Pages

Balala Geyalu - Rain

వాన 
వెళ్లిందీ ఎండాకాలం 
భగభగ మంటలు మండే కాలం 
వచ్చిందీ వానాకాలం 
వర్షాలూ కురిసే కాలం 

చిటపట చిటపట చినుకులు కురియా 
బొటబొట బొటబొట ధారలు కారా 
చూరుల వెంబడి ధారలు కారా 
బాలుర కెంతో ఆనందం                   // వెళ్లిందీ//

జలజల పారే నీటికాలువలో 
పడవల గట్టి వదలంగా 
చరచర చరచర పడవలు నడువా 
అరయుట కెంతో ఆనందం                  // వెళ్లిందీ//

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు