బహుళైశ్చిక ప్రశ్నలు # 2
1. పలికి బొంకని వాళ్ళే ఉత్తములు - గీత గీసిన పదానికి అర్థం
1. పలికి బొంకని వాళ్ళే ఉత్తములు - గీత గీసిన పదానికి అర్థం
ఎ) చేయని బి) చేయకుండని సి) అబద్ధమాడని డి) మాయని (సి)
2. బీజం నాటందే మొక్క మొలవదు - గీత గీసిన పదానికి అర్థం
ఎ) నారు బి) కొమ్మ సి) గింజ డి) రైతు (సి)
3. సంపన్నులు బంగారు చట్టువంతో పాలు తాగిస్తారు. "చట్టువం" అంటే
ఎ) గిన్నె బి) గరిటె సి) పాత్ర డి) బిందె (బి)
4. "తండ్లాట" అనే మాటకు అర్థం
ఎ) బాధపడుట బి) ఆటాడు సి) కదలాడు డి) నిలుచు (ఎ)
5. "జలం" అనే మాటకు సమానార్థకమైన పదాలు
ఎ) జలజం, జలదం బి) అంబుధి, అమృతం
సి) అంబుమ, సలిలం డి) వర్షం, సంవత్సరం (సి)
6. "తరువు, మహీరుహం" - అనే పర్యాయపదాలున్న మాట
ఎ) చెట్టు బి) కొండ సి) చెరువు డి) చెలిమి (ఎ)
7. "సదనం" అనే మాటకు పర్యాయపదాలు కలిగిన వాక్యం
ఎ) మీ ఆశ్రయంలో ఆశ్రయం కల్పించండి
బి) మేముండే నిలయం ఆనందాన్ని అందించే గృహం
సి) బృందావనంలో మామిడితోట బాగుంది
డి) మీ ఆనందం మాకు సంతోషం (బి)
8. "యాది" అనే అర్థాన్నిచ్చే పదాలు
ఎ) గుర్తు, సంజ్ఞ బి) గుట్ట, గుట్టు సి) జ్ఞాపకం, స్మృతి డి) తెలివి, గతం (సి)
9. "విష్ణువు" - అనే పదానికి వికృతి
ఎ) జిష్ణువు బి) వెన్నుడు సి) కృష్ణుడు డి) కన్నడు (బి)
10. "సంద్రం" అనే పదానికి ప్రకృతి
ఎ) సాగరం బి) సముద్రం సి) జలధి డి) సాంతం (బి)
11. "మా చెల్లి మాట రతనాల మూట! అందుకే ఆమె మా ఇంటి రత్నాల రాశి." ఈ వాక్యంలోని ప్రకృతి - వికృతికి సంబంధించిన పదాలను గుర్తించండి.
ఎ) చెల్లి, రతనాల బి) రత్నాల, రతనాల సి) మాట, మూట డి) మా చెల్లి, మా ఇంటి (బి)
12. "శిఖ, పొత్తం, రాత్రి, యోధులు, సిగ, పుస్తకం" - ఈ పదాల్లోని ప్రకృతి పదాలు
ఎ) శిఖ, రాత్రి, పుస్తకం, సిగ బి) రాత్రి, సిగ, శిఖ, పొత్తం
సి) శిఖ, రాత్రి, పుస్తకం, యోధులు డి) సిగ, రాత్రి, పుస్తకం, యోధులు (సి)
13. "భీముడు" అనే పదానికి నానార్ధాలు
ఎ) ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు బి) అర్జునుడు, కృష్ణుడు
సి) భీష్ముడు, విదురుడు డి) కృష్ణుడు, సుదాముడు (ఎ)
14. పందెం, - వెల అనే నానార్థాలున్న పదం
ఎ) ధర బి) పణం సి) వ్రణం డి) ఘనం (బి)
15. "భాషించునది" అనే వ్యుత్పత్తి గల్గిన పదం
ఎ) మాట బి) చిలుక సి) భాష డి) చర్చ (సి)
16. "నీరజభవుడు" - అనే పదానికి వ్యుత్పత్తి
ఎ) నీటి నుండి పుట్టినవాడు బి) సూర్యుని నుండి పుట్టినవాడు
సి) బ్రహ్మ వలన పుట్టినవాడు డి) కమలము నందు పుట్టినవాడు (డి)
0 comments:
Post a Comment