Pages

పద్యం - భావం

 పద్యం - భావం 

ఎడపక దుర్జనుండొరుల కెంతయు గీడొనరించును గాని యే 
యెడలను మేలు సేయడొక యించుకయైనను; జీడపుర్వు తా 
జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంచనేర్చునే 
పొడవగుచున్న పుష్ప ఫలభూరుహ మొక్కటినైన భాస్కరా!
భావం : చెడు స్వభావం కలిగినవారు ఇతరులకు చెడు చేస్తారే గానీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ మాత్రం మంచి చేయరు. ఇటువంటివారి ప్రవర్తన చీడపురుగును పోలి ఉంటుంది. చీడపురుగు చెట్టుకు పుడిసెడు నీరైనా పోయకపోగా.. పూలు, పండ్లతో నిండుగా ఉంటూ.. చక్కగా పెరుగుతున్న చెట్లను పాడుచేస్తుంది.



0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు