Pages

Showing posts with label చమత్కార పద్యం. Show all posts
Showing posts with label చమత్కార పద్యం. Show all posts

వృక్షాగ్రవాసీ - చమత్కారపద్యం - అర్థం

 వృక్షాగ్రవాసీ - చమత్కారపద్యం - అర్థం 

వృక్షాగ్రవాసీ న చపక్షిరాజః 

చర్మాంబరధారీ నచసోమయాజిః

త్రినేత్రధారీ నచశూలపాణిః

జలంధరిత్రి ర్నఘటోన మేఘః

అర్థం: చెట్టు మీద ఉంటుంది కాని పక్షి కాదు. చర్మాన్ని ధరిస్తుంది కాని సోమయాజి కాదు. మూడు కన్నులుంటాయి కాని శివుడు కాదు. నీటిని ధరించి ఉంటుంది కాని మేఘం కాదు, కుండా కాదు. అది ఏమి? జవాబు: కొబ్బరికాయ 

వండిన దెండిన దొక్కటి - చమత్కార పద్యం

 వండిన దెండిన దొక్కటి - చమత్కార పద్యం 

వండిన దెండిన దొక్కటి 

ఖండించిన పచ్చిదొక్కటి కాలినదొకటై 

తిండికి రుచియై యుండును 

ఖండితముగ దీని దెల్పు కవియుంగలడే 

జవాబు: వక్క, ఆకు, సున్నము 

తముఁదామె వత్తు రర్థులు - చమత్కార పద్యం

 తముఁదామె వత్తు రర్థులు - చమత్కార పద్యం 

తముదామె వత్తు రర్థులు

క్రమమెరిగిన దాత కడకు; రమ్మన్నారా 

కమలంబులున్న కొలనికి

భ్రమరంబుల నచ్యుతేంద్ర రఘునాథ నృపా?

అర్థం: ఔదార్యము తెలిసిన దాత వద్దకు అర్థులు తమంత తామే వస్తారు. ఎవరూ పిలవవలసిన పని లేదు. పద్మాలు ఉన్న కొలనుకు తుమ్మెదలు ఎవరూ పిలవరు కదా! (తంజావూరు రఘునాథ రాయల ఆస్థానానికి వచ్చి క్షేత్రయ్య చెప్పిన చాలువగా ప్రసిద్ధం)  


 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు