భాషాంశాలు - పదజాలం
1. విష్ణువు - అనే పదానికి వికృతి
అ) జిష్ణువు ఆ) వెన్నుడు ఇ) కృష్ణుడు ఈ) కన్నడు (ఆ)
2. 'నీరజభవుడు' - అనే పదానికి వ్యుత్పత్తి
అ) నీటి నుండి పుట్టినవాడు ఆ) సూర్యుని నుండి పుట్టినవాడు
ఇ) బ్రహ్మ వలన పుట్టినవాడు ఈ) కమలము నందు పుట్టినవాడు (ఈ)
3. 'విశ్వమంతటా వ్యాపించినవాడు' - దీనికి వ్యుత్పత్తి పదం
అ) బ్రహ్మ ఆ) విష్ణువు ఇ) మహేశ్వరుడు ఈ) అగ్ని (ఆ)
4. హిరణ్యకశిపుడు దనుజుడు - గీత గీసిన పదానికి అర్థం
అ) మంచివాడు ఆ) రాక్షసుడు ఇ) కోపిష్టి ఈ) దాత (ఆ)
5. 'ధాత్రి' కి పర్యాయపదాలు
అ) పుడమి, భూమి ఆ)ధర్మం, న్యాయం ఇ) ఇల్లు, గృహం ఈ) శునకం, కుక్క (అ)
6. 'శ్రీ' కి వికృతి పదం
అ) సిగ ఆ) సిరి ఇ) సాజం ఈ) సత్తి (ఆ)
7. మా తాత గొప్ప వదాన్యుడు - గీత గీసిన పదానికి అర్థం
అ) ఉపన్యాసకుడు ఆ) కవి ఇ) దాత ఈ) బలవంతుడు (ఇ)
8. నీరజము నందు పుట్టినవాడు - దీనికి వ్యుత్పత్తి పదం
అ) చేప ఆ) తాబేలు ఇ) కప్ప ఈ) నీరజభవుడు (ఈ)
9. నీరజభవుడు రాసినది జరుగక మానదు - గీత గీసిన పదానికి అర్థం
అ) ఇంద్రుడు ఆ) శివుడు ఇ) బ్రహ్మ ఈ) విష్ణువు (ఇ)
10. జలధి అనేక జీవరాశులకు నిలయం - గీత గీసిన పదానికి పర్యాయపదాలు
అ) సముద్రం, నది ఆ) సముద్రం, సాగరం
ఇ) పయోధి, సరస్సు ఈ) వారధి, తటాకం (ఆ)
11. అభ్యాగతుండు - సంధి విడదీయండి
అ) అభి + ఆగతుండు ఆ) అభ్య + ఆగతుండు
ఇ) అభిగ + అతుండు ఈ) అభ్యా + ఆగతుండు (అ)
0 comments:
Post a Comment