Pages

Showing posts with label భాస్కర శతక పద్యాలు. Show all posts
Showing posts with label భాస్కర శతక పద్యాలు. Show all posts

భాస్కర శతక పద్యాలు - ఈ జగమందు

భాస్కర శతక పద్యాలు - ఈ జగమందు

ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా 
తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా 
రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్ 
భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా 

తాత్పర్యము : మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా?

భాస్కర శతక పద్యాలు - అరయ నెంత

భాస్కర శతక పద్యాలు - అరయ నెంత 

                        అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ 
                        గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే 
                        కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం 
                        గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా!
తాత్పర్యం : భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు. 

భాస్కర శతక పద్యాలు - అవనివిభుండు

భాస్కర శతక పద్యాలు - అవనివిభుండు

                       అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె 
                       ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే 
                       ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే 
                      తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా 

తాత్పర్యము: రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా!

భాస్కర శతక పద్యాలు - అనఘనికైన

భాస్కర శతక పద్యాలు - అనఘనికైన 

అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో 
మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే 
యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో 
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా 

తాత్పర్యము : ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో  గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును. 

భాస్కర శతక పద్యాలు - అదను దలంచి

భాస్కర శతక పద్యాలు - అదను దలంచి 

          అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ 
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ 
మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే 
పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా. 

తాత్పర్యము : భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు. 

భాస్కర శతక పద్యాలు - అడిగిన యట్టి

భాస్కర శతక పద్యాలు - అడిగిన యట్టి 

అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై 
కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె 
య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ 
గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా 

తాత్పర్యం : మనుష్యులు ఆవులయొక్క లేగదూడలను వాని తల్లుల పాలు త్రాగనీయకుండ, వారు పాలు తీసికొందమన్నచో నా యావులు వారికి పాలనివ్వక తన్నును. అదేవిధముగా లోభివానివలె వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షకుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొకప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు