Pages

Showing posts with label తెలుగు బాల పద్యాలు. Show all posts
Showing posts with label తెలుగు బాల పద్యాలు. Show all posts

తెలుగు బాల పద్యాలు - దొరలు దోచలేరు దొంగ లెత్తుకపోరు


దొరలు దోచలేరు దొంగ లెత్తుకపోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవవర్ధనంబు విద్యాధనంబురా
లలిత సుగుణజాల తెలుగుబాల.

తాత్పర్యం : విద్య అనే సంపదను దొరలు దోచుకోలేరు; దొంగలు దొంగలించలేరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వచ్చి దాన్ని పంచుకోరు. ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది విద్య మాత్రమే!

తెలుగు బాల పద్యాలు - బ్రతికినన్నినాళ్లు ఫలములిచ్చుటె కాదు

తెలుగు బాల పద్యాలు  - బ్రతికినన్నినాళ్లు ఫలములిచ్చుటె కాదు 
బ్రతికినన్నినాళ్లు ఫలములిచ్చుటె కాదు
చచ్చి కూడ చీల్చి ఇచ్చు తనువు 
త్యాగభావమునకు తరువులే గురువులు 
లలిత సుగుణజాల తెలుగుబాల 

భావము : చెట్టు ప్రాణముతో ఉన్నప్పుడు పండ్లను ఇస్తుంది. ప్రాణము పోయిన తర్వాత 
                కూడా కొయ్యగా  మనం ఉపయోగించుకోవడానికి అది తన శరీరాన్ని చీల్చి ఇస్తుంది. 
                 త్యాగభావ విషయంలో  చెట్లు గురువులవంటివి.  

Telugu Bala Padyalu - తెలుగు బాల పద్యాలు

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు