Pages

కవులు - పరిచయం

ఏనుగు లక్ష్మణకవి 
కాలం : 18 వ శతాబ్దం
రచనలు : సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్ర, రామేశ్వర మహత్యము
వేమన 
కాలం : 17వ శతాబ్దం 
రచనలు : వేమన పద్యాలు 
బద్దెన
కాలం : 13 వ శతాబ్దం 
రచనలు : సుమతీ శతకం 
తిక్కన సోమయాజి 
కాలం : 13 వ శతాబ్దం
రచనలు : నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం(విరాట పర్వం నుంచి స్వర్గారోహణ
               పర్వం వరకు 15 పర్వాలు)
బిరుదులు : కవిబ్రహ్మ, ఉభయకవిమిత్రుడు 
మధురాంతకం రాజారాం :
కాలం : 1930 - 1999
జన్మస్థలం : చిత్తూరు జిల్లాలోని మొగరాల గ్రామం
రచనలు : కమ్మతెమ్మెర, వక్రగతులు - ఇతర కథలు, రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం,
              జీవితానికో నిర్వచనం, కూనలమ్మ కోన.  వీరి రచనలు రష్యన్, తమిళ, కన్నడ,
              ఆంగ్ల, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి.
పురస్కారాలు : బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి
                      ప్రతిభా పురస్కారం, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు, కేంద్ర సాహిత్య
                      అకాడమీ అవార్డు, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్. 
శ్రీనాథుడు : 14 - 15 వ శతాబ్దం నకు చెందినవారు. రెడ్డి రాజుల ఆస్థానకవి. ఇతనికి "కవిసార్వభౌముడు" అని బిరుదు కలదు. ఇతని ప్రసిద్ధ కృతులు "శృంగార నైషధము, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము" మొదలగునవి. దేశ సంచారము చేసి అనేక రాజుల దర్శించి కనకాభిషేకాది సత్కారములు పొందెను. ఇతని చాటు పద్యములు అసంఖ్యాకములు, బహురస వంతములు. బమ్మెర పోతన ఇతనికి బావమరిది. 
రంగనాథుడు : 13 వ శతాబ్దం నకు చెందినవారు.రామాయణమును ద్విపదలో రచించెను. ఈ గ్రంథము సులభశైలి లో వ్రాయబడి మిక్కిలి ప్రచారము గలదై యున్నది. 
దేవులపల్లి కృష్ణశాస్త్రి:
కాలం : 1897 - 1980
జన్మస్థలం : తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గరి చంద్రంపాలెం.
రచనలు : కృష్ణపక్షం, ఊర్వశి, సాహిత్యవ్యాసాలు, సినీగేయాలు
బిరుదు: కళాప్రపూర్ణ, పద్మభూషణ్
భాస్కరుడు : 12 - 13 వ శతాబ్దం నకు చెందినవారు.తిక్కన తాతయగు ఇతడు రామాయణమును వ్రాసెను. ఇది తర్వాత కొంత భాగము శిథిలమగుటచే హుళక్కి భాస్కరాదులు పూర్తి చేసిరి. దీనినే "భాస్కర రామాయణము" అందురు. 
వేములవాడ భీమకవి : 12 వ శతాబ్దం నకు చెందినవారు. ఇతడు తిట్టుకవి. "భీమన చంధ"మను ప్రసిద్ధి గల కవిజనాశ్రయము నీతడు రచించెను. 
పాల్కురికి సోమన : 12 - 13 వ శతాబ్దం నకు చెందినవారు. వీరశైవమతమును ప్రచారము చేసిన కవి. ఆంధ్ర,  కర్ణాటక దేశములలో ప్రసిద్ధి చెందినవారు. "బసవ పురాణము", "పండితారాధ్య చరిత్ర" యను ద్విపద  కావ్యము లితని రచనలలో గొప్పవి.   

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు