Pages

Chinnari Chitti Geethalu - Ugadi

చిన్నారి  చిట్టి గీతం - ఉగాది 
వసంత కాలపు ఉగాదికి 
కోకిల పలికెను ఆహ్వానం 
వేప, మామిడి, పూతలతో 
తరువులు ఇచ్చెను బహుమానం 
పెద్దలు పిన్నలు సందడితో 
అభినందనలు తెలిపారు 
ఉగాది పచ్చడి చేయుటకై 
అమ్మ, అక్కలు కలిశారు 
వేపపూతను కోశారు 
చెరకు రసాన్ని తీశారు 
మిరియపు కారం వేశారు 
చిటికెడు ఉప్పు చేర్చారు 
మామిడి పిందెలు తురిమారు 
చింతపులుసులో కలిపారు 
తీపి, కారం, పులుపు, చేదు 
ఉప్పు, వగరు రుచులే రుచులు 
ఆరు రుచులతో పచ్చడి చేసి 
అందరు మెచ్చగ పంచారు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు