కలుగుతుంది |
సాహసం చేయందే శ్రేయస్సు కలుగదు |
వచ్చిన మేలును కాదనకూడదు |
ఎంత మేధ ఉన్నా, అభ్యాసం చేయకపోతే చదువుకున్న విద్య నశిస్తుంది |
ధనం సుఖాన్ని సాధించదు |
అన్నింటా అతిని వర్జించాలి |
అతిథిని దేవునిగా భావించు |
కఠినమైన మాట నిప్పుకన్నా ఎక్కువ బాధిస్తుంది |
శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి. |
నిరాశ కొందరిని కుంగదీస్తుంది. దురాశ అందరినీ దెబ్బతీస్తుంది. |
చేదు ఆలోచనలు ఆలస్యంగా నైనా చెడ్డ ఫలితాల్నే ఇస్తాయి. |
తోటివారితో కలిసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించడమే న్యాయకత్వం. |
పుస్తకాలలో ఉన్న జ్ఞానం, ఇతరుల దగ్గర దాచిన డబ్బు...... ఈ రెండు అవసరానికి ఉపయోగపడవు. |
చెయ్యలేమని గొప్ప పనులనూ చెయ్యాలని లేదని చిన్న పనులను వదిలేస్తే ఏమీ చెయ్యని చాతకానివాళ్ళు గా మిగిలిపోతాం. |
ఉత్తములు - ఇతరులకు సహాయం చేసేటప్పుడు కూడా తామే సహాయం పొందుతున్నంత వినయంతో మెలుగుతారు. |
నిరాశ ఓటమికి ముఖద్వారం. ఆ దారి నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత త్వరగా విజయం చేరువవుతుంది. |
మంచి పొరుగు వల్ల ఇంటి విలువ రెట్టింపవుతుంది. |
మేథాశక్తి క్షీణించడం మొదలైందనడానికి విసుగు తొలి సంకేతం. |
వైఫల్యాలతో పలువురు వెనుదిరుగుతారు. పట్టుదల గల కొద్దిమంది అక్కడి నుంచే విజయయాత్ర మొదలుపెడతారు. |
మీరు రాసేవారైతే చదవదగినది రాయండి. చేసేవారైతే రాయదగ్గది చేయండి. |
మనిషి జీవితానికి వెలుగునిచ్చేది విద్య. |
పనిపట్ల మీకున్న అభిమానమే విజయానికి రహస్యం. |
నువ్వు వందమంది ఆకలి తీర్చలేకపోవచ్చు. కానీ ఒకరి ఆకలి తీర్చు. |
ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు. |
కోపగించుకోవడమంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. |
ఒక పని సాధించాలని ముందుకు వెళితే దాని గురించి ప్రతికూల భావనలు చేయకూడదు. |
మన వ్యక్తిత్వాన్ని బట్టే సమాజంలో గౌరవం లభిస్తుంది. |
ధైర్య సాహసాలు, ప్రతిభ అనేవి వ్యక్తి విజయసాధనకు సోపానాలు. |
కోరికలు లేని వ్యక్తి ఎప్పుడూ తృప్తిగానే జీవిస్తాడు. |
మన అజ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్ళడమే అసలైన విద్య. |
జీవితంలో జరిగిన ఆనందకర సంఘటనలను గుర్తు తెచ్చుకొని, ఆనందాన్ని పెంచుకోవడం వల్ల మనిషి ఆనందంగా ఉండగలడు. |
కష్టాలు నీ శత్రువులు కాదు. నీ బలాల్నీ బలహీనతల్నీ నీకు తెలిపే నిజమైన నేస్తాలు |
ఏ పొరపాటూ చేయ్యట్లేదంటే కొత్తగా ఏదీ ప్రయత్నించట్లేదన్న మాట |
బాగుపడాలనుకునే మనిషి .......... అతినిద్ర, సోమరితనము, పనిలో అలసత్వం, భయం, కోపం........... అనే ఐదు దుర్గుణాలను వదల్చుకోవాలి |
ఆపదలకు ప్రతిక్రియను ముందుగానే ఆలోచించుకోవాలి. ఇల్లు తగలబడుతున్నప్పుడు బావి తవ్వడానికి ప్రయత్నించడం తెలివి తక్కువ పని |
మాటలకూ చేతలకూ తేడా ఉంటే మన మాటలను ఎవరు విశ్వసించరు |
చెడు ఆలోచనలు ఆలస్యంగా అయినా చెడు ఫలితాల్నే ఇస్తాయి |
ఆగ్రహం వివేకశూన్యతతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది |
వెంటనే అమలులో పెట్టని ఆలోచనలు కేవలం ఆశయాలుగానే మిగిలిపోతాయి |
తెలివికి నిదర్శనం తప్పులు వెదకటం కాదు, పరిష్కారాలు సూచించగలగడం |
పొగడ్తలో తక్కువ భాగాన్నీ, నిందలో ఎక్కువ భాగాన్నీ తీసుకునే వారే నాయకులు |
కాకులతో కలిసి తిరిగితే పావురం రూపుమారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది.
ఈ ప్రపంచం మనతో చిత్రాల ద్వారా మాట్లాడుతుంది. ... అప్పుడు మన ఆత్మ సంగీతం ద్వారా సమాధానాలనిస్తుంది.
అందమైన వస్తువు నిరంతరం ఆనందాల జలపాతాలని అందిస్తూ ఉంటుంది. అందం తాలూకు ఆనందం నానాటికీ ఎదుగుతుండే జీవన మాధురి. అది ఎన్నటికీ శూన్యంగా వాడిపోదు.
మనిషి జీవితంలో అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం - ప్రతి మనిషీ తన పని తాను నిజాయితీ తో వ్యవహరించగలగడం.
సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే, యిక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ, ఆపూ ఉండవు.
తల్లిదండ్రులు తమ సంతానానికి అందించినవాటికి ప్రతిఫలం యీ సృష్టి లోనే లేదు.
ఎంత సారవంతమైన క్షేత్రమైనప్పటికి దున్నకపోతే గుట్టలు, ముళ్లపొదలే మొలుస్తాయి. మానవుని మనస్సు కూడా అంతే.
జరిగిపోయిన దాని గురించి విచారం అనవసరం. అది జరిగిపోయిందని సంతోషించాలి. మనం మనలాగే ఉండాలి. మన మనసులో ఏముందో దాచుకోకుండా చెప్పగలగాలి. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్నది మనకు అవసరం లేదు. అలా అనుకున్నా ...... దానిని పట్టించుకోనవసరం లేదు.
ఒక బొమ్మ, దాని పక్కనో మాట రాసి ఉన్నంత మాత్రాన ప్రతి విషయాన్ని నమ్మకూడదు.
హాయిగా నవ్వుకోవడాన్ని మించిన ఆటవిడుపు లేదు.
దేవుడు మనకు విజయాలను అందివ్వడు. విజయానికి కావలసిన శక్తిసామర్థ్యాలను ఇస్తాడు.
పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.
అతి పొగడ్తలు అజ్ఞానానికి బిడ్డల్లాంటివి.
కల్మషం లేని వాడిని ప్రపంచమంతా ప్రేమిస్తుంది.
మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం సుఖమయమవుతుంది.
మనసుకు ఇష్టమైన పని ఏదైనా కష్టముగా అనిపించదు.
విజయం సాధించాలంటే మొదట పనిని ప్రేమించాలి.
పూలలో సువాసన, వ్యక్తులలో యోగ్యత దాచినా దాగవు!
సహనం చేదుగా ఉన్నా, దాని ఫలితాలు తియ్యగా ఉంటాయి.
చేసే పనిలో ఆనందం దొరికితే, వేరే ఆటవిడుపు అక్కర్లేదు.
మంచి వారు మంచి వారితోనే స్నేహం చేస్తారు.
కోపం తెచ్చుకోవటం తేలికే! కానీ కోపగించుకోవలసిన వ్యక్తిని సరైన సమయంలో, సరైన తీరులో, సరైన మేరకు, సరైన కారణంతో కోపగించుకొనే శక్తి అందరికి ఉండదు. ఆ శక్తి సంపాదించటం అంత తేలిక కాదు.
ఆత్మానందం పొందాలంటే - ఆచారంతో పాటు ఆచరణ కూడా చేయాలి .
జగన్నాదుడే ప్రాణనాధుడు - విశ్వెశ్వరుడే ప్రాణేశ్వరుడు .
కష్టనష్టాలు కదిలే మేఘాల వంటివి .
ధర్మాచరణ వలన సద్భుద్ది కలుగుతుంది .
రాగ, ద్వేష రహితుల గృహమే స్వర్గం .
ఆశలను తగ్గించు - ఆశయాలను పెంచు .
గొప్పవారు కావాలి, అయితే మంచివారుగా ఉండాలి .
దేహ శుభ్రతతో పాటు భావ శుద్ధత అత్యంత అవసరం .
వాంఛల త్యాగమే మహోన్నతికి మార్గం .
శాంతి లేకుంటే మనసుకు విశ్రాంతి లేదు .
మితిమీరిన ఆశల వలన మనసు గతి తప్పుతుంది .
కోరికలు పెరిగే కొలది ఆనందం తగ్గుతుంది.
సంసార సాగరం దాటాలంటే - సంస్కారముల పరివర్తన కావాలి
ఆచరణ లేని ప్రచారం పంట పండని భూమి వంటిది
కష్టాలు ఒంటరిగా రావు - అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి.
తృప్తి సహజ సిద్ధమైన సంపద. భోగం కృత్రిమమైన బీదరికం.
వంద మందికి సాయపడలేక పోవచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు.
విద్య అనేది మనిషి నుంచి వేరుచేయలేని విలువైన సంపద.
కొద్దిపాటి కోరికలు ఉన్నవాడే అందరికంటే ధనవంతుడు.
అద్భుతాలను సాధించటానికి మూలం దృఢమైన నమ్మకం.
ఆశ నుంచి విముక్తి పొందుతే దుఃఖం అంతమవుతుంది.
మౌనముగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి.
విజ్ఞానాన్ని పెంచుకోవాలంటే మంచి పుస్తకాలు చదవాలి.
అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా, కష్టార్జితంతో తాగే గంజి ఎంతో సంతృప్తిని ఇస్తుంది.
ముందూ వెనకా ఆలోచించకుండా వాగ్దానాలు ఇచ్చేవారు వాటిని నెరవేర్చలేరు.
స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది. సంతోషాన్ని హెచ్చిస్తుంది.
ధర్మాన్ని మనం రక్షిస్తే - ధర్మం మనలను రక్షిస్తుంది.
జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే గతాన్ని మరవాలి.
చేసిన మేలు మరచిపో - పొందిన మేలు గుర్తుంచుకో.
శ్రేష్టకర్మల జ్ఞానమే భాగ్యరేఖలు గీసే కలము.
చితి నిర్జీవులను కాలుస్తుంది - చింత సజీవులను దహిస్తుంది.
జీవితం కరిగిపోయే మంచు - ఉన్నంతలో నలుగురికి పంచు.
తినటం కోసం జీవించకు - జీవించటం కోసం తిను.
మణుగుల కొద్ది మాటల కన్నా - చిన్నమెత్తు ఆచరణ మిన్న.
మహాద్భుతాలు సాధించాలంటే దృఢ నమ్మకం కావాలి.
మనసు ప్రశాంతముగా ఉంటే, ప్రపంచం మొత్తం ప్రశాంతముగా ఉన్నట్లు కనిపిస్తుంది.
అసూయ అగ్నికణం వంటిది. అది అంటుకుంటే కాల్చే వరకూ వదలదు.
ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడం కన్నా మనలోని లోపాలను సవరించుకుంటే జీవితంలో ఉన్నత వ్యక్తిగా ఎదుగుతాం.
చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్మినట్లు.
తన బలిమి కన్నా స్థాన బలిమి మిన్న
అనువు గాని చోట అధికుల మనరాదు.
కోపం వల్ల మనషులు మూర్ఖులుగా తయారవుతారు.
మండిన కొవ్వొత్తి మనది కానట్టే, గడచిన కాలం తిరిగిరాదు.
చిరునవ్వుల దరహాసంతో వెలిగిపోయేవారితోనే మీరు స్నేహం చేయండి.
పొదుపు చేయాల్సిన చోట ఖర్చు చేయకు, ఖర్చు చేయాల్సిన చోట పొదుపు చేయకు.
పరులను నిందించటం కాదు, ఎప్పటికప్పుడు నీ తప్ప్పులు తెలుసుకొని సరిదిద్దుకో.అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలవు
దుండగాలను కత్తితో ఎదరించినప్పుడు అవి మరింత పెచ్చరిల్లిపోతాయి.ప్రేమతో,శాంతితో వాటిని ఎదుర్కొన్నట్లయితే అవి శాశ్వతంగా అంతరిస్తాయి. -
మనం వెళ్ళింది ముళ్ళదారి అయిన ప్పుడు,ఇంకెవరినీ ఆ వైపు రావద్దని హెచ్చరించడం మన ధర్మం

0 comments:
Post a Comment