Pages

ప్రాణిలోకంబు సంసార పతితమగుట - భర్త్రహరి సుభాషితం - 5

ప్రాణిలోకంబు సంసార పతితమగుట
వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె
వాని జన్మంబు సఫల మెవ్వానివలన
వంశ మధి కోన్నతి వహించి వన్నెకెక్కు.

భావం : చావు పుట్టుకలు అనునవి ఎప్పుడును ఉండు ఈ సంసార చక్రమున చచ్చి పుట్టని వాడే ఉండడు. పుట్టిన వారిలో నశింపనివాడు ఉండడు. ఎవని పుట్టుకల వలన వంశము గొప్పకీర్తి చేత ప్రసిద్ది చెందునో వాడే జన్మించినవాడు. వాని పుట్టుకే గణనీయమైనది అగును.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు