Pages

జాతీయ గీతం - ఆకాశంనిండా స్వాతంత్ర్యపు జెండా!

జాతీయ గీతం - ఆకాశంనిండా స్వాతంత్ర్యపు జెండా!

ఎత్తండీ ! ఎత్తరేం ? స్వాతంత్ర్యపు జెండా !
ఎత్తవోయ్ ! ఎత్తు, ఎత్తు ఆకాశంనిండా !

కే లూపుచు, తల ఊపుచు గాలిదారు లంట
మన జెండా, మనదే, వీరుల నెత్తురు పంట !
కొత్త వేడి, కొత్త వాడి భరతావని నిండ
ఎత్తవేం ? ఎత్తు, ఎత్తు ఆకాశంనిండా !
ఎత్తండీ ! ఎత్తరేం ? స్వాతంత్ర్యపు జెండా !

అర్థమత్తు, లహంకృతులు, అంధమతులు రాని
నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరంకుశులు లేని
కొత్త జగం, కొత్త యుగం భరతావని నిండ
ఎత్తమంటే ! ఎత్తు, ఎత్తు ఆకాశంనిండా !
ఎత్తరేం ? ఎత్తండీ, స్వాతంత్ర్యపు జెండా !

కులం దాటి, మతం దాటి, కొద్ది గొప్ప దాటి
సమభోగం, సమభాగ్యం సమసంస్మృతి నాటి
కొత్త శాంతి, కొత్త కాంతి భరతావని నిండ
ఎత్తండోయ్ ! ఎత్తు, ఎత్తు ఆకాశంనిండా !
ఎత్తండీ ! ఎత్తరేం ? స్వాతంత్ర్యపు జెండా !
                                                                                      - దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి 



0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు