Pages

The Mahabharata Quiz - part 4

మహాభారత క్విజ్ # 4
1. వ్యాసుడిని వేదవ్యాసుడు అని ఎందుకు అంటారు? - (వ్యాసుడు వేదాలను వ్యాసం చేయడం వల్ల వేదవ్యాసుడు అయ్యాడు)

2. వ్యాసుడు వేదాలను వ్యాసం చేసేనాటికి వేదాల స్వభావం ఎలా ఉండేది? - (ఆనాటికి వేదాలకు రూపం లేదు. ఏది కనపడినా దానిని వేదమనే పిలిచేవారు. ఏది వేదమో ఏది వేదం కాదో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఆ సమయంలో వ్యాసుడు వేదాలన్నింటినీ సేకరించాడు.)

3. వేదాలను ఎన్ని విభాగాలుగా విభజించాడు? వాటి పేర్లు ఏమిటి? - (4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం)

4. వేదాలను వ్యాసుడు ఇంకా ఏమి చేశారు? - (వేదాలను క్రోడీకరించి, మానవాళికి గొప్ప ఉపకారం చేశాడు. వేదప్రమాణాలను గ్రహించడానికి ఒక మార్గం ఏర్పరిచారు. అలా ఒక మహత్కార్యం, బృహత్కార్యం సాధించాడు)

5. ఇన్ని పన్నులు చేసిన వ్యాసుడి అంతరంగం ఏ విధంగా ఉంది? - (వ్యాసుని అంతరంగం  సంతృప్తికరంగా లేదు)

6. వ్యాసుడికి ఎందువలన సంతృప్తి కలగలేదు? - (వేదం కొందరికి మాత్రమే ఉపకరిస్తుంది)

7. వేదం అందరికీ ఉపయోగపడేలా వ్యాసుడు ఏం చేశారు? - (భారత సంహిత కల్పనకు పూనుకున్నారు)

8. భారతం దేనితో సమానమైనది? - (భారతం వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది. శ్రవ్యకావ్యాలతో ఉత్తమమైనది, పురాణమైనది)

9. భారత సంహితను ఎవరు సంస్తుతించారు? - (ఋషులు)

10. వేదవ్యాసుడు దేనిని కల్పించినాడు? - (భారత కావ్యాన్ని)

11. భారత కావ్య కల్పన చేసిన వ్యాసుని అంతరంగం ఎలా ఉంది? - (మరింత వ్యధ వ్యాసుని మనసులో మొదలైంది)

12. వ్యాసునిలో వ్యధ ఎందుకు మొదలైంది? - (కావ్యకల్పన జరిగింది కానీ, దీనికి అక్షర నిర్మాణం కావాలి. అది ఎలా ..... అనే  విచారం)

13. వ్యాసుడికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? - (బ్రహ్మదేవుడు)

14. బ్రహ్మదేవునితో వ్యాసుడు ఏ విధంగా సంభాషించారు? - (దేవా! నేను మనసులో మహాభారతాన్ని సంకల్పించాను)

15. భారతంలో వ్యాసుడు ఏమేమి చేర్చాడు? - (వేదాల సారాన్ని, ఉపనిషత్తులను చేర్చారు. పురాణాలు వివరించారు, భూత - భవిష్యత్ - వర్తమానాలను వివరించారు, బాల్య , యవ్వన, జరామరణాల గురించి వివరించారు, భగవంతుడి అనేక అవతారాలను పరిచయం చేశారు.)

16. భారత సంహితను ఏవిధంగా పోల్చారు? - (సముద్రం, మేరు పర్వత రత్నాలకు నిలయం. భారత సంహిత అటువంటిదే)

17. అక్షరాకృతి ఎందుకు కావాలన్నారు? - (అక్షరాకృతి లేకపోతే లోకానికి, లోకులకు ఉపకరించదు. వారికి ఉపకరించని కావ్యం వ్యర్థం అని)

18. వ్యాసుని ప్రార్థనకు పరవశం చెందిన బ్రహ్మదేవుడు ఏమని చెప్పారు? - (మహర్షి!  నువ్వు లోకకళ్యాణం కోసం ఒక సంహితను సంకల్పించావు. దానికి అక్షరరూపం ఇవ్వగల శక్తి వినాయకుని మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయనను ప్రార్థించు' అని చెప్పి అంతర్థానమయ్యారు)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు