Pages

Showing posts with label తెలుగు వ్యాకరణం. Show all posts
Showing posts with label తెలుగు వ్యాకరణం. Show all posts

తెలుగు వ్యాకరణం - భాషా భాగములు

తెలుగు వ్యాకరణం - భాషా భాగములు 
తెలుగు భాషలోని పదములను  5 విధములుగా విభజించవచ్చును. అవి:
1. నామవాచకములు 
2. సర్వనామములు 
3. విశేషణములు 
4. క్రియలు 
5. అవ్యయములు 

1. నామవాచకములు : మనుష్యుల యొక్క గాని, జంతువులయొక్క గాని, వస్తువుల యొక్క గాని, పేర్లను తెలియ జేయు పదములను నామవాచకములు అందురు. నామవాచకములకు విశేష్యములని నామాంతరం కలదు. 
ఉదా: శివుడు, గోవు, చెట్టు, చిలుక మొదలగునవి. 

ఈ నామవాచకములు 4 విధములు. 
1. సంజ్ఞా నామవాచకములు 
2. జాతి నామవాచకములు 
3. గుణ నామవాచకములు 
4. క్రియా నామవాచకములు 

1. సంజ్ఞా నామవాచకములు : దేశములు, కొండలు, నదులు మొదలగు వాని పేర్లను తెలియజేయు వానిని సంజ్ఞా నామవాచకములు అందురు.
 ఉదా: ధర్మరాజు, ఆంధ్ర ప్రదేశ్, యమున, కృష్ణ  మొదలగునవి. 

2. జాతి నామవాచకములు: ఒక జాతిని గాని, తెగను గాని తెలుపు పదములను  జాతి నామవాచకములు అందురు.
ఉదా: మనుష్యుడు, నది, పక్షి, చెట్టు   మొదలగునవి. 

3. గుణ నామవాచకములు : నామవాచకముల గుణములను తెలియజేయు పదములను గుణ నామవాచకములు  అందురు.
                                  ఉదా: ఎరుపు, తెలుపు, మంచి, చెడు  మొదలగునవి. 

4. క్రియా నామవాచకములు: క్రియల వలన పుట్టిన పదములను క్రియా నామవాచకములు అందురు. 
                                      ఉదా: పాడుట, తినుట, చదువుట, వండుట   మొదలగునవి. 

తెలుగు వ్యాకరణం - పద్యాలు - భేదాలు

తెలుగు వ్యాకరణం - పద్యాలు - భేదాలు 
వృత్తాలు : అక్షర గణాలతో ఏర్పడే పదాలు 
ఉదా: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభము మొదలగునవి 
వృత్త పద్యాలు గణాలు పాదాలు అక్షరాల సంఖ్య యతి స్థానం ప్రాస నియమం 
ఉత్పలమాల భ - ర - న - భ - భ - ర - వ                        42010ఉంది 
చంపకమాల న - జ - భ - జ - జ - జ - ర             42111ఉంది 
శార్దూలం మ - స - జ - స - త - త -  గ                          41913ఉంది 
మత్తేభం స - భ - ర - న - మ - య - వ                              42014ఉంది 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు