పదజాలం
(అ) కింది పదాల్ని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
1. ధారవోయు : పెళ్ళిలో వధూవరుల కాళ్లు కడుగుటకు నీటిని ధారగా పోస్తారు.
2. గొంతు కలుపు : ప్రధాన గాయకుడు పాడుతుంటే మిగతావాళ్లు అనుసరిస్తూ గొంతు కలుపుతారు.
(ఆ) కింది వాటికి సరైన సమాధానాన్ని గుర్తించండి.
1. శృతి హేమ ఘటములో పాయసం తెచ్చింది. గీత గీసిన పదానికి అర్థం.
ఎ) రాగి బి) అల్యూమినియం సి) బంగారం డి) ఇత్తడి (సి)
2. 'మరాళము' పదానికి అర్థం?
ఎ) కొంగ బి) పక్షి సి) కాకి డి) హంస (డి)
3. నాయకులు ప్రజల క్షేమం కోరుకుంటారు. గీత గీసిన పదానికి సమానార్థక పదం?
ఎ) హితం బి) మతం సి) గతం డి) వ్రతం (ఎ)
4. మహమ్మదీయులు మసీదులో నమాజు చేస్తారు. గీత గీసిన పదానికి అర్థం?
ఎ) పఠనం బి) ప్రార్థన సి) పాట డి) కోరస్ (బి)
5. 'వటుడు' పదానికి పర్యాయపదంలు
ఎ) వరుడు, పెళ్లికూతురు బి) పెళ్లికుమారుడు, బ్రహ్మచారి
సి) బ్రహ్మచారి, పెళ్లికానివాడు డి) బ్రహ్మచారి, పెళ్లైనవాడు (సి)
6. తఖీమీర్ ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడు. గీత గీసిన పదానికి సమానార్థక పదాలు
ఎ) చిన్నవాడు, బలహీనుడు బి) మంచివాడు, పేరు పొందినవాడు
సి) బీదవాడు, చురుకైనవాడు డి) గొప్పవాడు, పేరు పొందినవాడు (డి)
7. తిరుపతి ప్రసిద్ధమైన పుణ్య క్షేత్రము. గీత గీసిన పదానికి నానార్ధాలు
ఎ) భార్య, వరిమడి బి) గుడి, భార్య
సి) దేవాలయం, భార్య డి) ఆలి, క్షేత్రము (ఎ)
8. ఉపాధ్యాయుడు, బృహస్పతి నానార్ధాలు గల పదం
ఎ) ఉపాధ్యాయుడు బి) విష్ణువు సి) బ్రహ్మ డి) గురువు (డి)
9. చట్టమునకు ప్రకృతి పదం.
ఎ) నియమం బి) చుట్టము సి) న్యాయం డి) శాస్త్రం (బి)
10. కీర్తికి వికృతి పదం.
ఎ) కీర్తన బి) కీరితి సి) గొప్ప డి) హారతి (బి)
11. భృగు వంశమున పుట్టినవాఁడు వ్యుత్పత్త్యర్థం గల పదం.
ఎ) బ్రహ్మ బి) బలి సి) భార్గవుడు డి) వ్యాసుడు (సి)
12. 'భాష' కు సరైన వ్యుత్పత్త్యర్థం.
ఎ) మాట్లాడేది బి) భాషించునది సి) వినేది డి) చెప్పేది (బి)
0 comments:
Post a Comment