పద్యపాదం గణవిభజన చేసి,ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. మరియు లక్షణాలను రాయండి. - 10వ తరగతి
1) తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
୲ ୲ U U ୲ ୲ U ୲ U ୲ ୲ ୲ U U U ୲ U U ୲ U
తెలగా |ణమ్మున |గడ్డిపో |చయును |సంధించెన్ | కృపాణ |మ్మురా
స భ ర న మ య వ
ఈ పాదంలో స, భ, ర, న, మ, య, వ గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది "మత్తేభ" పద్యపాదం.
లక్షణాలు:
1. ప్రతి పాదంలోనూ "స, భ, ర, న, మ, య, వ" గణాలు క్రమంగా ఉంటాయి.
2. 14 వ అక్షరం యతి స్థానం (తె - ధి)
3. ప్రాస నియమం ఉంటుంది. (ల కారము)
2) అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టి యా
୲ ୲ ୲ ୲ U ୲ U ୲ ୲ ୲ U ୲ ୲ U ୲ ୲ U ୲ U ୲ U
అనయ |ముదోష |మేపరు |లయందు |కనుంగొ |నిపల్కు |నట్టి యా
న జ భ జ జ జ ర
ఈ పాదంలో "న, జ, భ, జ, జ, జ, ర" గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది "చంపకమాల" పద్యపాదం.
లక్షణాలు:
1. ప్రతి పాదంలోనూ "న, జ, భ, జ, జ, జ, ర" గణాలు క్రమంగా ఉంటాయి.
2. 11 వ అక్షరం యతి స్థానం (అ - య)
3. ప్రాస నియమం ఉంటుంది. (న కారము)
0 comments:
Post a Comment