Pages

నరసింహ శతకం - శ్రీ మనోహర !

సీ॥ శ్రీ మనోహర ! సురా - ర్చిత ! సింధుగంభీర!
             భక్తవత్సల ! కోటి - భానుతేజ ! 
       కంజనేత్ర ! హిరణ్య - కశ్యపాంతక శూర !
             సాధురక్షణ ! శంఖ - చక్రహస్త!
     ప్రహ్లాదవరద ! పా - పధ్వంస ! సర్వేశ !
            క్షీరసాగరశయన ! - కృష్ణవర్ణ !
     పక్షివాహన ! నీల - భ్రమరకుంతలజాల !
           పల్లవారుణ పాద - పద్మ యుగాళ !

తే॥ చారు శ్రీ చందనాగురు - చర్చితాంగ !
      కుందకుట్మలదంత ! వై - కుంఠ ధామ !
      భూషణవికాస !  శ్రీధర్మ - పుర నివాస !
     దుష్ట సంహార ! నరసింహ ! - దురిత దూర !

తాత్పర్యం॥ ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి, దుష్టులను సంహరిచువాడవు నగు ఓ నరసింహస్వామి !
                                నీవు శ్రీదేవి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు. భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు. పద్మముల వంటి కన్నులున్నవాడవు. చేతులందు   శంఖచక్రములు కలవాడవు. హిరణ్యకశివుని జంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడవు. పాల సముద్రమున పవళించువాడవు. నల్లని కేశపాశములు కలవాడవు. చిగురాకుల వంటి ఎర్రని పాదపద్మ ద్వయము కలవాడవు. మంచి గంధము మొదలగు సువాసనద్రవ్యములు శరీరమునను పూయబడిన వాడవు. మల్లెమొగ్గల వంటి పలువరుస గలవాడవు. వైకుంఠము నందుడు వాడవు. (ఆగు నమస్కారము)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు