Pages

Showing posts with label సుమతీ పద్యాలు. Show all posts
Showing posts with label సుమతీ పద్యాలు. Show all posts

సుమతీ పద్యాలు - చీమలు పెట్టిన పుట్టలు

సుమతీ పద్యాలు  - చీమలు పెట్టిన పుట్టలు 

చీమలు పెట్టిన పుట్టలు 
పాముల కిరువైన యట్లు పామరుడు దగన్ 
హేమంబు గూడబెట్టిన 
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!

తాత్పర్యం : ఓ సుమతీ! భూమిలో చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరును. అట్లే, మూర్ఖుడు దాచి ఉంచిన బంగారం రాజుల పాలై అతనికి ఉపయోగపడక పోవును. 

సుమతీ పద్యాలు - కనకపు సింహాసనమున

సుమతీ పద్యాలు - కనకపు సింహాసనమున  

కనకపు సింహాసనమున 
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం 
దొనరగ బట్టము గట్టిన 
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!

తాత్పర్యం : ఓ మంచిబుద్ధి గలవాడా! కుక్కది హీనగుణము. దానిని మంచి ముహుర్తమునాడు బంగారపు సింహాసనమున కూర్చుండ బెట్టినను హీనబుద్ధి విడువదు. అట్లే హీనుని ఉన్నత స్థానమున కూర్చుండబెట్టినను అతని బుద్ధి మారదు. 

సుమతీ పద్యాలు - శ్రీరాముని దయచేతను

సుమతీ పద్యాలు - శ్రీరాముని దయచేతను 

శ్రీరాముని దయచేతను 
నారూఢిగ సకలజనులు నౌరాయనగా 
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ!

తాత్పర్యం : మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులును సెబాసనునట్లుగా నోటి నుండి నీళ్లూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు