Pages

10th Class Telugu Grammar Study Material # 2

భాషాంశాలు (వ్యాకరణం)
1. 'దారి + అవుతుంది'   - దీంట్లో పూర్వ పరస్వరాలు వరుసగా 
  ఎ) రి + అ         బి) అ + ఇ        సి) ఆ + ఇ          డి) ఇ + అ                (డి) 

2. 'పోవుదురేల'   - ఇది ఏ సంధి? 
  ఎ) గ, స, డ, ద, వా దేశ సంధి          బి) ఉత్వ సంధి         సి) సరళాదేశ సంధి           డి) టుగాగమ సంధి               (బి )

3. 'రుగాగమ సంధి' కి   ఉదాహరణ 
  ఎ) విద్యావంతురాలు          బి) చేవ్రాలు         సి) ఆకురాలు           డి) పావురాలు                (ఎ)

4. 'వంశాంకురం'   - అనే పదాన్ని విడదీస్తే 
  ఎ) వంశ  + అంకురం      బి) వంశా + అంకురం         సి) వంశాం + కురం           డి) వంశం + అంకురం                 (ఎ)

5. 'నిరంతర శ్రద్ధ'   - అనేది  
  ఎ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం           బి) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం       
సి) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం           డి) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం                 (బి)

6. కింది వాటిలో షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ 
  ఎ) దశకంఠుడు          బి) హరిచరణము        సి) కొత్తబాట           డి) దశాబ్దాలు                 (బి)

7. 'గోల్కొండ దుర్గం నాలుగు మైళ్ళ  వైశాల్యంలో నుండెను.' ఈ వాక్యంలో ద్విగు సమానపదం 
  ఎ) గోల్కొండ దుర్గం         బి) వైశాల్యంలో నుండెను       సి) నాలుగు మైళ్ళు           డి) మైళ్ళ  వైశాల్యం                (సి )

8. 'నగరారణ్యం'   - అనే పదానికి సరైన విగ్రహ వాక్యం 
  ఎ) నగరం కొరకు అరణ్యం          బి) నగరం నందు  అరణ్యం         సి) నగరంతో  అరణ్యం            డి) నగరంమను  అరణ్యం                  (డి)

9. 'మేడారం జాతరకు ఇసుకవేస్తే రాలనంత మంది వచ్చారు.' - అనే వాక్యంలో ఉన్న అలంకారం  
  ఎ) రూపకాలంకారం          బి) అతిశయోక్తి అలంకారం      సి) స్వభావోక్తి అలంకారం         డి) ఉపమాలంకారం                 (బి )

10. రూపకాలంకారం లో 
  ఎ) ఉపమాన - ఉపమేయముల మధ్య పోలిక చెప్పబడుతుంది
  బి) ఉపమాన - ఉపమేయముల మధ్య భేదము ఉన్నా లేనట్లు  చెప్పబడుతుంది
 సి) విషయము ఉన్నది ఉన్నట్లుగా వర్ణింపబడుతుంది.
 డి) ఉపమేయమును ఉపమానముగా ఊహించడం జరుగుతుంది                 (బి )

11. అనేకార్థాలను కలిగియుంటే అది 
  ఎ) స్వభావోక్తి అలంకారం         బి) అతిశయోక్తి అలంకారం        సి) రూపకాలంకారం          డి) శ్లేష అలంకారం               (డి)

12. కింది వాటిలో ఛేకానుప్రాసానికి ఉదాహరణ 
  ఎ) నంద నందనుడు కాపాడుగాక!          బి) అడిగెదనని కడువడి జను
 సి) దిక్కులన్నీ ఒక్కటయ్యాయి           డి) ఆమె లత పక్కన నిలుచున్నది                 (ఎ )

13. 'అనవుడు నల్ల నవ్వి కమలాసనయిట్లను లెస్సగాక, యో' - అనే పాదంలో గీత గీసిన పదం ఏ గణం? 
  ఎ) 'జ' గణం          బి) 'ర' గణం       సి) 'మ' గణం         డి) 'య' గణం                (ఎ)

14. ఉత్పలమాలలో వచ్చే గణాలు వరుసగా 
  ఎ) న - జ - భ - జ - జ - జ - ర          బి) భ - ర - న - భ - భ - ర - వ
 సి) మ - స - జ - స - త - త - గ           డి) స - భ - ర - న - మ - య - వ                 (బి )

15. 'ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా!' - అనే పద్యపాదం ఏ వృతానికి చెందినది?
  ఎ) ఉత్పలమాల         బి) శార్దూలం         సి) మత్తేభం          డి) చంపకమాల                 (సి )

16. శార్దూలము పద్యంలో యతి స్థానము 
  ఎ) 10 వ అక్షరము          బి) 11 వ అక్షరము        సి) 13 వ అక్షరము         డి) 14 వ అక్షరము               (సి )

17. 'ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు మొదలు పెట్టాడు' - అనే వాక్యాన్ని కర్మణి వాక్యంగా రాస్తే 
  ఎ) ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణల చేత మొదలుపెట్టాడు.
బి) ఆయన అంటరాని వర్గాల చేత ఉన్నతి  కోసం సంస్కరణలు  మొదలుపెట్టాడు.
సి) ఆయనచేత  అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు  మొదలుపెట్టాడు.
డి) అంటరాని వర్గాల ఉన్నతి కోసం ఆయనచేత సంస్కరణల చేత మొదలుపెట్టబడ్డాయి.                 (డి)

18. 'నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిది' అని అన్నాడు గూడూరు సీతారాం. - ఈ వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మారిస్తే 
  ఎ) నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిదని అన్నాడు గూడూరు సీతారాం.
బి) నెల్లూరి కేశవస్వామితో తన  స్నేహం 1950ల నాటిదని అన్నాడు గూడూరు సీతారాం.
సి) "నెల్లూరి కేశవస్వామితో తన  స్నేహం 1950ల నాటిది" అని అన్నాడు గూడూరు సీతారాం.        డి) నా స్నేహం నెల్లూరి కేశవస్వామితో  1950ల నాటిదని అన్నాడు గూడూరు సీతారాం.                 (బి )

19. ''నేను వారి గ్రంథాలు చదివాను. వారి పరిచయం పొందలేదు. ' ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే 
  ఎ) "నేను వారి గ్రంథాలు చదివాను కాబట్టి వారి పరిచయం పొందలేదు"
బి) "నేను వారి గ్రంథాలు చదివాను మరియు  వారి పరిచయం పొందలేదు"
సి) "నేను వారి గ్రంథాలు చదివాను కాని  వారి పరిచయం పొందలేదు" 
 డి) "వారి పరిచయం పొందలేదు కాబట్టి నేను వారి గ్రంథాలు చదివాను"                (సి )

20. 'మానవులకు అంకితం ఇవ్వలేదు. రామచంద్రునికి అంకితమిచ్చాడు' - ఈ వాక్యాలను సంశ్లిష్ట  వాక్యంగా మారిస్తే 
  ఎ) మానవులకు అంకితం ఇవ్వలేక పోయాడు. రామచంద్రునికి అంకితమిచ్చాడు.
  బి) మానవులకు అంకితం ఇవ్వలేదు అయినా  రామచంద్రునికి అంకితమిచ్చాడు.
సి) రామచంద్రునికే  అంకితమిచ్చాడు కాబట్టి  మానవులకు అంకితం ఇవ్వలేదు
 డి) మానవులకు అంకితం ఇవ్వక, రామచంద్రునికి అంకితమిచ్చాడు.                 (డి)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు