శ్రీకృష్ణ శతకము - దండమయా విశ్వంభర
దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళనేత్ర హరీ !
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా !
భావము : ఓ కృష్ణా ! సమస్త జగములను నీయందుoచుకొనిన వాడా ! తెల్ల తామర రేకుల వంటి
కన్నులు గలవాడా ! శ్రీహరీ ! కరుణా సముద్రుడా ! నీకు ఎల్ల వేళల యందును
నమస్కరింతును.
జై శ్రీకృష్ణ! ఈరోజు శ్రీకృష్ణాష్టమి పర్వదినం. అందరికీ శుభాకాంక్షలు.
ReplyDelete