Social Icons

Pages

Featured Posts

సమాసములు

సమాసములు
శిల్పసంపద - శిల్పమనెడి సంపద - రూపక సమాసం
శతాబ్ది = నూరు సంవత్సరాలు గలది - బహువ్రీహి సమాసం
కృష్ణానది - కృష్ణ అను పేరుగల నది - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
నవ్యాంధ్ర - నవ్యమైన ఆంధ్ర - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జీవితఘట్టాలు - జీవితమందలి ఘట్టాలు - సప్తమీ తత్పురుష సమాసం
వైభవోపేతం -  వైభవముతో ఉపేతం - తృతీయా తత్పురుషసమాసం
కాలానుగుణం - కాలమునకు అనుగుణం - షష్ఠీ తత్పురుష సమాసం

నానార్థాలు

ఉపాద్యాయుడు - గురువు, పురోహితుడుకొమ్ము - ఏనుగు దంతం, శరీరం
వేరు - వేర్పాటు, మూలం నరుడు - మానవుడు, అర్జునుడు 
విద్య - జ్ఞానం, చదువు పాదం  - ఆంపాదం, పద్యపాదం
నవ - క్రొత్త, తొమ్మిది 
మేషం - మేక, రాశి
తుల - త్రాసు, రాశి 
రాశి - కుప్ప, అందం 
దృష్టి - చూపు, జ్ఞాపకం 
సమయం - కాలం, శపథం 
దళము - గుంపు, ఆకు ముద్ర - గుర్తు, ప్రభావము 
అక్షము - బండి, ఇరుసు, కన్ను, సర్పం, జూదం, పాచిక అనలము - అగ్ని, కృత్తిక, నల్లజీడి, మూడు అంకె 
అనిమిషం - చేప, రెప్పపాటులేనిది అరుణం - ఎరుపు, కాంతి, కుష్టు రోగం, బంగారం 
అశని - వజ్రము, పిడుగు ఆస్తరణం - ఎఱ్ఱ కంబళి, పరుపు, ఆసనం, ఏనుగు మీద పరిచే ఎఱ్ఱ కంబళి
ఇనుడు - సూర్యుడు, ప్రభువు, పోషకుడు, భర్త ఇల - బుధుని భార్య, ఆవు, మాట, భూమి 
ఉల్క - నిప్పు కణం, కాగడా ఎద - హృదయం, భయం 
కంఠీరవం - సింహం, మత్తగజం, పావురం కదళీ - అరటి, ఏనుగు అంబారీ మీద టెక్కెం, ఇరవై అంగుళాల పొడవు ఉన్న లేడి 
కరము - చెయ్యి, మిక్కిలి, తొండము, కిరణము కరి - నిదర్శనం, ఏనుగు, కోతి 
కల్యాణం - శుభము, బంగారం, పెండ్లి, అక్షయం కారు - నలుపు, అడవి, వర్షర్తువు 
కాయం - శరీరం, సమూహం, స్వభావం కాలం - సమయం, నలుపు, చావు, తాడి (చెట్టు)
కుడ్యం - గోడ, పూత కుశ - తాడు, నీరు, దర్భ, ఒక ద్వీపం 
కేతనం - జెండా, ఇల్లు ఖగము - పక్షి, బాణం, సూర్యుడు(గ్రహాలు), గాలి 
గుణం - దారం, స్వభావం, వింటినారి ఘటం - కుండ, శిఖరం, పాడునూయి 
చరణం - పాదం, వేరు, కులం, పద్యపాదం జలం - నీరు, ఎఱ్ఱ తామర, ఎఱ్ఱ కలువ 
జిహ్వ - నాలుక, వాక్కు, జ్వాల తార - నక్షత్రం, వాలి భార్య, కంటి పాప, ఓంకారం 
తీర్థం - పుణ్యనది, జలం, ఉపాధ్యాయుడు, మంత్రి తుండం - పక్షి ముక్కు, నోరు, ఖండం 
దక్షిణ - ఒక దిక్కు, సంభావన దర్శనం - చూపు, కన్ను, అద్దం, బుద్ధి, శాస్త్రం 
దాహం - దప్పిక, కాలుట దిక్కు - దిశ, శరణం 
ధర్మం - పుణ్యం, న్యాయం, ఆచారం, యజ్ఞం ధ్వని - శబ్దం, వ్యంగ్యార్థం 
నందనుడు - కొడుకు, సంతోషపట్టేవాడు పక్షం - వరుస, రెక్క, 15 రోజులు, వైపు 
పదము - చిహ్నము, పాదము, స్థలము, అడుగు పరిఘము - బాణం, గాజు, కుండ, దెబ్బ 
పాకం - పంట, వంట, నారికేళాది కావ్యపాకలు  పావనం - జలం, గోమయం, రుద్రాక్ష, పవిత్రం 
బుధుడు - పండితుడు, బుధ గ్రహం, వేల్పు, వృద్ధుడు వస్రం - కోట, వరిమడి, తీరం 
సూత్రం - నూలుపోగు, జంధ్యం, ఏర్పాటు వివరం - రంధ్రం, దూషణ 
హరి - విష్ణువు, సూర్యుడు, కోతి, కప్ప, గుఱ్ఱం గుణము   - దారము,  వింటినారి, స్వభావము, విద్య, దయ  
రాజు - ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు, క్షత్రియుడు ఆశ - కోరిక, దిక్కు 
వీధి - త్రోవ, వాడ, పంక్తి కులము - జాతి, వంశం, ఇల్లు, శరీరం 
మిత్రుడు - స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపురాజు ధర - వెల, భూమి, మెదడు, సంహారము 
నరుడు - మానవుడు, అర్జునుడు కులము - వంశము, ఇల్లు, శరీరము, దేశము, జాతి  
క్షేత్రము - భార్య, భూమి, వరి మడి, శరీరము, పుణ్య స్థలము  హరి - విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహం, పాము 
చిత్రము - అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు (బొమ్మ)అంకిలి -  ఆపద, క్షోభ.
అంగుష్ఠం: బొటనవ్రేలు, అంగుళం.అండజయు: పాము, చేప, పక్షి,తొండ, కస్తూరి.
అంతర్యామి: పరమాత్మ, జీవాత్మ.ఆశరుడు: రాక్షసుడు, అగ్ని.
ఆర్యుడు: మంచివాడు, పూజ్యుడు.ఆళి: పంక్తి, తేలు, చెలికత్తె
ఇష్టి: కోరిక, యజ్ఞం, కత్తిఈశుడు: రాజు, శివుడు, మన్మథుడు, సంపన్నుడు.
ఉక్తి: సరస్వతి, మాట.ఉదాత్తుడు: గొప్పవాడు, ఇచ్చువాడు.
ఉమ: పార్వతి, కాంతి, పసుపు.అక్షరం: వర్ణం, రూపం, నాశనం లేనిది, పరబ్రహ్మం.
అశని: వజ్రాయుధం, పిడుగు, మెరుపు.సౌరభం: సువాసన, కుంకుమపువ్వు, ఎద్దు.
ధనం: విత్తం, ధనిష్ఠానక్షత్రం,           ధనియాలు.కేసరి: సింహం, గుర్రం, ఆంజనేయుని తండ్రి.
గురువు: ఉపాధ్యాయుడు, తండ్రి బృహస్పతి.తీర్థం: పుణ్యక్షేత్రం, జలం, యజ్ఞం
శ్రీ: సంపద, లక్ష్మి, విషం, సాలెపురుగుపుండరీకం: పెద్దపులి, తెల్ల తామర, తెల్ల గొడుగు.
కరము: చేయి, తొండం, కిరణం.ఉద్యోగం: పని, అధికారం,యత్నం.
వ్యవసాయం: కృషి, పరిశ్రమ, ప్రయత్నంసుధ: సున్నం,పాలు, అమృతం.
ఉచితం: ఊరక, తగినది, మితం.తాత: బ్రహ్మ, తండ్రికి తండ్రి, తల్లికి తండ్రి.
గగనం: ఆకాశం, శూన్యం,దుర్లభంశిఖ: సిగ, కొన, కొమ్ము.
భవం: పుట్టుక, బ్రతుకు, ప్రపంచం.వాసము = ఇల్లు, వస్త్రము, పరిమళము
సూత్రము = నూలిపోగు, త్రాడు, (దారం), జంద్యముచరణము = పాదము, కిరణము, పాతిక, పద్య పాదము
హరి = విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడురత్నము = మణి, సూదంటురాయి, శ్రేష్ఠము
ఈశుడు = ప్రభువు, యజమానుడు, భర్త, శివుడుఛాయ = నీడ, సూర్యుని భార్య, కాంతి, ప్రతిబింబము
బ్రహ్మ = బ్రహ్మదేవుడు, బ్రాహ్మణుడు,బృహస్పతి, ఒక ఋత్విజుడుపతి = భర్త, ప్రభువు, యజమానుడు, గతి
వాసము = ఇల్లు, వస్త్రముచరణము = పాదము, పద్యపాదం, వేదభాగం,కిరణము
బలము = సత్తువ, సేనపుణ్యము = సత్కర్మం, పవిత్రత, నీరు
హరి = విష్ణువు, ఇంద్రుడు, కోతి, కప్ప, గుఱ్ఱము, సూర్యుడుసంతానం = బిడ్డ, కులము, వరుస, దేవతావృక్షం
బంధము = కట్టు, దేహం, సంకెల, దారంభాగ్యం = సంపద, అదృష్టము
చైత్యం = గుడి, బౌద్ధాలయం, భవనంఅవధి = హద్దు, ఏకాగ్రత
కళ = శిల్పము, అందము, చంద్రుని 16 కళలలో ఒక భాగం, వడ్డీకవి = కావ్యం రాసేవాడు, శుక్రుడు, నీటిపక్షి
తీర్థము = పుణ్యనది, ఘట్టము, పుణ్యోదకంపేరు = నామం, ప్రసిద్ధి
యాత్ర = జాతర, ముట్టడి, ఉత్సవంరాజు = ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు, రేడు

పర్యాయపదాలు

ఆకాశం - నింగి , అంబరం                                            సముద్రం - సాగరం , అంబుది , సింధువు  
దండు - మూర , గుంపు నక్షత్రం - తార , చుక్క 
ఆసక్తి - అభిరుచి , కోరిక అరణ్యం - అడవి, వనం 
తల్లి - మాత , జనని తండ్రి - పిత , జనకుడు 
అరణ్యం - అడవి,వనం వైరం - శత్రుత్వం,విరోధం 
ఉపాధ్యాయుడ - శిక్షకుడు,అధ్యాపకుడుతల్లి - అమ్మ,మాత
తండ్రి - నాన్న,పితఆసక్తి - ఇష్టం,ఉత్సాహం
దండు - గుంపు,సమూహంఉపాద్యాయుడు - గురువు , ఆచార్యుడు 
వైరం - విరోధం , శత్రుత్వం అంబోధి - సముద్రము, రత్నాకరవము 
పుత్తడి - బంగారము, పసిడి వసుధ - భూమి, ధరణి 
పెండ్లి - పరిణయం, వివాహం మిత్రుడు - స్నేహితుడు, నేస్తం 
అజ - యుద్ధం, సమరము ఈప్సితము - కోరిక, వాంఛ 
అవని - భూమి, ధరణి భృంగము - తుమ్మెద, ఉతృలము 
తురంగము - గుఱ్ఱం, అశ్వం, వాజి పంచాస్యం - సింహం, సింగం, కేసరి 
విపత్తు - ఇడుము, ఆపద ఏనుగు - మాతంగం, గజం, హస్తి 
భుజంగం - సర్పం, ఫణి, వాతాశనం, పాము, పన్నగము తనువు - శరీరం, దేహం 
సత్యం - నిజం, యదార్థం గురువు - ఆచార్యుడు, బృహస్పతి 
ఖగము - పక్షి, విహంగము అగ్ని - చిచ్చు, వహ్ని, అనలము 
పువ్వు - పుష్పము, విరులు అంధకారం = తమస్సు, తిమిరం, ఆంధ్యం 
అక్షములు = కన్నులు, నేత్రాలు, నయనాలు అనలుడు = అగ్ని, హవ్యవాహనుడు, వహ్ని, హుతభుక్కు 
అనిమిషులు = దేవతలు, సురలు, అమరులు, త్రిదశులు అభీష్టం - కోరిక, కాంక్ష, ఈప్సితం, ఆశ 
అశని - పిడుగు, కులిశం, నిర్ఘాతము ఆర్తవం - పుష్పం, సుమం, కుసుమం, పూవు 
ఇక్షు - రసాలము, కరటము, అంగారిక, చెఱకు ఇనుడు - సూర్యుడు, రవి, ద్యుమణి, నభోమణి 
ఇల - భూమి, పుడమి, ఉర్వి, ధరణి ఉరగము - పాము, సర్పము, ఫణి, అహి 
ఎద - హృదయం, మది కంఠీరవం - సింహం, మృగరాజు, కేసరి, పంచాస్యం 
కదళీ - అరటి, రంభ, సప్తపర్ణము కరము - చేయి, హస్తము, కేలు 
కరి - ఏనుగు, హస్తి, గజము, ఇభము కళ్యాణం - పెళ్లి, వివాహం, పరిణయం, ఉద్వాహం 
కృషి - ప్రయత్నం, శ్రమ కాయం - శరీరం, దేహం, తనువు 
నుతి - పొగడ్త, స్తోత్రము, స్తుతి పడతి - స్త్రీ, ఉవిద, ఇంతి, మహిళ, నవల, కొమ్మ 
పవనాశనము - పాము, సర్పం, ఫణి పావనం - పవిత్రం, పునీతం, పూతం 
పుటభేదనం - పట్టణం, నగరం, పురం బుధులు - పండితులు, విద్వాంసులు, కోవిదులు 
భానుడు - సూర్యుడు, అర్కుడు, ఫూషుడు, రవి వసనం - వస్త్రం, ఉడుపు, వలువ 
వెండి - కలదౌతం, రజతం రంతు - క్రీడ, ఆట, కేళి 
వారిజం - పద్మం, సరసిజం, జలజం, తామర వారిజగర్భుడు - బ్రహ్మ, చతుర్ముఖుడు, నలువ, విధి 
శరధి - సముద్రం, వార్ధి, నీరధి, జలధి సేతువు - వారధి, వంతెన 
పుష్పము - పూవు, కుసుమం, విరి, సుమం గుడి - దేవాలయం, ఆలయం, కోవెల 
రాజు - ప్రభువు, భూపాలుడు, నృపాలుడు కేలు - చేయి, హస్తం, పాణి 
బాంధవుడు - బంధువు, చుట్టం బాణము - అమ్ము, తూపు, మార్గణం, ఆశుగం 
గురువు - ఆచార్యుడు, ఒజ్జ, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు  వేదండం - ఏనుగు, హస్తి, ఇభం, కరి 
కీర్తి - యశస్సు, పేరు, శ్లోకం దురితము - పాపం, అఘం, కిల్బిషం 
జనని - తల్లి, అంబ, అమ్మ, మాత బుధుడు - పండితుడు, విద్వాంసుడు 
పుడమి - భూమి, ధరణి, అవని, వసుధ, ధర  ఏనుగు - కరి, గజము 
కృపాణము - కత్తి, ఖడ్గము కేలు - చేయి, హస్తము 
జనని - తల్లి, అమ్మ ఆకాశము - అంబరము, గగనము, అంతరిక్షము, నింగి 
భూమి - వసుధ, ఉర్వి, ధరణి, ధరిత్రి జిజ్ఞాస - ఆసక్తి, అభిరుచి 
దృక్పథం - ప్రగతి, ఆలోచనా సరళి ఇంచుమించు - దాదాపు, సుమారు 
ఉపాధ్యాయుడు - ఆచార్యుడు, అధ్యాపకుడు ఆసక్తి - కోరిక, ఇచ్ఛ, వాంఛ 
పథం - మార్గము, త్రోవ మాంతము - అకస్మాత్తు, అదాటు, అటాత్తు, హఠాత్తు, ఏమరుపాటు, అదరి పాటు, 
అమాయకుడు- అంబేద, గోల,బేలరి, మేదకుఁడు, నిష్కపటి వెర్రిబాగులవాడు.అర్ధరాత్రి - అద్దమరేయి. నడిరాతిరి. నడి రేయి,మధ్య రాత్రమ,మాం దారి: ప్రొద్దు: నిశీధము
అర్జునుఁడు- ఫల్గునుఁడు. పార్థుడు. కిరీటి,  శ్వేత వాహనుఁడు: బీభత్సుడు, విజయుడు, కృష్ణుడు, సవ్యసాచి, ధనంజయుఁడు; నరుడు, కఱ్ఱి, కవ్వడి, వివ్వచ్చుఁడు. క్రీడి. అమావాస్య -  అమవస, అమాస,దర్శము, అమావాసి, అమవాసి, అమావాసి: అమావస్య, కుహువు, అమామాసి, అమాసె, అమాస
అల - ఊర్మి, కడలు, కల్లోలము, తరంగము, భంగము; వీచిక, లహరిఅమృతము- ఘృతము, పీయూషము, సుధ.
అమ్మమ్మ- అవ్వ, మాతామహి.అలాతము- ఆలాతము, కొరవి, ఉల్ముకము. అంగారకము
అమ్మవారు- అమ్మతల్లి, మశూచి, మసూరిక,పోటకము, స్పోటకముఅల్పుడు- వివర్ణుఁడు: పామరుడు. నీచుఁడు, నిహీనుఁడు, అపశదుఁడు,  ప్రాకృతుఁడు
అమ్ములపొది- తూణము, తూణి, ఉపాసంగము, నిషంగము, అంపపాది, అంబులపొది.అయస్కాంతము- అంటురాయి, కృష్ణ లోహము, సూదంటు, సూదంటురాయి.
 అయివచ్చు-  అచ్చివచ్చు, కలిసివచ్చు, అనుకూలించు, మేలైవచ్చు.అల్లము - అనూవజము, అపాకశాకము: ఆర్థ(శా)కము. కందరము, భేషజము: మూలజము; రోలము, శృంగిబేరము; 
అర- అర్ధ(ము), అద్ద, సగము; సవము; సాముఅరచేయి- అరచేయి; లోజెయ్యి; చప్పట, కరతలము; చపటము; చపేటము; ఉద్ఘతము, ప్రహస్తము.
అరటి చెట్టు- కదళి, వారణబుస, రంభ, మోచ,గిరిజ.అల్లరి- గలాటా, గలిబిలి; గందరగోళము; గోల, రభసము, ఆగడము, గొడవ, గడబిడ, గలాభా. 
అరిదళము- అలంతాళము, కనకప్రభము, గోదంతము,  అలము, గోరోచనము,  చిత్ర గంధము; తాలము, పింజరము, హరితాళము.అల్లిక - అళియ, జామాత,  అల్లువాడు,  ప్రజాపతి, వరుడు, యామాత
అరుగు- తీనె, జగతి, వితర్ది, వేదిక,తిన్నె, తిన్నియ.అల్లుడు-  తంత వానము, తంతువాయము, నేత, పటకర్మము; వయనము; వ్యూతి, వానము.
ఆకురాయి- పత్రపరశువు, ఒరిపిడిరాయి, గరుకురాయి.ఆర్తి- బాధ,  ఆరాటము,  ఉద్వేగము, క్షోభ, వ్యథ,  వెత. 
ఆజ్ఞ - ఆదేశము,  ఆన,  ఆనతి, ఉత్తరువు,  నిర్దేశము,  నివేశము,  పంపు,  శాసనము. ఆటంకము-అడ్డగింత, అడ్డపాటు, అడ్డంకి,  అడ్డు,  అంకిలి,  అవరోధము.
ఆలస్యము-క్షేపము, జాగు, తడవు, తడయుట, మసలుట.ఆట- తాండవము, నటనము,  నాట్యము,  లాస్యము, నృత్యము,  నృత్తము,  నర్త నము.
ఆలిచిప్ప-గంగచిప్ప, కప్ప చిప్ప, కాకి చిప్ప,  గంగాళి, చిప్ప ఆటలమ్మ-ఆట్లమ్మ, తట్టు, పొంగు.
అడికోలు -  దూరు, నింద, కారుకూత, దూషణము, దెప్పరము,  ఎత్తిపొడుపు, అపవాదు, దెప్పు.ఆళ్ళు- ఆళులు,  ఆరుగలు,  కోరదూషము, వరీరూషము.
అడుకుక్క-కుక్కురి,  శుని, సారమేయిఆవాలు-అనఘము,  ఆసురి, ఐంద్రము, క్షతకము, క్షవకము,  తిక్తగంధ,  నాసికావేదనము, వేసవారము,  శ్వేతము,  సిద్ధార్దము,  సుతీక్షక
అడుగుఱ్ఱము -  అర్వతి, గోడిగ, కంఖాణి, బడబ, వాజిని.ఆశ్రేష - సప్పపుజుక్క,  అసివేరు,  అహి,  ఉరగము, భుజంగము,  వ్యాళము, సర్పము
అతతాయి-ఆకతాయి,  అకార్యకారి,  కొంటె,  కూళ, తుంటరి,  దుష్టుఁడు, బండడు.ఆదివారము-ఆదిత్యవారము,  భానువారము,  రవివారము, ఆకులవారము.
ఆసక్తి-అపేక్ష, అనురక్తి, పరాయణత, వ్యసనము, శ్రద్ధ. ఆనపకాయ-సొరకాయ, ఆనుగము, ఇక్ష్వాకువు, మహాఫల, తుంబిక.
ఇంగాలము- ఇంగలము, అంగారము, నిప్పు, అగ్ని, చిచ్చు,  జ్వాలి, ధూమకేతువు, వహ్ని, సెగ,  అనలము, అగిని, అగ్గి,  హసనీమణి. ఆనవాయితి-మామూలు, రివాజు,  వాడుక, అలవాటు.
ఇంగిలీకము-అతిరక్తము, కర్కటశీర్షకము,  జాతి, మణిరాగము, మణివారిజము, హింగుళకము.అనవాలు-అభిజ్ఞానము, గురుతు,  గుర్తు, చిహ్నము,  పొడ, జాడ, చిన్నె, సంజ్ఞ, సంకేతము.
ఆపము-అతిరసము,  అప్పము,  అరిసె,  చిప్పట్టు, పూర్ణకోశము; అపూపము.ఇంగువ-కబరి,  కేశరము, జతుకము, పృథ్వి, పృథువు,  పిణ్యాకము, ఉగ్రగంధ
ఆముదము చెట్టు - ఏరండము, ఉరుబూకము, రుచకము, చంచువు, చిత్రకము, పంచాం గులము,  మండము,  వ్యడంబకము, వర్ధమానముఉభయ పార్శ్వములు- ఇరువంకలు, ఇరుదెసలు: ఇరుచక్కియలు, ఇరుగ్రేవలు; ఇరుగడలు
ఉమియుట- నిష్ఠీవనము; నిష్యూతి; నిష్ఠేవనముఉమ్మెత్త-ఉన్మత్తము; కితవము; ధూర్తము; కనకము; మదనము; గాంగేయము
ఉరుము - గర్జనము; ఘోష; రసితము; స్తనితము.ఉలవలు-కులత్థ, వాలవృంతము. 
ఉలిమిరి చెట్టు- మొగలింగ; కుమారకము; వరుణము; ఉలిమిడి; సేతువు.ఊయల - డోలిక; జోల; లాలి; ఉయ్యెల: ఉయ్యాల; డోల; తొట్టె. 
ఊరట - ఊరడి; ఓదార్పు, ఉవశమనము: అనునయనము. అనునయము ఊసరవెల్లి- ముదిరిన తొండ; కామరూపి; కృకవాసము; చిత్రబింబము.
ఋజువు - తార్కాణము; దాఖలా; నిదర్శనము; సాక్ష్యము; రుజువు. ఋణదాత-ఉత్తమర్ణుడు; ఋణదాయి; కుసీదుడు; షావుకారు.
 ఋతుమతి-ఉదక్య, ఏకవస్త్ర, మలిని; మలిష్ట; ముట్టుత; త్రిరాత్ర.ఋషి-తపసి; తపస్వి, తాపసి; మౌని; జడదారి. 
ఉల్లిగడ్డ-ఉల్లి పాయ; ఎఱ్ఱగడ్డ; పలండువు; పలాండువు.ఎంగిలి-ఉచ్చిష్టము; జుష్టము; ఫేలి; అదిష్టము; ఫేలము.
ఉవ్విళులూరు, ఉవ్విళ్ళూరు -తొందరపడు; త్వరపడు; తహతహలాడు; వేగిరపడు; ఆతురపడు. ఎండ-ఆతపము;  ద్యోతము; ప్రకాశము;  ప్రొద్దు; వెలుగు
ఉసిరిక-అమృత; అనంత; ఆమలకి; తిష్యఫల, ధాత్రి; వయస్థ; రాధ; వజ్రము; నెల్లి. ఎండమావులు-మరీచిక; మృగతృట్టు; మృగతృష్ణ
ఊడ - పడుగొమ్మ: అవరోహము; జట; బుధ్నము:  మూలము; శిఫము.ఎండు-ఈచు; మాడు; డొంకు; నీరారు; ఇగురు; ఇంకు; వాడు; వట్టిపోవు; శుష్కించు; శోషించు. 
ఊడుగు- అంకోలము;  కుందురువు; కుక్కటము; గిరికోలము; దీర్ఘకోలక.ఎండ్రకాయ-ఎండ్రి; ఎండ్రిక, ఎండ్రకాయ; ఆరువు; కర్కటము; కర్కము; కుళిరము; పీత; వారిలోచనము
ఊతము-అండ; ఆధారము; ఆసరా; ఆలంబము;  ఆనిక; ఊనిక; మోపిక.ఎక్కిలి-ప్రాణంతి; వెక్కిలి; హిక్క, హేక్క, హృల్లాసము; ఎక్కిలి; వెక్క; వెక్కు. 
ఊతు-ఊత; డొంకవల.ఎడతెగని వాన-కుంభవృష్టి; ధారాపాతము,ముసురు. 
ఎడబాటు-ఎడయుట; జతవీడుట; విప్ర యోగము, విప్రలంభము; వియోగము.ఊదకడుపు- బానబొజ్జ, లంబోదరము; స్థూలోదరము; పొట్ట, బొజ్జ, 
ఊపిరి-ఊర్పు; ఊష్మము; శ్వాసము; దమ్ము,ఐకమత్యము-ఒందిక; పొందిక, ఒరిమ; పొత్తు; ఏకీభావము; సంఘీభావము.
ఒల్లెవాటు-ఒలెవాటు; వల్లెవాటు; వలెవాటు ఓడ-కప్పలి; నౌక, నావ; రోకము; యాన పాత్రము; హాడము.
ఐక్యమగు-ఏకమగు; లీనమగు; లయమగు;  మునుగు; లయించు.ఓడనడుపువాడు- సరంగు; ఓడంగి; కర్ణధారుడు; పీలికాడు; ఆరకాటి; పోతవాహుడు; మార్గరుడు.
ఐరావతము- అభ్రమాతంగము; అభ్రము; వల్లభము; ఐరావణము; వెలిగౌరు.ఐశ్వర్యము-సంపద, కలిమి; శ్రీ; సిరి; లచ్చి; భూతి; లక్ష్మి,
ఓణి-ఓణీ; ఓని; వల్లె; వాణి; పైటకండువా. ఓర్పు- ఓరిమి; క్షమ; క్షాంతి; తాలిమి; తాళిక; తితిక్ష; సహనము; సైరణ, నిమ్మళము.
ఒంకి- ఒంకు; ఒంకె; కొక్కెము; వంకె; చిలుక కొయ్య.ఔషధము-భేషజము; భైషజము; అగదము; జాయువు; మందు.
ఒంటె- లొట్టె; లొట్టిపిట్ట, ఉష్ట్రము; క్రమేలకము; మహాంగము; వాసంతము.కంకు- గద్దించు; కసరు; గదుము; తిట్టు.
ఒగరు-కషాయము; కస్సెము; కసియము; తొగర; కారు; తవరము.కంచము-తలిగ; తలియ; తళియ; పళ్ళెము; పళ్ళెరము. దడెము; తబుకు.
కంచర గాడిద-కంకర గాడిద; వేసడము; వేసరము; అశ్వఖరజము; అశ్వేతరము అశ్వతరము; ఖరము; గోకర్ణము; ప్రఖరము; అగరభము. ఒడగట్టు-వడగట్టు; వడియగట్టు; వడబోయు.
ఒట్టు-ప్రతిజ్ఞ; ప్రతిన; ప్రమాణము; పణము;  ప్రత్యయము; బాస; బిరుదు; బాఢము; శవనము; సంధ్య; సంగరము; శపథము; సమయము.కంచు- కంచము; కాంస్యము; కాంసీయము; తామ్రార్థము; లోహము; కంసాస్థి 
ఒడలు-అంగకము; ఒళ్ళు; మేను; కళేబరము; రూపు; బొందికంటె-కంటియ; కఠిక, కంటసరి.
కంఠము-అఱ్ఱు; కంధర; కంబువు; గొంతు; గొంతుక, కుతిక; కుత్తిక; కుత్తుక; మోర. ఒడ్డాణము-ఒడ్డణము; ఒడ్యాణము; కలాపకము; కలాపము; కటిత్రము; శక్వరి
కండువా-ఉత్తరానంగము; ఉత్తరీయము; బృహతిక; బైరవాసము; ఖండువా, సంవ్యానము.ఒడ్డు-కూలము; రోధము; తీరము; తలము;  వప్రము; మర్యాద; దరి; గట్టు; శంబలము; సంబలము.
కండె - కండియ; కండెన; కంకి; కంకెన; వెన్ను. కంతి-గుబ్బ, బుడిపి; బొప్పి; కదుము; కణితి; బొడప.
ఒత్తు- అదుము; అద్దు; తాచు; నొక్కుఒర-కోశము; గౌసెన, గవుసెన; పైతొడుగు. 
ఒరవడి - ఆణి బంతి; మేలుబంతి; ఒజ్జబంతి; మాదిరి బంతి. కడుగు-కుడితి;  జ్యేష్ఠాంబువు; తండురీణము.  
కడుపు- కుక్షి; గర్భము; ఉదరము; జఠరము; తుందము; డొక్క;  బొజ్జ. కంది- ఆఢకి; కరవీ భుజ; కాక్షితాలిక; పీత పుష్ప; ప్రగ్రీవ; వృత్తబీజ; సూప్య.
కణము- నెరసు; రవ్వ; రవ; నలుసు; జీరము; అంశువు; అణువు; రేణువు. కందురీగ-కణుదురీగ; గండోలి; వరటము; భృంగము; భృంగరోలము; శూక కీటకము;  గంధాలి; వరట.
కణుపు-కనుపు; కన్సు; గనుపు; గంటు; చెట్టె; పర్వము.కత్తి-ఖడ్గము; అసి; రిష్టి; కృపాణము; కరవాలము; కౌక్షేయకము; చంద్రహాసము; రిష్టము; టంకము; వాలు; అడిదము. 
కంబలి -ఊర్ణాయువు; కంబళము; కుతపము;కంబళికచోరము-గంధమాలిక; గంధాళి; గంధాహ్వ; గ్రంథిపర్ణి; ద్రావిడము; కచ్చురము. 
కత్తిపిడి- ఆయుగము; జర; పరుజ; త్సరువు; తలము; సెమ్మలి; పరుజ. కజ్జికాయ -కజాయము; కజ్జాయము; కజ్జియము; కజ్జెము.
కత్తెర- కర్తని; కర్తరి; కల్పని; ఖండదార; కేశకారము. కదలునది-చలనము; కంపనము; కంప్రము;  లోలము; చంచలము; తరళము; పరిప్లవము.
కటుక రోహిణి- అశోక; కటుంభర; కటువు; చక్రాంగి; శకులాదని.కథ-ఆఖ్యాయిక; కత; ఇతివృత్తము; గాథ,చరితము; చరిత్రము.
కట్టాణిగుండ్లు- ముక్తావళి; ముక్తాహారము; ముత్తెసరము;ముత్తేసరి; ముత్యాల దండ.కనుగ్రుడ్డు, కనుపాప -కనీనిక; కామనిక; గోలము; సింగనాదము; నల్లగ్రుడ్డు; కంటిపాప; పాప; తారకము; తారము
కట్నము-అరణము; ఉడుగర; వరదక్షిణ; శుల్కము. కఠినము-కర్కశము; క్రూరము; కఠోరము; దృఢము. 
కడ-అంతరము; అంతము; చరమము; చివర;  తుద.కనుబొమ్మ-ఆవి; కూర్చిక, కోదండము; భ్రూవు, బొమ. 
కడవ-ఘటము; భాండము; కలశము; కరిరము; కుండ; కుంభము; కుటముకన్నము-కంత; కలుగు; తూటు; బెజ్జము; రంధ్రము; బొక్క; క్రంత; బొరియ; బొర్రు 
కడిమి చెట్లు- కదంబము; కర్ణపూరము; దూతఘ్ని; బలిప్రియము; వోఢము; సువాసము; సురభి.కన్నీరు-అశ్రువు; నేత్రాంబువు; రోదనము; అస్రము;  అస్రువు; బాష్పము. 
కడియము-కటకము; వలయము; కడెము; (కిందివి రవ్వలు ముత్తెములతో కూడినవి) కంకణము; ముంగామురము; ముంగ (గా) మురారి.కన్ను-  అక్షి; చక్షుస్సు; చక్షువు; నేత్రము; నయనము; దర్శనము;  దృక్కు, దృష్టి. 
కన్య- కన్నె; కుమారి; బాలిక; వధూటి; వృషలి; చిన్నది; పిల్ల,కంద-అర్మోఘ్నము; ఆర్మము; ఉల్లువు; ఓలము; కాలకచువు; ఓల్లము; కుష్ఠహంత, చిత్రదండకము; దుర్నామారి; మేహనాశము; శూరణము; వజ్రముష్టి; వనకుండలి; నూరణము; కండూరము; కంఠీలము.
పుణ్యము = సుకృతము, ధర్మము, కుశలము, శ్రేయముఓష్ఠము - పెదవి, అధరము, వాతెర
చరణము - పాదము, పదము, అడుగు,అంఘ్రి అంబుదము - మేఘము, పయోధరము,జలదము, మబ్బు
సౌదామిని - మెరుపు, తటిత్తు, విద్యుల్లతఅనలం - అగ్ని, వహ్ని, చిచ్చు
మార్గం - దారి, పథము, బాటఅంబుధి - సముద్రం, సాగరం, పయోథి, పారావారం, కడలి, ఉదధి
పతివ్రత - సాధ్వి, పురంధ్రి, సతియవనిక = తెర, పరదా
శరీరం = తనువు, కాయం, మేనుగాథ = కథ, చరిత్ర, ఆఖ్యాయిక
సంపద = వైభవం, ఐశ్వర్యందీపము = దివిటీ, దివ్వె, తెల్లిక, దీపిక 
పేరు = నామము, ఆఖ్య, అభిదానము

రుగాగమ సంధి - సూత్రము - ఉదాహరణలు

 రుగాగమ సంధి 

ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.

అ) పేదరాలు

ఆ) బీదరాలు

ఇ) బాలింతరాలు

పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం. ఎట్లా మారాయో పరిశీలిద్దాం.

పేద + ఆలు = పేదరాలు

బీద + ఆలు = బీదరాలు

బాలింత + అలు - బాలింతరాలు

పేద + ఆలు -> పేద + ర్ + ఆలు = పేదరాలు

బీద + ఆలు -> బీద + ర్ +  ఆలు = బీదరాలు

బాలింత + అలు -> బాలింత + ర్ + అలు = బాలింతరాలు

పై మూడు సందర్భాలలో పర పదం 'ఆలు'

పేద, బీద, బాలింత పదాలకు 'ఆలు' పరమైంది.

పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను 'పేదాదులు' అంటారు.

పేదాదిపదాలకు 'ఆలు' అనే పదం కలిసినప్పుడు 'ర్' అనే అక్షరం అదనంగా వచ్చింది.

'ర్' అనేది అదనంగా రావడాన్ని 'రుగాగమం' అంటారు.(ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే 'ఆగమం'.)


దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు

పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు రుగాగమమవుతుంది.

పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం)

ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయమంటారు.

* కర్మధారయమందు పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైతే రుగాగమమవుతుంది.

పై పద్ధతి ప్రకారం కింది పదాలను విడదీసి గమనించండి. విశ్లేషించండి.

 ముద్దరాలు = ముద్ద + ఆలు 

జవరాలు = జవ + ఆలు 

మనుమరాలు = మనుమ + ఆలు 

కొమరాలు = కొమ + ఆలు 

పైన చెప్పిన పేదాది పదాలు తెలుగుపదాలు. ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.

గుణవంత + ఆలు = గుణవంతురాలు

బుద్దిమంత + ఆలు = బుద్ధిమంతురాలు

శ్రీమంత + ఆలు =  శ్రీమంతురాలు

ఈ సందర్భాలలో కూడా 'ర్' వస్తుంది. కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా? అదేమిటో పరిశీలిద్దాం! 

గుణవంత + ఆలు -> గుణవంత + ఉ+ ఆలు - > గుణవంతు + ఆలు - >గుణవంతు + ర్ + ఆలు - గుణవంతురాలు

శ్రీమంత + ఆలు - శ్రీమంత + ఉ + ఆలు

శ్రీమంత + ఆలు - > శ్రీమంత + ఉ+ ఆలు - > శ్రీమంతు + ఆలు - > శ్రీమంతు + ర్ + ఆలు ->శ్రీమంతురాలు

అలాగే 

బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ+ ఆలు → బుద్ధిమంతు + ఆలు - బుద్ధిమంతు + ర్ + ఆలు - > బుద్ధిమంతురాలు

పై మూడుచోట్ల తత్సమపదాలకు 'ఆలు' కలిస్తే మొదటిపదం చివర ఉన్న అచ్చు 'అ'కారానికి బదులు 'ఉ' కారము వచ్చి తరువాత రుగాగమయింది. దీన్ని ఇట్లా చెప్పవచ్చు.

కర్మధారయమందు తత్సమ శబ్దములకు 'ఆలు' శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివరఉన్న 'అకారానికి' ఉకారము వచ్చి రుగాగమం అయింది.


అర్థాలు - Telugu Meanings


కీడు = చెడు మేను = శరీరం
కొదువ = తక్కువనిగ్రహించు = గర్వపడు
ధనం=డబ్బుకేటాయింపు=ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం
ప్రశంసాపత్రం=మెచ్చుకొంటూ ఇచ్చే  పత్రంనగదు=డబ్బు.
పతకం=గుర్తింపుగా ఇచ్చే బిళ్ళ.అవార్డు=బహుమతి,పురస్కారం
కృతజ్ఞతా=ధన్యావాదాలు.క్షేమంగా=సురక్షితంగా .
సాహసం=తెగింపు(ధైర్యంగా)చేసే పని ఊపిరి=గాలిపీల్చడం 
వ్యాపించు=విస్తరించు.ప్రమాదం =ఆపద.
అచేతనం =కదలకుండా  ఉండు.పినతండ్రి =తండ్రితమ్ముడు,బాబాయి.
పద్మం=కమలం,తామరపువ్వు.నాట్యగత్తె= నృత్యంచేసే స్త్రీ.
నిర్మించుట=కట్టుట.శతాబ్ది=నూరు సంవత్సరాలు.
ఆలయం=గుడి. విగ్రహం=దేవుని బొమ్మ.
వైశాల్యం=ఒక వస్తువు విస్తరించిన ప్రదేశం.సేనాని=సేనలకు అధికారి,సైన్యాధికారి.
తీరం = ఒడ్డు సర్పం = పాము
యుక్తి = ఉపాయంపచ్చిక = గడ్డి
కొలను = సరస్సుజలకం = స్నానం
మింటికి = ఆకాశానికికుమిలి = బాధపడి
శిల్పం=రాతిలో చెక్కిన బొమ్మ.డబ్బు = ధనము 
తోట = వనము పాట - గానము 
నిశ్శబ్దం = మౌనము గొప్ప = ఘనము 
కాల్చు = దహనము మురికి = మలినము 
పిలుపు = ఆహ్వానము ఆకాశం = గగనము 
కదలిక = చలనము పరంపర = వరుస 
పరిశీలన = వివరంగా తెలుసుకొనటం తపన = కోరిక 
మన్నన = మర్యాద ప్రోత్సహం = పురికొల్పటం 
స్వానుభవం = స్వయంగా అనుభవించినది నిరంతరం = ఎల్లప్పుడు 
సింధువు = సముద్రం అమాయకముగా = మోసము తెలియని 
అరయు = చూచు, తెలుసుకొను అర్చన = పూజ 
అర్భకుడు = బక్కపలచటి వాడు, చేతకాని వాడు ఆచరించుట = చేయుట 
ఆడంబరము = డంబము, బింకము ఆర్తి = ఆతురత 
ఆవేశము = కోపము ఆహ్వానము = పిలుపు 
ఇల = భూమి ఉల్లాసంగా = సంతోషముగా 
ఊహ = ఆలోచన ఋణం = అప్పు 
ఋషి = ముని ఏక = ఒకటి 
ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పటం ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుట 
ఒప్పందం = కట్టుబాటు ఔషధం = మందు 
కంటకం = ముల్లు కంపం = కదలిక, వణుకు 
అనువు = ఉపాయము కఠోరం = కఠినం 
కథానిక = చిన్నకథ కనకము = బంగారము 
కమఠము = తాబేలు కర్తవ్యం = చేయవలసిన పని 
కలప = కట్టె, కర్ర కల్ల = అబద్ధం, అసత్యం 
కలిసి మెలిసి = ఇకమత్యంతో కునుకు = చిన్నపాటి నిద్ర 
ప్రవాహము = పరంపర, వెల్లువ వాచికము = వక్కాణము, సమాచారము 
అపరాధం = తప్పు, నేరము అపహరించు = దొంగలించు 
అపహసించు = వెక్కిరించు, ఎగతాళి చేయు అపాయం = ప్రమాదం, ఆపద 
అప్రియం = ఇష్టం కానిది అభిరామ = అందమైన, మనోహరమైన 
అమాంతముగా = అకస్మాత్తుగా, ఒక్కసారిగా అమిత = ఎక్కువైన 
అర్థమత్తుడు = ధనం చేత పొగరెక్కినవాడు అర్పించు = ఇచ్చు 
అరుగు = వెళ్ళిపోవు అలుక = కోపం 
అవధి = హద్దు అశ్రువు = కన్నీరు 
 అసంఖ్యాక = లెక్కలేనన్ని అహం = నేను అనే భావం 
అహంకృతుడు = గర్వం చూపేవాడు మోతుబరి = ఎక్కువ భూమిని సేద్యం చేసే రైతు(భూస్వామి) 
తగాదా = పోట్లాట అరమరికలు = తేడాలు 
అవరోధం = అడ్డు అవసానకాలం = చివరి కాలం 
సమీపించు = వచ్చు యోగ్యులు = మర్యాదస్తులు 
వ్యవహారాలు = పనులు దక్కు = లభించు 
విషమించు = చేయి దాటిపోవు కుశలత = నేర్పు 
భంగ పడు = అవమానపడు వృద్దాప్యం = ముసలి వయస్సు 
నిశ్చింత = చింతలేకుండా జగడం = పోరు 
తరణం = దాటడం తగాదా = తగువు 
లుబ్దత్వం = పిసినారితనం తకతకలాడు = తొందరపడు 
మంకు = మొండి ఉక్తి = మాట 
లోభి = పిసినారి సౌరభం = సువాసన 
నీహారం = మంచు శీతలం = చల్లని, చందనం 
సౌమ్యం = శాంతం ఉపకరణములు = సాధనాలు 
లయం = వినాశం లంక = దీవి, ద్వీపం 
క్లిష్టం = కష్టమైన ఉత్సుకత = కుతూహలం 
రయం = వేగం అనిలం = గాలి 
కృపాణం = కత్తి తావి = పరిమళం 
మహి = భూమి సమగ్రం = సంపూర్ణం 
పైకం = డబ్బు కళంకం = మచ్చ, గుర్తు 
నింగి = ఆకాశం ప్రతిష్ఠ = గౌరవం 
హారం = దండ పికం = కోకిల 
ఇల = నేల దండు = సేన 
నవల = స్త్రీ, ఒక సాహితీ  ప్రక్రియ ఊత = ఆధారం 
కోమలి = స్త్రీ అట్టహాసం = పెద్దనవ్వు 
అడచు = తగ్గించు, అణగకొట్టు జగత్తు = ప్రపంచం 
క్షామం = కరువు ఆదిత్యుడు = సూర్యుడు 
ప్రసూనం = పువ్వు స్వప్నం = కల 
ఆకాంక్ష = కోరిక భీతి = భయం 
ప్రీతి = ఇష్టం పీచమణచు = నిర్వీర్యం చేయడం 
ఖరవు = గర్వం ఉద్వాహం = పెళ్లి 
అన్యం = ఇతరమైన ఎఱుక = తెలుసు 
స్నేహితులు = మిత్రులు మోదం = సంతోషం 
ధరిత్రి = భూమి పోరితము = యుద్ధము 
కపి = కోతి వ్యాఘ్రము = పులి 
మైకం = మత్తు పికం = కోయిల 
అనంతం = అంతం లేనిది అమాత్య పీఠం = మంత్రి కూర్చునే స్థానం 
అరుదెంచి = వచ్చి వైనం = విధం 
సలిలం = నీరు అనాలం = నిప్పు 
కౌశలం = నేర్పు దామం = హారం 
జాయువు = మందు, ఔషధం సర్పం = పాము 
సాటి = సమానం తరువు = వృక్షం 
ఠీవి = గాంభీర్యం పరిపాటి = క్రమం 
ఉద్ది = జత కుటిలం = మోసం 
వ్యవహారాలు = పనులు నమ్రత = వినయం 
అపరంజి = బంగారం కలిమి = సంపద 
కనికరం = దయ  జిత్తు = మాయ 
అర్కుడు = సూర్యుడు మదం = గర్వం 
దోషము = పొరపాటు మాసము = నెల 
భంగము = ఆటంకం కరము = చేయి 
తమస్సు = చీకటి అంబరం = ఆకాశం 
కడుపు = ఉదరం, పొట్ట క్షణము = లిప్త, త్రుటి, ముహూర్తం 
తామర = పద్మము, అంబుజము విమర్శ = సమీక్ష, అవలోకనము 
పావడము = వస్త్రం పానీయము = నీరు 
పాటవం = నైపుణ్యం పావనము = పవిత్రం 
కేళి = ఆట ధారణ = జ్ఞాపకం 
మూక = సమూహం తరుణి = స్త్రీ 
శౌర్యం = పరాక్రమం విస్తృతం = విరివిగా 
వల్లి = భూమి, తీగ భానుడు = సూర్యుడు 
పస = సారము, సమృద్ధి సొంపు = సౌందర్యము 
కంక = వెదురు, కోడె అగ్గువ = చౌకగా 
పిరం = ఎక్కువ ధరకుములు =  బాధపడు
కైకిలి = కూలిపిసరు =  చిన్నముక్క
పిడాత = అకస్మాత్తుగాఅక్కెర = అవసరం
ఆయిల్ల = గత రాత్రిఅనుకుడు = వణకడం
మడిగె = దుకాణంగట్లనే = అట్లాగే
గత్తర = కలరాగంతే = అంతే
తత్తర = తడబాటుఅతిశయిల్లు  - పెరుగుతూ ఉండటం
అధికం = ఎక్కువఅద్భుతం = ఆశ్చర్యం 
అనంతరం = తర్వాత అనర్గళం = ఎడతెరిపిలేకుండా, ఆగకుండా మాట్లాడడం
అనుభవించు  = సొంతం చేసుకొనుఅపహరించు = దొంగిలించు 
అభినందించు  = ఒక మంచిపని చేసినందుకు కాని,                ఒక మంచి సందర్భంలో కాని మెచ్చుకోడం అభిరాముడు = మనోహరమైనవాడు 
అలజడి = మనస్సులో బాధ, కలత, గొడవఅభిమానం = ప్రేమ, గౌరవం 
అమాయకంగా = మోసం తెలియని అరయు = చూచు, తెలుసుకొను 
అర్చన = పూజ అర్భకుడు = బక్కపలచటివాడు, చేతకానివాడు
ఆచరించుట = చేయుటఆడంబరము = డంబము, బింకము
ఆర్తి = ఆతురత ఆవేశం = కోపం, ఒళ్లు తెలియనికోపం 
ఆహ్వానం = పిలుపుఇల = భూమి
ఉల్లాసంగా = సంతోషంగాఊహ = ఆలోచన
ఋణం = అప్పు ఋషి = ముని
ఏక = ఒకటి ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పడం 
ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుటఒప్పందం = కట్టుబాటు
ఔషధం = మందుకంటకం = ముల్లు 
కఠోరం = కఠినం కథానిక = చిన్నకథ 
కంపం = కదలిక, వణుకు కజ్జికాయ = ఒకరకమైన తియ్యటి తినుబండారం 
కనకము = బంగారముకమఠం = తాబేలు
కర్తవ్యం = చేయాల్సిపని కలప = కట్టె, కర్ర 
కల్ల = అబద్ధం, అసత్యం కలిసిమెలిసి = ఐకమత్యంతో
కుండపోత = కుండముంచినట్లుగా పెద్ద ధారగా పడుతూండటం కుదురు = కదలకుండా ఉండటం, స్థిరత్వం, నిలకడ 
కునుకు = చిన్నపాటి నిద్ర కొంటెపనులు = చిలిపి పనులు
కొలను = చెరువుకొలువు = ఉద్యోగం
కోవెల = గుడిఖగం = పక్షి 
ఖరం = గాడిదఖుషీ = సంతోషం
పింఛం = నెమలిపురిపిన్నలు = చిన్నవాళ్ళు
ప్రీతి = ఇష్టం , ప్రేమ పూరిగుడిసె = గడ్డిపాక 
పేడ = పెండఫలం = పండు
బంక = జిగురు బృందగానం = జట్టుగా పాడుట, జతగా పాడుట
బహుమానం  = కానుక, ప్రైజు, ఇనాము బువ్వ = అన్నం
భవనం = ఇల్లు, మేడభాగ్యం = డబ్బు, ధనం, సంపద 
భిన్నము = వివిధము, వేరువేరుభూషణం = అలంకారం
భౌతికం = శారీరకం, శరీరసంబంధంమధురమైన = తియ్యనైన 
మనుజుడు = మనిషి, మానవుడు మనీష = తెలివి, ప్రజ్ఞ 
మర్కటం = కోతి మర్దన = మసాజు 
మహి = భూమి మహిమ = గొప్పతనం
మానసము = మనస్సుమార్గం = తోవ, దారి 
మిధునం = జంట ముగింపు = చివర, పూర్తి 
మేఖల = ఒడ్డాణం మేఘం = మబ్బు 
మోజు = ఇష్టం మౌనము = మాట్లాడకుండా ఉండుట, ఖామోషీ
యశస్సు = కీర్తియాగం = యజ్ఞం 
యాతన = కష్టం, ఇబ్బంది యానం = ప్రయాణం
రక్షణ = కాపాడుట రాగము = అనురాగము, సంగీతరాగం
రాక్షసులు = రక్కసులు, దేవతల శత్రువులులచ్చి = లక్ష్మి 
లవణం = ఉప్పు, నమక్లాలస = కోరిక 
లెస్స = మంచి లొట్టలు = నోరూరుట
వడి = వేగం వధువు = పెళ్లికుమార్తె 
వనవాసం = అడవిలో నివసించుట వరహా = పూర్వకాలంలో వాడుకలో ఉన్న చాలా విలువైన నాణెం 
వర్ధనం = పెంచడం, వృద్ధి చేయడం; పెరగడం వర్షం = వాన 
వర్గీకరణ = వేరుచేయుట వానరులు = కోతులు 
వారధి = వంతెన వ్యాధి = రోగం 
విచిత్రం = ఆశ్చర్యం విచ్చిన = వికసించిన
విద్యాభ్యాసం = చదువునేర్చుకొనుట విశ్వద = ప్రపంచాన్ని ఇచ్చిన
విస్తరించు = వ్యాపించు సంతతి = జాతి 
ఘనకీర్తి = గొప్పపేరు ప్రాచుర్యం పొందు = విస్తృతి చెందు, బాగా వ్యాపించు
మహోజ్వలం = మిక్కిలి ప్రకాశవంతంవిజయ యాత్ర = గెలిచిన సందర్భంలో చేసే ఊరేగింపు
ఎత్తుపల్లాలు = ఉన్నతి, క్షీణతసంప్రోక్షణ = శుద్ధి చేయటం
ప్రఖ్యాతి = ప్రసిద్ధిసమాగమం = కలయిక
చవి = రుచిపుట = పేజీ
అజరామరం = శాశ్వతంఅర్జించు = సంపాదించు
అవధి = హద్దుయవనిక = తెర  
మాన్యులు = గౌరవనీయులుపరవళ్ళు = ప్రవాహాలు
రహదారులు = రోడ్లు (బాటలు)పాయ = చీలిక
వైభవం = సంపదపరీవాహక ప్రాంతం = ప్రవహించే ప్రాంతం 
రూపుదిద్దుకొను = ఆకారం పొందుచర్మకారుడు = చెప్పులు కుట్టేవాడు 
తరలిపోవు = వెళ్ళిపోవుహర్మ్యం = మేడ
హంగులు = సదుపాయాలు  సచేతనం = చైతన్యంతో కూడిన 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు