చకోరములు = వెన్నెలను త్రాగి జీవించే పక్షులు | తమము = చీకటి |
వేడ్క = సంతోషము | చెలంగి = విజృంభించి |
పేరి = గొప్పదైన | వ్రేకదనం = అతిశయము |
ఒండొండ = క్రమంగా | భూరుహం = చెట్టు |
దీధితి = వెలుగు | పొదిలి = పెరిగి, వ్యాపించి |
సుధాకరుడు = చంద్రుడు | సూత్రధారి = దర్శకుడు |
అంకురం = మొలక | సౌరభం = సువాసన |
ఉపలము = శిల, రాయి | ఎఱకలు = రెక్కలు |
తఱి = సమయం | షండం = సమూహం |
కడలి = సముద్రం | కైరవం = తెల్ల కలువ |
రజనీశ్వరుడు = చంద్రుడు | కళంకము = మచ్చ |
గరువపు = గొప్ప | కరవటము = బరిణె |
గురి = లక్ష్యము | తేజము = కాంతి |
ఇనుడు = సూర్యుడు | భృంగం = తుమ్మెద |
కీడు = చెడు | మేను = శరీరం |
కొదువ = తక్కువ | నిగ్రహించు = గర్వపడు |
ధనం=డబ్బు | కేటాయింపు=ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం |
ప్రశంసాపత్రం=మెచ్చుకొంటూ ఇచ్చే పత్రం | నగదు=డబ్బు. |
పతకం=గుర్తింపుగా ఇచ్చే బిళ్ళ. | అవార్డు=బహుమతి,పురస్కారం |
కృతజ్ఞతా=ధన్యావాదాలు. | క్షేమంగా=సురక్షితంగా . |
సాహసం=తెగింపు(ధైర్యంగా)చేసే పని | ఊపిరి=గాలిపీల్చడం |
వ్యాపించు=విస్తరించు. | ప్రమాదం =ఆపద. |
అచేతనం =కదలకుండా ఉండు. | పినతండ్రి =తండ్రితమ్ముడు,బాబాయి. |
పద్మం=కమలం,తామరపువ్వు. | నాట్యగత్తె= నృత్యంచేసే స్త్రీ. |
నిర్మించుట=కట్టుట. | శతాబ్ది=నూరు సంవత్సరాలు. |
ఆలయం=గుడి. | విగ్రహం=దేవుని బొమ్మ. |
వైశాల్యం=ఒక వస్తువు విస్తరించిన ప్రదేశం. | సేనాని=సేనలకు అధికారి,సైన్యాధికారి. |
తీరం = ఒడ్డు | సర్పం = పాము |
యుక్తి = ఉపాయం | పచ్చిక = గడ్డి |
కొలను = సరస్సు | జలకం = స్నానం |
మింటికి = ఆకాశానికి | కుమిలి = బాధపడి |
శిల్పం=రాతిలో చెక్కిన బొమ్మ. | డబ్బు = ధనము |
తోట = వనము | పాట - గానము |
నిశ్శబ్దం = మౌనము | గొప్ప = ఘనము |
కాల్చు = దహనము | మురికి = మలినము |
పిలుపు = ఆహ్వానము | ఆకాశం = గగనము |
కదలిక = చలనము | పరంపర = వరుస |
పరిశీలన = వివరంగా తెలుసుకొనటం | తపన = కోరిక |
మన్నన = మర్యాద | ప్రోత్సహం = పురికొల్పటం |
స్వానుభవం = స్వయంగా అనుభవించినది | నిరంతరం = ఎల్లప్పుడు |
సింధువు = సముద్రం | అమాయకముగా = మోసము తెలియని |
అరయు = చూచు, తెలుసుకొను | అర్చన = పూజ |
అర్భకుడు = బక్కపలచటి వాడు, చేతకాని వాడు | ఆచరించుట = చేయుట |
ఆడంబరము = డంబము, బింకము | ఆర్తి = ఆతురత |
ఆవేశము = కోపము | ఆహ్వానము = పిలుపు |
ఇల = భూమి | ఉల్లాసంగా = సంతోషముగా |
ఊహ = ఆలోచన | ఋణం = అప్పు |
ఋషి = ముని | ఏక = ఒకటి |
ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పటం | ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుట |
ఒప్పందం = కట్టుబాటు | ఔషధం = మందు |
కంటకం = ముల్లు | కంపం = కదలిక, వణుకు |
అనువు = ఉపాయము | కఠోరం = కఠినం |
కథానిక = చిన్నకథ | కనకము = బంగారము |
కమఠము = తాబేలు | కర్తవ్యం = చేయవలసిన పని |
కలప = కట్టె, కర్ర | కల్ల = అబద్ధం, అసత్యం |
కలిసి మెలిసి = ఇకమత్యంతో | కునుకు = చిన్నపాటి నిద్ర |
ప్రవాహము = పరంపర, వెల్లువ | వాచికము = వక్కాణము, సమాచారము |
అపరాధం = తప్పు, నేరము | అపహరించు = దొంగలించు |
అపహసించు = వెక్కిరించు, ఎగతాళి చేయు | అపాయం = ప్రమాదం, ఆపద |
అప్రియం = ఇష్టం కానిది | అభిరామ = అందమైన, మనోహరమైన |
అమాంతముగా = అకస్మాత్తుగా, ఒక్కసారిగా | అమిత = ఎక్కువైన |
అర్థమత్తుడు = ధనం చేత పొగరెక్కినవాడు | అర్పించు = ఇచ్చు |
అరుగు = వెళ్ళిపోవు | అలుక = కోపం |
అవధి = హద్దు | అశ్రువు = కన్నీరు |
అసంఖ్యాక = లెక్కలేనన్ని | అహం = నేను అనే భావం |
అహంకృతుడు = గర్వం చూపేవాడు | మోతుబరి = ఎక్కువ భూమిని సేద్యం చేసే రైతు(భూస్వామి) |
తగాదా = పోట్లాట | అరమరికలు = తేడాలు |
అవరోధం = అడ్డు | అవసానకాలం = చివరి కాలం |
సమీపించు = వచ్చు | యోగ్యులు = మర్యాదస్తులు |
వ్యవహారాలు = పనులు | దక్కు = లభించు |
విషమించు = చేయి దాటిపోవు | కుశలత = నేర్పు |
భంగ పడు = అవమానపడు | వృద్దాప్యం = ముసలి వయస్సు |
నిశ్చింత = చింతలేకుండా | జగడం = పోరు |
తరణం = దాటడం | తగాదా = తగువు |
లుబ్దత్వం = పిసినారితనం | తకతకలాడు = తొందరపడు |
మంకు = మొండి | ఉక్తి = మాట |
లోభి = పిసినారి | సౌరభం = సువాసన |
నీహారం = మంచు | శీతలం = చల్లని, చందనం |
సౌమ్యం = శాంతం | ఉపకరణములు = సాధనాలు |
లయం = వినాశం | లంక = దీవి, ద్వీపం |
క్లిష్టం = కష్టమైన | ఉత్సుకత = కుతూహలం |
రయం = వేగం | అనిలం = గాలి |
కృపాణం = కత్తి | తావి = పరిమళం |
మహి = భూమి | సమగ్రం = సంపూర్ణం |
పైకం = డబ్బు | కళంకం = మచ్చ, గుర్తు |
నింగి = ఆకాశం | ప్రతిష్ఠ = గౌరవం |
హారం = దండ | పికం = కోకిల |
ఇల = నేల | దండు = సేన |
నవల = స్త్రీ, ఒక సాహితీ ప్రక్రియ | ఊత = ఆధారం |
కోమలి = స్త్రీ | అట్టహాసం = పెద్దనవ్వు |
అడచు = తగ్గించు, అణగకొట్టు | జగత్తు = ప్రపంచం |
క్షామం = కరువు | ఆదిత్యుడు = సూర్యుడు |
ప్రసూనం = పువ్వు | స్వప్నం = కల |
ఆకాంక్ష = కోరిక | భీతి = భయం |
ప్రీతి = ఇష్టం | పీచమణచు = నిర్వీర్యం చేయడం |
ఖరవు = గర్వం | ఉద్వాహం = పెళ్లి |
అన్యం = ఇతరమైన | ఎఱుక = తెలుసు |
స్నేహితులు = మిత్రులు | మోదం = సంతోషం |
ధరిత్రి = భూమి | పోరితము = యుద్ధము |
కపి = కోతి | వ్యాఘ్రము = పులి |
మైకం = మత్తు | పికం = కోయిల |
అనంతం = అంతం లేనిది | అమాత్య పీఠం = మంత్రి కూర్చునే స్థానం |
అరుదెంచి = వచ్చి | వైనం = విధం |
సలిలం = నీరు | అనాలం = నిప్పు |
కౌశలం = నేర్పు | దామం = హారం |
జాయువు = మందు, ఔషధం | సర్పం = పాము |
సాటి = సమానం | తరువు = వృక్షం |
ఠీవి = గాంభీర్యం | పరిపాటి = క్రమం |
ఉద్ది = జత | కుటిలం = మోసం |
వ్యవహారాలు = పనులు | నమ్రత = వినయం |
అపరంజి = బంగారం | కలిమి = సంపద |
కనికరం = దయ | జిత్తు = మాయ |
అర్కుడు = సూర్యుడు | మదం = గర్వం |
దోషము = పొరపాటు | మాసము = నెల |
భంగము = ఆటంకం | కరము = చేయి |
తమస్సు = చీకటి | అంబరం = ఆకాశం |
కడుపు = ఉదరం, పొట్ట | క్షణము = లిప్త, త్రుటి, ముహూర్తం |
తామర = పద్మము, అంబుజము | విమర్శ = సమీక్ష, అవలోకనము |
పావడము = వస్త్రం | పానీయము = నీరు |
పాటవం = నైపుణ్యం | పావనము = పవిత్రం |
కేళి = ఆట | ధారణ = జ్ఞాపకం |
మూక = సమూహం | తరుణి = స్త్రీ |
శౌర్యం = పరాక్రమం | విస్తృతం = విరివిగా |
వల్లి = భూమి, తీగ | భానుడు = సూర్యుడు |
పస = సారము, సమృద్ధి | సొంపు = సౌందర్యము |
కంక = వెదురు, కోడె | అగ్గువ = చౌకగా |
పిరం = ఎక్కువ ధర | కుములు = బాధపడు |
కైకిలి = కూలి | పిసరు = చిన్నముక్క |
పిడాత = అకస్మాత్తుగా | అక్కెర = అవసరం |
ఆయిల్ల = గత రాత్రి | అనుకుడు = వణకడం |
మడిగె = దుకాణం | గట్లనే = అట్లాగే |
గత్తర = కలరా | గంతే = అంతే |
తత్తర = తడబాటు | అతిశయిల్లు - పెరుగుతూ ఉండటం |
అధికం = ఎక్కువ | అద్భుతం = ఆశ్చర్యం |
అనంతరం = తర్వాత | అనర్గళం = ఎడతెరిపిలేకుండా, ఆగకుండా మాట్లాడడం |
అనుభవించు = సొంతం చేసుకొను | అపహరించు = దొంగిలించు |
అభినందించు = ఒక మంచిపని చేసినందుకు కాని, ఒక మంచి సందర్భంలో కాని మెచ్చుకోడం | అభిరాముడు = మనోహరమైనవాడు |
అలజడి = మనస్సులో బాధ, కలత, గొడవ | అభిమానం = ప్రేమ, గౌరవం |
అమాయకంగా = మోసం తెలియని | అరయు = చూచు, తెలుసుకొను |
అర్చన = పూజ | అర్భకుడు = బక్కపలచటివాడు, చేతకానివాడు |
ఆచరించుట = చేయుట | ఆడంబరము = డంబము, బింకము |
ఆర్తి = ఆతురత | ఆవేశం = కోపం, ఒళ్లు తెలియనికోపం |
ఆహ్వానం = పిలుపు | ఇల = భూమి |
ఉల్లాసంగా = సంతోషంగా | ఊహ = ఆలోచన |
ఋణం = అప్పు | ఋషి = ముని |
ఏక = ఒకటి | ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పడం |
ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుట | ఒప్పందం = కట్టుబాటు |
ఔషధం = మందు | కంటకం = ముల్లు |
కఠోరం = కఠినం | కథానిక = చిన్నకథ |
కంపం = కదలిక, వణుకు | కజ్జికాయ = ఒకరకమైన తియ్యటి తినుబండారం |
కనకము = బంగారము | కమఠం = తాబేలు |
కర్తవ్యం = చేయాల్సిపని | కలప = కట్టె, కర్ర |
కల్ల = అబద్ధం, అసత్యం | కలిసిమెలిసి = ఐకమత్యంతో |
కుండపోత = కుండముంచినట్లుగా పెద్ద ధారగా పడుతూండటం | కుదురు = కదలకుండా ఉండటం, స్థిరత్వం, నిలకడ |
కునుకు = చిన్నపాటి నిద్ర | కొంటెపనులు = చిలిపి పనులు |
కొలను = చెరువు | కొలువు = ఉద్యోగం |
కోవెల = గుడి | ఖగం = పక్షి |
ఖరం = గాడిద | ఖుషీ = సంతోషం |
పింఛం = నెమలిపురి | పిన్నలు = చిన్నవాళ్ళు |
ప్రీతి = ఇష్టం , ప్రేమ | పూరిగుడిసె = గడ్డిపాక |
పేడ = పెండ | ఫలం = పండు |
బంక = జిగురు | బృందగానం = జట్టుగా పాడుట, జతగా పాడుట |
బహుమానం = కానుక, ప్రైజు, ఇనాము | బువ్వ = అన్నం |
భవనం = ఇల్లు, మేడ | భాగ్యం = డబ్బు, ధనం, సంపద |
భిన్నము = వివిధము, వేరువేరు | భూషణం = అలంకారం |
భౌతికం = శారీరకం, శరీరసంబంధం | మధురమైన = తియ్యనైన |
మనుజుడు = మనిషి, మానవుడు | మనీష = తెలివి, ప్రజ్ఞ |
మర్కటం = కోతి | మర్దన = మసాజు |
మహి = భూమి | మహిమ = గొప్పతనం |
మానసము = మనస్సు | మార్గం = తోవ, దారి |
మిధునం = జంట | ముగింపు = చివర, పూర్తి |
మేఖల = ఒడ్డాణం | మేఘం = మబ్బు |
మోజు = ఇష్టం | మౌనము = మాట్లాడకుండా ఉండుట, ఖామోషీ |
యశస్సు = కీర్తి | యాగం = యజ్ఞం |
యాతన = కష్టం, ఇబ్బంది | యానం = ప్రయాణం |
రక్షణ = కాపాడుట | రాగము = అనురాగము, సంగీతరాగం |
రాక్షసులు = రక్కసులు, దేవతల శత్రువులు | లచ్చి = లక్ష్మి |
లవణం = ఉప్పు, నమక్ | లాలస = కోరిక |
లెస్స = మంచి | లొట్టలు = నోరూరుట |
వడి = వేగం | వధువు = పెళ్లికుమార్తె |
వనవాసం = అడవిలో నివసించుట | వరహా = పూర్వకాలంలో వాడుకలో ఉన్న చాలా విలువైన నాణెం |
వర్ధనం = పెంచడం, వృద్ధి చేయడం; పెరగడం | వర్షం = వాన |
వర్గీకరణ = వేరుచేయుట | వానరులు = కోతులు |
వారధి = వంతెన | వ్యాధి = రోగం |
విచిత్రం = ఆశ్చర్యం | విచ్చిన = వికసించిన |
విద్యాభ్యాసం = చదువునేర్చుకొనుట | విశ్వద = ప్రపంచాన్ని ఇచ్చిన |
విస్తరించు = వ్యాపించు | సంతతి = జాతి |
ఘనకీర్తి = గొప్పపేరు | ప్రాచుర్యం పొందు = విస్తృతి చెందు, బాగా వ్యాపించు |
మహోజ్వలం = మిక్కిలి ప్రకాశవంతం | విజయ యాత్ర = గెలిచిన సందర్భంలో చేసే ఊరేగింపు |
ఎత్తుపల్లాలు = ఉన్నతి, క్షీణత | సంప్రోక్షణ = శుద్ధి చేయటం |
ప్రఖ్యాతి = ప్రసిద్ధి | సమాగమం = కలయిక |
చవి = రుచి | పుట = పేజీ |
అజరామరం = శాశ్వతం | అర్జించు = సంపాదించు |
అవధి = హద్దు | యవనిక = తెర |
మాన్యులు = గౌరవనీయులు | పరవళ్ళు = ప్రవాహాలు |
రహదారులు = రోడ్లు (బాటలు) | పాయ = చీలిక |
వైభవం = సంపద | పరీవాహక ప్రాంతం = ప్రవహించే ప్రాంతం |
రూపుదిద్దుకొను = ఆకారం పొందు | చర్మకారుడు = చెప్పులు కుట్టేవాడు |
తరలిపోవు = వెళ్ళిపోవు | హర్మ్యం = మేడ |
హంగులు = సదుపాయాలు | సచేతనం = చైతన్యంతో కూడిన |
అర్థాలు - Telugu Meanings
Subscribe to:
Post Comments (Atom)
Aruvu telugu arthaalu
ReplyDeleteఅప్పు
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteKanksha
ReplyDelete