Pages

Telugu Malika - దానపరోపకార గుణధన్యత

Telugu Malika - దానపరోపకార గుణధన్యత 
దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ 
లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్ 
పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం 
దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !

అర్థాలు : చిత్తము = మనస్సులో ; వివేకశూన్యుడు = తెలివిలేనివాడు ; లేములు = బీదతనం ; 
             పూనిన = వచ్చిన ,  లభించిన; చీకునకు = గుడ్డివానికి

భావం : దానం, పరోపకారం అనే గుణాలు మనస్సులో లేని అవివేకికి పేదరికం వచ్చినా, సంపదలు కలిగినా ఒకే లాగ ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్థరాత్రి అయినా , పట్టపగలైనా ఒకటే కదా !(మార్పేమి ఉండదని భావం ) 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు