Pages

Potana Bhagawatam - Ksonitalambunan

పోతన భాగవతం - క్షోణితలంబునన్  
క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత 
శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితామర 
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్ 
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్ 

తాత్పర్యము: నేలకు  నెన్నుదురు సోకునట్లు సాగిలపడి మ్రొక్కి సైకత శ్రోణీ, చదువుల వాణీ, అలినీలవేణీ అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలనూ, మరొకచేతిలో రాచిలుకనూ, ఇంకొకచేతిలో తామర పువ్వునూ, వేరొక చేతిలో పుస్తకాన్నీ ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరిస్తుంది. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు