Pages

Showing posts with label telugu poems. Show all posts
Showing posts with label telugu poems. Show all posts

పద్యం - భావం

 పద్యం - భావం 

ఎడపక దుర్జనుండొరుల కెంతయు గీడొనరించును గాని యే 
యెడలను మేలు సేయడొక యించుకయైనను; జీడపుర్వు తా 
జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంచనేర్చునే 
పొడవగుచున్న పుష్ప ఫలభూరుహ మొక్కటినైన భాస్కరా!
భావం : చెడు స్వభావం కలిగినవారు ఇతరులకు చెడు చేస్తారే గానీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ మాత్రం మంచి చేయరు. ఇటువంటివారి ప్రవర్తన చీడపురుగును పోలి ఉంటుంది. చీడపురుగు చెట్టుకు పుడిసెడు నీరైనా పోయకపోగా.. పూలు, పండ్లతో నిండుగా ఉంటూ.. చక్కగా పెరుగుతున్న చెట్లను పాడుచేస్తుంది.



Telugu Poems - నీవే తల్లివి తండ్రివి

తెలుగు పద్యాలు - నీవే తల్లివి తండ్రివి 
నీవే తల్లివి తండ్రివి 
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ 
నీవే గురుడవు దైవము 
నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణా!

తాత్పర్యము : ఓ కృష్ణా! నీవే నాకు తల్లివి, తండ్రివి, సహాయకుడివి, సఖుడవు. నా గురువు కూడా నీవే. నా దైవము, ప్రభువు, పతి, గతి కూడా నీవే. నా సమస్తమూ నీవే. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు