Pages

Bhaskara Satakam Padyalu - Kattada dappi

భాస్కర శతక పద్యం - కట్టడ దప్పి 
కట్టడ దప్పి తాము చెడు కార్యముఁ  జేయుచునుండిరేని  దోఁ
బుట్టినవారినైన విడిపోవుట కార్యము దౌర్మదాంధ్యముం 
దొట్టిన రావణాసురునితో నెడఁబాసి  విభీషణాఖ్యుఁ డా 
పట్టున రాముఁ జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!

తాత్పర్యము: దుర్మదాంధుడగు రావణాసురుడు విభీషణుడను పేరుగల తన సోదరుని ధర్మ బోధనలు పాటింపక  యాతనిని చంప నుంకించెను. అందులకా విభీషణుడట నుండి రాముని సన్నిధికేగి , కొన్నాళ్లకు లంకాధిపతి యయ్యెను. అట్లే ధర్మ విషయమై సహోదరులైన వారొకరితో నొకరు కలహించుట కంటే విడిపోవుట మంచిది. అట్లు చేసిన మేలగును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు