Pages

ఆలోచనలేని తెలివి - చిన్నారుల కథలు

ఆలోచనలేని తెలివి - చిన్నారుల కథలు 
క ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర విద్యలను నేర్చుకోవడానికి బయలు దేరారు. వారు ఒక గొప్ప యోగికి, సేవలు చేసి వారి అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు.
                                           నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జతచేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింప చేయగల విద్యను నేర్చుకున్నాడు. నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను నేర్చుకున్నాడు.
                                          నలుగురు నాలుగు దివ్యశక్తులను పొంది, గురువు గారి వద్ద సెలవు తీసుకొని వారి ఇంటి ముఖం పట్టారు. వూరు చేరడానికి అడవి దారి వెంట పోవలసివచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమైన ఆ ఆడవిలో నలుగురు కలసి ఒక చచ్చిన సింహం ని చూసారు. తమ శక్తులను ఉపయోగించి,  ఈ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. " ఇది క్రూర జంతువు,  దీన్ని బతికించితే అది మనలను చంపుతుంది. " అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు "మనం దీన్ని బతికించాము, కాబట్టి మనలను ఏమి చేయదు" అని పని ప్రారంభించారు. ఈ సింహమును బతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు, చచ్చిన సింహం ఎముకలను జోడించి, ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవాడు గాయాలను మానేలా చేసాడు. మూడోవ వాడికి వచ్చిన రక్త ప్రసరణను కలుగ చేసాడు. ఇప్పుడు నాలుగోవ వాడి వంతు వచ్చింది. వాడు తన విద్యని ఉపయోగించి ఆ సింహమునకు ప్రాణం పోసాడు. ఫలితముగా మరల ప్రాణం వచ్చిన ఆ సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారముగా భుజించింది. చెట్టు పైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు.
ఈ కథలోని నీతి తెలివి లేని బలం విద్యా అనర్థాలకు దారి తీస్తుంది. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు