మోదం కాని మోదం? - ఆమోదం |
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? - పాలు, పెరుగు, నెయ్యి |
రసం కాని రసం, ఏమి రసం? - నీరసం |
ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం? - తేనె పట్టు |
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ? - లవంగ మొగ్గ |
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? - తేనె పట్టు |
మూత తెరిస్తే, ముత్యాల పేరు? - దంతాలు |
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు? - సూర్యుడు |
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే? - దీపం |
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు? - పత్తి పువ్వు |
లాగి విడిస్తేనే బ్రతుకు? - ఊపిరి |
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది? - వేరుశెనగ కాయ |
జాన కాని జాన, ఏమి జాన? - ఖజాన |
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? - ఉల్లిపాయ |
అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చుస్తే నిన్ను చూస్తుంది, నేను చుస్తే నన్ను చూస్తుంది? - అద్దము |
అందరికి చెప్పి వొచ్చేది, చెప్పకుండా వెళ్ళేది? - ప్రాణం |
కాయలు కాని కాయలు, ఏమి కాయలు? - మొట్టి కాయలు |
అందని వస్త్రం పై అన్నీ వడియాలే? - నక్షత్రాలు |
నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు? - లవంగం మొగ్గ |
చిన్నోడి ఒంటినిండా నారబట్టలు - టెంకాయ |
పళ్లు లేవు కానీ కరుస్తుంది - చెప్పులు |
ఆ ఆటకత్తె ఎప్పుడూ లోపలే నాట్యం చేస్తుంది? నాలుక |
నీటిలో ఉంటే ఎగసిపడతాను, నేల మీద కూలబడతాను- కెరటం |
ఆకలేయదు, నీరు తాగదు, నేలని పాకదు... ఏమిటా తీగ? విద్యుత్తు తీగ |
శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. మామిడి పిందె |
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది? - తాటిచెట్టు |
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? - తేనెపట్టు |
తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనవలు బొమ్మ రాళ్లు. ఎవరు వారు? - పనస కాయ |
మూత తెరిస్తే ముత్యాల పేరు.- దంతాలు |
చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం. తియ్యగా నుండు.ఏమిటది? - కొబ్బరి కాయ |
ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు. - మిరప చెట్టు |
ఊరంతటికీ ఒక్కటే దుప్పటి.ఏమిటది? - ఆకాశం |
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. బాట వెంట పోయేవారిని కొంగు పట్టుకు లాగింది. - ముళ్లకంప |
కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది. కానీ ఏనుగు కాదు. - నత్త |
పచ్చని ఆకు, తెల్లని అన్నం, నల్లని కూర. ఏమిటది? సీతాఫలం |
కాళ్లు, చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.-ఉల్లిపాయ |
పర్వతమున పుట్టి, పయనించి అడవుల పట్టణాలు దాటి పరుగులెత్తి సమసి పోదుతుదకు జలరాశిలో దూకి - తెలుగుబిడ్డ! నన్ను తెలియగలవా? - నది |
మనుషుల్లేని దేశాలు నీళ్లులేని సముద్రాలు మంచులేని ధ్రువాలు ఏమిటది? - ప్రపంచపటం |
పులినిపట్టి బోనులో పెట్టే మనిషి ఇంత చిన్న జీవికి భయపడి తెరలచాటున దాక్కుంటున్నాడు? - దోమ |
రెక్కల్లేని పిట్ట. కళ్లు లేకపోయినా గురితప్పని దిట్ట. చందమామ ఒడిలో చేరాలని ఆరాటం .- చంద్రయాన్ |
పాదములు నాల్గు గలవైన ప్రాణి గాను. చేరియుండును గణములు, శివుడ గాను. కలవలంకారములు పెక్కు, కాంత గాను తెలుగు బిడ్డనన్ను తెలియగలవె? - పద్యం |
గుండ్రని కుప్పెలో మంటలేని వెలుగు పగలంతా నిద్ర, రాత్రంతా జాగరణ. - ఎలక్ట్రిక్ బల్బ్ |
నూరు దుప్పట్లు కప్పుకుని మొద్దు నిదుర పోతుంది. దుప్పట్లను తీయాలంటే ఏడవటం తప్పదు మరి. - ఉల్లిగడ్డ |
తలపై పచ్చని కుచ్చుల టోపి కనిపించని ఎర్రని దొరసాని నాజూకుగ తయారై ఇంటింటా వంటింటికి నడిచొస్తుంది - క్యారెట్ |
హాయిగా కూర్చోపెట్టి ఇంటికి తీసుకుపోయే ఇల్లు, పరుగులు తీసే ఇల్లు. - బస్సు |
కొండలు దాటి, పట్టణాలు దాటి, అడవుల్లో నడచి మును ముందుకె సాగుతా, వెనుదిరిగే పనిలేదు, గమ్యం చేరేదాకా. - నది |
రెక్కలు ఉన్నాయి, పక్షి కాదు.చుక్కాని ఉంది, పడవ కాదు. కాళ్ళు లేవు, చకచకా కదిలిపోతుంది. - చేప |
వంకర లేని ఒకే పలువరస, కొరికానంటే కసకస,నున్నగ పరపర ముక్కలు చెక్కలు చేస్తా. - రంపం |
రెండు మెరిసే కొమ్ములతో మబ్బుల్లో తేలియాడుతుంటాను. చంద్రవంక |
చక చకా పోయేవి రెండు - కాళ్లు గట్టెక్కి చూచేవి రెండు - కళ్లు అంది పుచ్చుకునేవి రెండు - చేతులు ఆలకిస్తుండేవి రెండు - చెవులు |
అడవిలో పుట్టాను, మేదరి ఇంట్లో మెలిగాను. వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. - వేణువు |
ఆరు కాళ్ళుంటాయి తుమ్మెదను కాదు, తొండం ఉంటుంది, ఏనుగును కాను, దోమనూకాను, రెక్కలుంటై గాని, పక్షిని కాను. - ఈగ |
అన్ని ఋతువుల్లోను ఆదుకుంటాను, విచ్చుకుని నీపైన కాచుకుంటాను. - గొడుగు |
అందరికీ నేనవసరం, నాకెవరూ అనవసరం, కంటికి కనపడకున్నా, అందర్నీ అరుసుకుంటూ ఉంటాను.- గాలి |
సాచుకుని సావిట్లో పడుకుంటాను,ముడుచుకుని మూల కూర్చుంటాను.- చాప |
వేయి కళ్ల పులి ఏట్లో వేటాడబోయింది. - వల |
లోన తీసి ఒకటి - అరటి పైన తీపి ఒకటి - ఖర్జురం అంతా తీపి ఒకటి - బెల్లం |
ఏలక్కాయంత పగడాన్ని, ఎంత వాళ్లైనా పట్టలేరు, ఏనుగు కూడా మోయలేదు. - నిప్పు |
అంతులేని తోటలో పూలే పూలు, చూసే వారేగాని కోసేవారు లేరు.- నక్షత్రాలు |
మేసేది వేలంత, కూసేది పిడుగంత, తీసేది ప్రాణం తుపాకి |
బరువు మోతుగాని బండినేమియు గాను, కాళ్లు నాల్గు గలవు ఖరము గాను , చేతులున్నవైన చేయలేనే పని,తెలుగు బిడ్డ నన్ను తెలియగలవా? - కుర్చీ |
చలన శక్తిగలదు, జంతువు కాదది,చేతులెపుడు త్రిప్పు శిశువు కాదు, కాళ్లు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేశ.- గడియారం |
నీరు తాగి, నిప్పు మింగి, గుప్పు గుప్పున తేన్చుతుంది, - ఎందరెక్కి కూచున్నా ఇట్టే పరుగు తీస్తుంది.- రైలు |
చెవులు పట్టుకుని ముక్కు మీద కూర్చుంటుంది. మోసేదొకరు, చూసేదొకరు! - కళ్లజోడు |
పొట్టి పిల్లకు పెట్టెడు బట్టలు.- ఉల్లిపాయ |
ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. - మద్దెల |
వెనక్కి వెనక్కి పోతే గెలుపు.ముందు ముందు కొస్తే ఓటమి.- తాడులాగే ఆట |
చెట్టుకు కాయని కాయ,ఎర్ర ఎర్రగా పెట్టే కాయ, ఏడాదంతా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తిను కాయ.- ఆవకాయ |
పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు,తియ్యని విందులు - సీతాఫలం |
తియ్యటి కోట, కోట చుట్టూ కోటి మంది భటులు. ఏమిటది? తేనెపట్టు |
ప్రాణంలేని నాలుగు కాళ్ల జంతువు. తన వీపు మీద మనల్ని మోస్తుంది. ఎవరది? మంచం |
ఆకాశంలో అందమైన పండు. రోజుకో రూపంలో ఉండు. ఒక్కో రోజు మాత్రం కనిపించకుండా ఉండు. ఏమిటది? చందమామ |
కడవలో మునిగింది, అటుఇటూ తిరిగింది. తల్లి నుంచి అన్నదమ్ముల్ని వేరుచేసింది. ఎవరది? కవ్వం |
అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి? తేనే పట్టు |
అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది? విస్తరాకు |
అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను, అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను? టెలిఫోన్ |
అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు? ఆకలి |
ఐదుగురిలో బుడ్డోడు! పెళ్ళికి మాత్రం పెద్దోడు!!? చిటికెన వ్రేలు |
కొప్పు ఉన్నా జుట్టు లేదు, కళ్ళు ఉన్నా చూడలేదు? టెంకాయ |
గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది? తాటి చెట్టు |
జానెడు ఇంటిలో, మూరెడు బెత్తం? కుండ, గరిట |
తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది? అత్తి చెట్టు |
చెట్టుకు కాయని కాయ? ఆవకాయ |
ఆకుల్లేని అడవుల్లో వంద దంతాల రాక్షసి? దువ్వెన |
వానాకాలంలోనూ, ఎండాకాలం లోనూ విరిసే నల్లకలువ? గొడుగు |
వేలెడంత ఉండదు కానీ ఇంటిని కాపాడుతుంది? తాళంచెవి |
ఎంత శుభ్రం చేసినా చెరిగిపోని మచ్చ? పుట్టుమచ్చ |
వేడి నూనెలో అందమైన ముగ్గు. తీసి తింటే కరకరమంటుంది. ఏమిటో చెప్పండి? జంతిక |
నాలుగు కాళ్లతో కూర్చుంటుంది. రెండు కాళ్లతో నిల్చుంటుంది. ఎవరది? కాలం |
నిత్యం ముందుకు వెళ్తుంది. .. వేగం పెంచమన్నా పెరగదు. తగ్గించమన్నా తగ్గదు. ఏమిటది? మడత కుర్చీ |
కాళ్లూ చేతులు లేవు కానీ ఎప్పుడూ నెత్తినెక్కి కూర్చుంటుంది. ఎవరు? టోపీ |
సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది? శంఖం |
ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు? ఉల్లి |
కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు? మురళి |
అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది. దీపం వత్తి |
రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు? తేలు |
రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది? ఎండ, వాన, చలి |
రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన? తాటి చెట్టు |
రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు? మంగలి |
కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి? సీతాకోక చిలుక |
రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది? ఉత్తరం |
మోదం కాని మోదం? ఆమోదం |
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? పాలు, పెరుగు, నెయ్యి |
రసం కాని రసం, ఏమి రసం? నీరసం |
ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం? తేనె పట్టు |
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ? లవంగ మొగ్గ |
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? తేనె పట్టు |
మూత తెరిస్తే, ముత్యాల పేరు? దంతాలు |
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే? దీపం |
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు? సూర్యుడు |
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు? పత్తి పువ్వు |
లాగి విడిస్తేనే బ్రతుకు? ఊపిరి |
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది? వేరుశెనగ కాయ |
జాన కాని జాన, ఏమి జాన? ఖజాన |
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? ఉల్లిపాయ |
ప్రాణం ఉన్నా నడవలేనిది. ఏమిటి? - గుడ్డు |
అల్లుడు వచ్చాడు. చొక్కా విప్పాడు. నూతిలో దూకాడు. ఏమిటది? - అరటి పండు |
ఊరంతా తిరిగినా గుమ్మంచూస్తే ఆగుతాయి. ఏమిటవి? - చెప్పులు |
పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషిని కాను, ఆకాశంలో ఉండగలను కానీ మేఘాన్ని కాను. ఎవరునేను? - చిలుక |
నీళ్లలో మునగదు. నిప్పులో కాలదు. కొట్టినా చావదు. ఏమిటది? - నీడ |
నీటి లో ఉంటె ఎగిసి పడతాను,నేలమీదికి రాగానే కూలబడతాను. - కెరటం |
గదినిండా రత్నాలు గదికి తాళం. ఏమిటది? - దానిమ్మ పండు |
ఎంత దానం చేసిన తరగనిది అంతకంతకు పెరిగేది. ఏమిటది? - విద్య |
వేయి కన్నులు గల దేవునికి చూపు లేదు. ఏమిటది? - మంచం |
వంకలు ఎన్ని ఉన్నా పరుగులు తీసేధి. ఏమిటది? - నది |
మొగము లేనిది బొట్టు పెట్టుకుంది . ఏమిటది? - గడప |
తెల్లని పొలంలో నల్లటి విత్తనాలు చేతిలో చల్లడం నోటితో ఏరుకోవడం. ఏమిటది? - పుస్తకం |
మూత తెరుస్తే ముత్యాల సరాలు - పళ్ళు |
ఎందరు ఎక్కిన విరగని మంచం. ఏమిటది? - అరుగు |
పిల్ల చిన్నదాన కట్టిన చీరలు ఎక్కువ - ఉల్లిపాయ |
పచ్చని బాబుకి రత్నాల ముగ్గులు - విస్తరాకు |
తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టెడు. - దూది |
చక్కని స్తంభం చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగ నుండు ఏంటది? - కొబ్బరి బొండం |
అడవిలో పుట్టాను ఎదురింట్లో అలిగాను వంటినిండా గాయాలు కడుపునిండా రాగాలు. - మురళి |
ఇంట్లో ముగ్గు బయట పువ్వు ఏంటది? - గొడుగు |
ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు. - వేరుశెనగ కాయ |
కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది. ఏమిటది? - గురువింద గింజ |
తొడిమ లేని పండు ఆకు లేని పంట ఏంటవి? - విభూది పండు, ఉప్పు |
ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఏంటది? - నిప్పు |
నల్లకుక్కకు నాలుగు చెవులు ఏంటది? - లవంగం |
ఆటకత్తె ఎప్పుడూ లోనే నాట్యం చేస్తుంది. ఏమిటది? - నాలుక |
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కడివెడు పాలిస్తుంది? - తాటిచెట్టు |
తోలు నలుపు, తింటే పులుపు - చింతపండు |
ఆకు చిటికెడు, కాయ మూరెడు - మునగకాయ |
అరచేతిలో లెక్కించలేని ఇళ్లు, వెళ్లే దారే కానీ, వచ్చే దారే లేదు? - జల్లెడ |
పాము లేదు కానీ పుట్ట ఉంది, తల లేదు కానీ గొడుగు వేసుకుంది? - పుట్టగొడుగు |
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊళ్లోకొచ్చి అరుస్తుంది. ఏమిటది? - శంఖం |
ముగ్గురన్నదమ్ములు, రాత్రింబవళ్లు నడస్తూనే ఉంటారు. ఎవరు వారు? - గడియారం లో ముల్లులు |
చూస్తే గజిబిజి... తింటే కరకర.. - జంతికలు |
కన్ను ఉన్నా తల లేనిది? - సూది |
కాళ్లు చేతులు ఉన్నా నడవలేనిది? - కుర్చీ |
ఒకటే తొట్టె రెండు పిల్లలు - వేరు శెనగ |
నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించే ఓడ - ఒంటె |
మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు. - శబ్దం |
తలపుల సందున మెరుపు గిన్నె - దీపం |
నల్లకుక్కకు నాలుగు చెవులు - లవంగం |
తల్లి దయ్యం ... పిల్ల పగడం - రేగు పండు |
అమ్మంటే దగ్గరగా వచ్చేవి... అయ్యంటే దూరంగా పోయేవి? - పెదవులు |
ఆవిడ వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఇంతకీ ఎవరావిడ? - ఆవులింత |
చీకటి లో వెలిగే చిరు దారి. (పాపిట) |
అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్ళు, వాటికి వెళ్లే దారికాని వచ్చే దారే లేదు. ( జల్లెడ) |
ఒకటే తొట్టె, రెండు పిల్లలు.( వేరు శెనగ) |
ఎర్రటి పండుపై ఈగైనా వాలదు. ( నిప్పు కణిక) |
గుట్టు చప్పుడు కాకుండా వస్తుంది. గడగడా త్రాగుతుంది.కళ్ళు మూసుకుని, తననెవ్వరు చూడలేదు అని అనుకునే అమాయకురాలు.(పిల్లి) |
కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. (ఉల్లిపాయ) |
నేను పుట్టినప్పుడు పచ్చగా ఉంటాను,పెరిగి ఎర్రగా మారతాయా, చివరికి నల్లగా ఉంటా.నాతొ కళ్ళని పోలుస్తారు. (నేరేడు పళ్ళు) |
తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు.అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. (మద్దెల) |
ఊరికి రెండు కళ్ళు, ఒకటి తెలుపుని చూస్తే, మరొకటి నలుపునే చూస్తుంది. (ఆకాశం (రాత్రి, పగలు)) |
చూస్తే చిన్నోడు, వాడి ఒంటినిండా నారబట్టలు. (టెంకాయ) |
అమ్మ కోసి ఇచ్చినప్పుడు ఎర్రగా ఉంది. తినటం పూర్తవగానే ఆకుపచ్చ రంగుకొచ్చింది. ఏమిటది?(పుచ్చకాయ) |
పొట్టలో వేలు, నెత్తి మీద రాయి( ఉంగరం) |
నన్ను వేసే వాళ్ళే గాని తీసేవాళ్ళు లేరు …నేను ఎవరిని?. (గోడకి సున్నం) |
తల లేదు కానీ రక్షణకు గొడుగు ఉంది. పాము లేదు కానీ పుట్ట ఉంది. (పుట్టగొడుగు) |
పోకంత పొట్టి బావ, కాగంత కడవ మోస్తాడు. (పొయ్యి) |
ఒక ఇంటిలో ఒక పిల్ల, ఆ ఇంటికి కిటికీలు, తలుపులు లేవు. విరగ్గొట్టుకునే బైటికి రావాలి. మళ్ళీ లోపలి పోలేదు. ఏమిటది? (కోడిగుడ్డు) |
నేను కరుస్తాను కానీ పళ్ళు లేవు. (చెప్పులు) |
నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికిగా ఉంటే, తెల్లగా అయిపోతా. (బ్లాక్ బోర్డు) |
అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినరు. (కంచం) |
మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు. (శబ్దం) |
నా నిండా రంధ్రాలు, అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను. ఎవరిని? ( స్పాంజి) |
నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు, ఎన్నో దారులున్నాయి కానీ ఏ వాహనము పోదు, ఎన్నో దేశాలున్నాయి కానీ భూమిని కాదు, మరి ఎవరిని? ( ప్రపంచ పటం (మ్యాప్)) |
పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషి ని కాను, ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేను ఎవరిని? (రామ చిలుక) |
కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను., తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. ఎవరిని? (బొగ్గు) |
నేను నడుస్తూనే ఉంటా..నన్ను ఎవరూ ఆపలేరు. (సమయం) |
వెలుతురూ ఉంటేనే కనిపిస్తాను, చీకటి పడితే మాయమౌతాను. (నీడ) |
నీటిలో ఉంటే ఎగసిపడతాను, నేలమీద మాత్రం కూలబడతాను. (కెరటం) |
నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే, లేచి కూర్చుంటా, ఎండినవైతే మరీ ఇష్టం, కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు. (అగ్ని) |
అది మనకి మాత్రమే సొంతమైనది. కానీ మన కన్నా ఇతరులే వాడుకుంటారు. (పేరు) |
ఊరంతా తిరిగి, మూలాన కూర్చునేది. (చెప్పులు) |
నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియ చేస్తా. ( మైకు) |
దాని పువ్వు పూజకు పనికిరాదు, దాని ఆకు డొప్పగా చేయటానికి సాయపడదు,కానీ దాన్ని అందరూ కోరతారు. (చింత పండు) |
హద్దు లేని పద్దు, అదుపు లేని ఎద్దు, ఎన్నడూ ఆడొద్దూసుమా!. ( అబద్దం) |
నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ!. (ఒంటె (ఎడారి ఓడ)) |
ఎంతెంతో వింత బండి, ఎగిరి ఎగిరి పోయేసుమండీ! మండుతూ మండుతూ మాయమయ్యెను. (రాకెట్ ) |
చిత్రమైన చీరకట్టి షికారుకెళ్ళిందో చిన్నది. పూసిన వారింటికే గాని, కాసిన వారింటికి పోనే పోదు. (సీతాకోక చిలుక) |
చూస్తే గజి బిజీ, తింటే కరకర. (జంతిక) |
తలకు తోకకు ఒకటే టోపీ (పెన్ను) |
చారెడు కుండలో మానెడు పగడాలు. (దానిమ్మ పండు) |
కన్ను ఉన్నా తలలేనిది. (సూది) |
కళ్లుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు. ( నవారు మంచం) |
ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు. (కాకర కాయ) |
సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద, అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. (అరటిపండు) |
తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు, కన్ను లెర్రగా ఉండు, రాకాసి కాదు, పాకి పోవు చుండు, పాము కాదు. (రైలు) |
తొడిమ లేని పండు, ఆకు లేని పంట. (విభూది పండు) |
నాదశ్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే ఆడేస్తుంది. (చిచ్చుబుడ్డి) |
చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైనా పాము. (పొట్లకాయ) |
అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది,వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. (మురళి) |
కిట కిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు మూసిన చప్పుడు కావు. (కంటి రెప్పలు) |
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. (కవ్వం) |
నేను నడుస్తూనే ఉంటా... నన్ను ఎవరూ ఆపలేరు? (కాలం) |
ఆకలేయదు, నీరు తాగదు, నేలపై పాకదు, ఏమిటి ఆ తీగ? (విద్యుత్ తీగ) |
మూట విప్పితే ముత్యాలు.... ఏమిటది? (దానిమ్మ పండు) |
అన్నీ వేసి చూడు, నన్నలా వేసి చూడు!ఏమిటది? (ఉప్పు) |
తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి, ఆడని బంతి...... ఏమిటది? (జాబిలి) |
మా తాత దొడ్డిలో మంచి ఎద్దుల మంద, ఎద్దులు పడుకుంటే పగ్గాలు మేస్తాయి.... ఏమిటది? (గుమ్మడిపాదు) |
నిగనిగలాడే నిర్మల వస్తువు, భుగభుగ మండే పరిమళ వస్తువు, నీటికి నానదు, గాలికి కరుగు, నిప్పుకు మండు.... ఏమిటది? (కర్పూరం) |
ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. (మద్దెల) |
వెనక్కి వెనక్కి పోతే గెలుపు. ముందు ముందు కొస్తే ఓటమి. (తాడులాగే ఆట(Tug of War)) |
చెట్టుకు కాయని కాయ ఎర్రఎర్రగా పెట్టే కాయ ఏడాదంతా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తిను కాయ. (ఆవకాయ) |
పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు. తియ్యని విందులు. (సీతాఫలం) |
పండుకు పన్నెండు తొనలు తొనకు ముప్పై పిక్కలు పదిహేను తెలుపు - పదిహేను నలుపు (కృష్ణ పక్షం, శుక్ల పక్షం) |
నోరులేని పిట్ట, తోకతో నీళ్లు తాగుతుంది. (వత్తి) |
నేలంతా నాకి మూలకేగి కూర్చుంటుంది. (చీపురు) |
నాలుగు రోళ్లు నడవంగ రెండు చేటలు చెఱగంగ అబకా ఒక్కటి ఆడంగ చక్కని దొరలు ఎక్కేరు! (ఏనుగు) |
నల్లని చేను మధ్యగా తెల్లని ఇరుకు బాట. (పాపిట) |
కాళ్ల కింద నలిగాను. చక్రంపై తిరిగాను. చేతుల్లో ఒదిగాను అగ్గిలో పడ్డాను. మనిషి ఇంటికెళ్లాను చెయ్యి జారితే పుట్టింటికే ఇక! (కుండ) |
గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారిని వడ్డించే బొమ్మ. (తేలు) |
కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు (కంటిరెప్పలు) |
సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ. (కొబ్బరి నీళ్లు) |
అందంగా కన్నుల విందుగా అప్పుడప్పుడు ఆకాశంలో దర్శనం ఇస్తుంది. ఎండావానల సయ్యాట ఇది!(ఇంద్రధనస్సు) |
పన్నెండు కొమ్మల మాను, కొమ్మకు ముప్పై ఆకులు (సంవత్సరం, నెలలు) |
ఏ రాయి వద్దన్నా, ఈ రాయి కావలసిందే (ఉప్పురాయి) |
ఊరంతటికీ ఒకటే దుప్పటి (ఆకాశం) |
సంపాదన ఒకరిదీ, అనుభవం ఒకరిదీ, ఇంట్లో కాదు, వంట్లోనే! (చేతులు, నోరు) |
పుట్టెడు గులక రాళ్ళల్లో ఒక మెరుపు రాయి(చుక్కల్లో చంద్రుడు) |
ఎండలో నడిచి ఇంటికి వచ్చి గడప అవతల ఇద్దర్నీ గడప మూల ఒక్కర్నీ కాపలా ఉంచి పడుకున్నాడు. (చెప్పులు, గొడుగు) |
అట్లు కాని అట్లు. పెద్దలు పెడతారు. పిల్లలు తింటారు. ఏమిటవి? (చీవాట్లు) |
నేను ఎక్కువయ్యే కొద్దీ మీ చూపు మందగిస్తుంది. నా పేరేంటి? (చీకటి) |
పైన పసుపు, లోన తెలుపు, మధ్యలో గులకరాళ్లు, పులుపు నీళ్ళు. నేనెవరో చెప్పగలరా? (నిమ్మకాయ) |
వీధి పక్కన ఎర్రచొక్కా అబ్బాయి. ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు. ఎవరికీ తోచింది వారు తినిపిస్తారు. ఎవరది? (పోస్ట్ బాక్స్) |
ఆకుపచ్చగా ఉంటాను. నన్ను తినరు కానీ నన్ను చంపి నల్లని నా పిల్లల్ని తింటారు. నేనెవర్ని?(యాలకలు) |
వింతాకాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది? (ఆవులింత) |
కాగితం కనిపిస్తే చాలు కన్నీరు కారుస్తుంది. ఏమిటది? (కలం) |
గొప్ప మాటకారి. గడపదాటి బైటికి రాదు గానీ మాట్లాడుతూనే ఉంటుంది? (నాలుక) |
వేలెడంత ఉంటుంది కానీ తోక మాత్రం బారెడు ఉంటుంది. ఏమిటది? (సూది - దారం) |
కాళ్లు నాలుగున్నా కదలలేదు చేతులు రెండున్నా ఏమీ చెయ్యలేదు. ఏమిటది? (కుర్చీ) |
చెయ్యని కుండ పొయ్యని నీళ్లు, పెట్టని పిలక. ఏమిటది? (టెంకాయ) |
'అమ్మా' అంటే దగ్గర కొచ్చేవి, 'నాన్నా' అంటే దూరంగా పోయేవి, ఏమిటవి? (పెదవులు) |
నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసి పోతుంది, ఎక్కడ అనుకున్నామో అక్కడ తాకి తీరుతుంది. ఏమిటది? (రాకెట్) |
నవ్విన నవ్వును, ఏడ్చిన ఏడ్చును కొట్టిన కొట్టును. ఏమిటది? (అద్దంలో బొమ్మ) |
ఎంత దూరం నెట్టితే అంత దగ్గరవుతుంది. గాలిలోనే తేలుతూ కదలాడుతుంటుంది. ఏమిటది? (ఊయల) |
దేహమెల్ల కనులు దేవేంద్రుడా కాడు నరుడె వాహనంబు నడువ లేదు తాను ప్రాణి కాదు తవిలి ప్రాణుల జంపు దీని భావమేమి తిరుమలేశ? (వల) |
నది ఒడ్డున అందాలొలికించే పాలరాతి బొమ్మ. ఏమిటది? (తాజ్ మహల్) |
వెయ్యిమందికి ఒకటే మొలతాడు. ఏమిటది? (చీపురు కట్ట) |
వేదంలో ఉంది పురాణంలో లేదు, మనస్సులో ఉంది ధనుస్సులో లేదు, మూడక్షరాల ఆ కవి పేరేమిటి? (వేమన) |
కాలం వస్తేనే గళం విప్పుతుంది. వెక్కిరిస్తే రెచ్చి పోతుంది. ఏమిటది? (కోకిల) |
సన్న తొడవు తొలగిస్తే కమ్మని వెన్నముద్ద, అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఏమిటది? (అరటి పండు) |
పచ్చని పెట్టెలో తెల్లని విరులు తెచ్చుకోబోతే గుచ్చుకుంటాయి. ఏమిటవి? (మొగలి పువ్వు) |
పోషణలో ఉంది కాని, దూషణలో లేదు. మడతలో ఉంది కాని, మడమలో లేదు. నడకలో ఉన్నా తడకలో లేదు. ఒక మహనీయ కవీశ్వరుని పేరు. ఎవరు వారు? (పోతన) |
పడుకోగానే వచ్చి పక్కలో జేరుతుంది. చెవిలో సంగీతం వినిపిస్తుంది, గిచ్చుతుంది అదిలిస్తే పారిపోతుంది. ఏమిటది? (దోమ) |
సరస్సులో తేలియాడు తెల్లని పుష్పం. కదలాడే స్వచ్ఛమైన పుష్పం కలువ కాదు, తెల్లని పద్మం కాదు. ఏమిటది? (హంస) |
ఒకటి పట్టి ఎత్తితే రెండు ఉయ్యాల లూగుతాయి. ఏమిటది? (త్రాసు) |
చీకట్లో ఎగురుతూ తిరుగుతుంది, పక్షి కాదు. ఆగి ఆగి మెరుస్తుంది నక్షత్రం అసలే కాదు. ఏమిటది?(మిణుగురు పురుగు) |
ఎనిమిదేనుగులున్న దర్బారు ఎదురులేక ఏలుకున్న దర్బారు. ఏమిటది?(కృష్ణదేవరాయల దర్బారు) |
మూరెడు పిట్టకు బారెడు తోక. ఎగిరి ఎగిరి ఎటో ఎటో పోతుంది. ఏమిటది? (గాలిపటం) |
మూడు కాళ్లతో ముందుకు వెళ్తుంది. కానీ వెనక్కు మాత్రం రాలేదు. ఏమిటో చెప్పండి? (కాలం) |
ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే? (ఆవులింత) |
జానెడు పొడుగుంటుంది. దాని పొట్టనిండా ముత్యాలే. ఎవరది? (బెండ) |
ఎనిమిది రెక్కల పువ్వు. కావాలంటే విచ్చుకుంటుంది, వద్దంటే ముడుచుకుని మొగ్గ అవుతుంది. ఏమిటది? (గొడుగు) |
పనిలో ఉన్నా కానీ పదిలో లేను ఋతువులో ఉన్నా కానీ క్రతువులో లేను తావులో ఉన్నా కానీ తారులో లేను అయితే ఇంతకీ నేను ఎవరిని? (పరువు) |
వరంలో ఉన్నా కానీ భారంలో లేను జారులో ఉన్నా కానీ జాములో లేను తాడులో ఉన్నా కానీ తారులో లేను అయితే ఇంతకీ నేను ఎవరిని? (వరుడు) |
అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది. ఏమిటది?(పుట్ట గొడుగు) |
అంగుళం ఆకు అడుగున్నర కాయ? (ములక్కాయ) |
ఆకాశంలో పాములు? ఏమిటవి?(పొట్లకాయలు) |
మంచం కింద మామయ్య ఊరికి పోదాం రావయ్యా? (చెప్పులు) |
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది! ఏమిటది? (తాటిచెట్టు) |
మీ అక్క తమ్ముడిని కాదు, కానీ మీ అందరికీ మేనమామనే! నేనెవరిని? (చందమామ) |
యంత్రం కాని యంత్రం ఏమిటి? (సాయంత్రం) |
సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు? ఏమిటది? (త్రాసు) |
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది? (తాటిచెట్టు) |
రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే గానీ లెక్కేసే వారే లేరు? (చుక్కలు) |
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు? (పిల్లనగ్రోవి) |
దాస్తే పిడికిలిలో దాగుతుంది....... తీస్తే ఇల్లంతా జారుతుంది? (దీపం వెలుగు) |
ఎందరు ఎక్కినా విరగని మంచం? (అరుగు) |
ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి? (దీపం) |
ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది. ఏమిటది? (చీపురు) |
తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగింది. (ఉత్తరం) |
తెల్లని పోలీసుకు నల్లని టోపీ (అగ్గిపుల్ల) |
పళ్లున్నా నోరు లేనిది? (రంపం) |
చిటపట చినుకులు, చిటారు చినుకులు, ఎంత రాలినా చప్పుడు కావు? (కన్నీళ్లు) |
నిలబడితే నిలుచుంటుంది, కూర్చుంటే కూలబడుతుంది. (నీడ) |
ముక్కు మీదకు ఎక్కుతుంది. ముందర చెవులు నొక్కుతుంది. సోకులు పోయే టక్కులాడి జారిందంటే ...... పుటుక్కుమంటుంది? (కళ్లజోడు) |
పిడికెడంత పిట్ట అరచి గోల పెడుతుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది? (సెల్ ఫోన్ ) |
అంగుళం గదిలో 60 మంది నివాసం. ఏమిటది?(అగ్గిపెట్టె) |
అంగుళం ఆకు, అడుగున్నర కాయ. ఏమిటది?(ములక్కాయ) |
అందరాని వస్త్రం పై అన్నీ వడియాలే. ఏమిటది?(నక్షత్రాలు) |
అందమైన అప్పన్న, మూతిలాగి నాకన్నా. ఏమిటది?(మామిడి పండు) |
అడుగులు ఉన్నా కాళ్లు లేనిది. ఏమిటది?(గజం బద్ద) |
అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. ఎవరు వారు?(సూర్యుడు, చంద్రుడు) |
అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది. ఏమిటది?(పుట్టగొడుగు) |
అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది. ఏమిటది?(ఈత గెల) |
అడవిలో అక్కమ్మ ఆసుబోసింది. ఏమిటది?(సాలీడు) |
అడవిలో పుట్టాను మేదరింట్లో మెలిగాను వంటినిండా గాయాలు కడుపునిండా రాగాలు. ఏమిటది?(మురళి) |
చెక్కని స్తంభం - చేతి కందదూ, చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు, చెయ్యని సున్నం - తియ్యని బెల్లం. ఏమిటది?(కొబ్బరి) |
చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ ఒకటే టోపీ చెప్పండీ, ఇది చెప్పండి(కలం) |
చూపు లేని కన్ను సుందరమౌ కన్ను, తోట లేని కన్ను తోక కన్ను, కన్ను గాని కన్ను కాలకంఠుని కన్ను. ఏమిటది?(నెమలి) |
చిటపట చినుకులు కురియంగా, సీతాదేవి పుట్టంగా, లంకాదీపం పెట్టంగా, రావణుని తల కొట్టంగా, చిలప చిలప నీళ్ళ లో సీతమ్మ జడలంట, భూమంటే నెల్లూరు కోటంట, కోటలో రాజు పెళ్ళాం కొలువంట. ఎవరు నేను?(అరటి) |
ఎనిమిది చేతుల ఏబ్రాసీ, ఎప్పుడు తిరిగే సోబ్రాసీ, వెన్నున జంజె వ్రేళ్ళాడు తీసిన కొద్దీ తెర్లాడు(రాట్నం) |
ఆకాశాన అరవై ఆరు కొడవళ్ళు? (జవాబు : చింతకాయలు) |
తలుపుల లోపల మెలికల పాము. ఏమిటది?(జవాబు :నాలుక) |
పొడవుగా పండే పంటను పొడిగా వాడతాం. ఏమిటది?(జవాబు :చెక్కెర) |
గుండ్రటి భవనంలో బోలెడన్ని తెరలు, తెరల చాటున ఎర్ర సిపాయిలు. ఎవరువారు?(జవాబు :దానిమ్మ పండు) |
బైటది పారేస్తాం లోపలది తింటాం. బైటది తింటాం, లోపలది పారేస్తా. ఏమిటది?(జవాబు :మొక్కజొన్న) |
1. ఆకాశంలో అరవై గదులు, గది గదికో సిపాయి. సిపాయికో తుపాకి? ఏమిటది? (జవాబు : తేనెతుట్టె) |
2. ఆకాశాన ఎగురుతుంది, పక్షి కాదు. మనషుల్ని ఎగరేసుకుపోతుంది, గాలి కాదు. ఏమిటది? (జవాబు : విమానం) |
3. ఆకాశాన పటం, కింద తోక? ఏమిటది? (జవాబు : గాలి పటం) |
4. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది. ఏమిటది? (జవాబు : దువ్వెన) |
5. ఆకు లేయదు, నీరు తాగదు, నేలను పాకదు. ఏమిటా తీగ? (కరెంటు తీగ) |
6. 'పోషణ' లో ఉంది, 'దూషణ' లోలేదు; 'మమత' లో ఉంది, 'మమకారం' లో లేదు; 'మన' లో ఉంది, 'మాట' లో లేదు. ఈ పొడుపు కథలోని కవి పేరు? (జవాబు : పోతన) |
చూసింది ఇద్దరు, కోసింది అయిదుగురు, తిన్నది 32 మంది ఏమిటది?(జవాబు : కళ్ళు, వేళ్లు, పళ్ళు) |
ఒక కన్ను కలది కాకి కాదు, ఒక కన్నం ఉంది పుట్ట కాదు, ఏమిటది?(జవాబు : సూది) |
అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు ఛాయ |
చెట్టుకి కట్టిన ఉట్టి, ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది?(ఊయల) |
పచ్చటి దుప్పటి కప్పుకొని తియ్యటి పండ్లు తింటుంది?(చిలుక) |
ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు, ముక్కుకి మాత్రమే దొరుకుతుంది. ఏమిటది ?(వాసన) |
పిఠాపురం చిన్నవాడా , పిట్టల వేటగాడా బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూర లేకుండా రానువద్దు, మరేం తెచ్చాడు?(కోడి గుడ్డు ) |
మూతి వేలెడు, తోక బారెడు? (సూది , దారం) |
ఆకాశాన వేలాడే వెన్నముద్దలు ?(వెలగ పండ్లు) |
ఆకు బారెడు తోక మూరెడు ?(మొగలి పువ్వు) |
ఆకు చిటికెడు కాయ మూరెడు?(మునగ కాయ) |
చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు?(అద్దం) |
అమారా దేశం నుంచి కొమారా పక్షి వచ్చింది. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది.(ప్రమిద) |
ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన(రామచిలుక) |
మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి) |
కోట గాని కోట ఇంటికో కోట? (తులసి కోట) |
కన్నులు ఎర్రగా ఉంటాయి , రాకాసి కాదు, తలనుండి పొగొస్తుంది,
భూతం కాదు
చరచర పాకుతుంది పాముకాదు ( రైలు ) |
కత్తులు లేని భీకర యుద్ధం , గెలుపూ ఓటమి చెరిసగం (చదరంగం) |
కతకత కంగు ,మాతాత పింగు, తోలు తీసి మింగు (అరటి పండు) |
పైనొక పలక , కిందొక పలక, పలకల నడుమ మెలికల పాము (నాలుక) |
అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను
,నీచే దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయినాను(పిడక) |
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది,మా ఇంటికొచ్చింది, మహలక్ష్మిలాగుంది.(గడప) |
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది,మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది.(చల్లకవ్వం) |
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, అన్నిపువ్వుల్లో రెండేకాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యుడు) |
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ,ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది?(శంఖం) |
ముగ్గురన్నదమ్ములు , రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరువారు?(గడియారం ముళ్ళు) |
అంకం నానదాలు
ReplyDeleteఎనిమిది చేతులు ఉంటాయి కానీ ఒక్కటి కాలు ఉంటుంది ఏమిటిది
ReplyDelete