Pages

Showing posts with label grammar. Show all posts
Showing posts with label grammar. Show all posts

తెలుగు వ్యాకరణం - ఉచ్చారణము - దంత్యములు - తాలవ్యములు

తెలుగు వ్యాకరణం - ఉచ్చారణము  - దంత్యములు - తాలవ్యములు  

ప్రశ్న :- ఉత్పత్తిస్థానమును బట్టి వర్ణములు ఎన్ని విధములుగా విభజింప బడినవి? అవి ఏవి? 

సమాధానము : ఉత్పత్తి స్థానమును బట్టి వర్ణములు తొమ్మిది విధములుగా విభజింపబడినవి. 

అవి 1. కంఠ్యములు 2. తాలవ్యములు 3. మూర్ధన్యములు 

        4. దంత్యములు 5. ఓష్ఠ్యములు 6. నాసిక్యములు 

        7. కంఠతాలవ్యములు 8.కంఠోష్ఠ్యములు 9. దంతోష్ఠ్యములు.

 ప్రశ్న :- కంఠ్యములనగానేమి?

సమాధానము : కంఠము నుండి పుట్టిన వర్ణములను కంఠ్యములందురు. 

అవి: - అ - ఆ - క - ఖ - గ - ఘ - ఙ - హ - ః. 

 ప్రశ్న :- తాలవ్యములనగానేమి?

సమాధానము : తాలువు (దౌడ) ల నుండి పుట్టిన వర్ణములను తాలవ్యము

లందురు. 

అవి : ఇ - ఈ - చ - ఛ - ఙ - ఝ - ఞ - య - శ. 

ప్రశ్న :- మూర్ధన్యములనగానేమి?

సమాధానము : మూర్ధము (నోటిపై భాగం) నుండి పుట్టిన వర్ణములను

మూర్ధన్యములందురు. 

అవి: - ఋ - ౠ - ట - ఠ - డ - ఢ - ణ - ర - ఱ - ల - ళ - ష 

 ప్రశ్న :- దంత్యములనగానేమి?

సమాధానము : దంతములనుండి పుట్టిన వర్ణములను దంత్యములందురు.

అవి:  త - థ - ద - ధ-న - ల - స - ౘ - ౙ. 

ప్రశ్న :- ఓష్ఠ్యములనగానేమి?

సమాధానము : ఓష్ఠ్యము (పెదవి) ల నుండి పుట్టిన వర్ణములను ఓష్ఠ్యము 

లందురు. 

అవి:  ఉ - ఊ - ప - ఫ - బ - భ - మ. 

ప్రశ్న :- నాసిక్యములనగానేమి?

సమాధానము : నాసిక (ముక్కు) నుండి పుట్టిన వర్ణములను నాసిక్యము లందురు. 

అవి:  ఙ - ఞ - ణ - న - మ - ౦ - ఁ - ః

ప్రశ్న :- కంఠతాలవ్యములనగానేమి? 

సమాధానము : కంఠము - తాలువుల నుండి పుట్టిన వర్ణములను కంఠతాలవ్యము లందురు. 

అవి:  ఎ - ఏ - ఐ 

ప్రశ్న :- కంఠోష్ఠ్యములనగానేమి?

సమాధానము : కంఠము -  పెదవుల నుండి పుట్టిన వర్ణములను కంఠోష్ఠ్యములందురు. 

అవి: ఒ - ఓ - ఔ

 ప్రశ్న :- దంతోష్ఠ్యమనగానేమి? 

సమాధానము : దంతము - పెదవుల నుండి పుట్టిన వర్ణమును 'దంతోష్ఠ్యము' అందురు. 

అది: 'ప'. 

              దంత్యములు - తాలవ్యములు 

 ప్రశ్న :- చ, జ లు ఎన్ని విధములు? అవి ఏవి?

సమాధానము : చ - జలు రెండు విధములు. 

అవి: 1. దంత్యములు  2. తాలవ్యములు. 

 ప్రశ్న :- దంత్య చ -  జ లనగా నేమి? వాటిని ఎట్లు పలుకుదురు?

ఎట్లు వ్రాయుదురు? 

సమాధానము : (1) అ - ఆ - ఉ - ఊ - ఒ - ఓ - ఔ లతో గూడిన చ - జ లను దంత్యములందురు. 

(2) వీనిని పలుకునప్పుడు నాలుక కొన ముందరి పండ్ల యొక్క వెనుక

భాగమును తాకవలయును. 

(3) వ్రాతయందు వీనికి తలపైన '౨'  ఈ గుర్తు నుంచెదరు.

ఉదా : చలి - చాప - చుక్క- చూపు

చొక్క- చోటు - చౌక

 జత - జాతర - జున్ను- జూలు

 జొన్న- జోల - జౌకు మున్నగునవి.

(శిష్ట వ్యావహారిక భాషలో "౨" ఈ గుర్తు ఉంచకపోయినను ప్రమాదము  లేదు. గ్రాంధిక భాష వ్రాయునప్పుడు ఈ గుర్తునుంచవలయును.)

ప్రశ్న :- తాలవ్యము చ - జ లనగానేమి? వాటినెట్లు పలుకవలయును?

సమాధానము : 1. ఇ - ఈ - ఎ - ఏ లతో కూడియున్న చ - జలను తాలవ్యములందురు. 

2. వీనిని పలుకునప్పుడు నాలుక కొన తాలువును స్పృశింపవలయును.

ముందరి పండ్లకు పైభాగమున నున్న మెత్తని భాగమును తాలువు అందురు.

3. వీనిని వ్రాయునపుడు వీనికి తలపైన ''౨"  గుర్తు నుంచరు.

ఉదా : చిలుక - చీమ - చెలువ - చేమ - జిలుగు - జీడి- జెఱ్ఱి - జేజే మున్నగునవి. 

 ప్రశ్న :-చ - జలలోని విభేదమును తెలిసికొనుట వలన ప్రయోజనమేమి?

సమాధానము : చ - జ లలోని విభేదమును తెలిసికొనుట వలన వాటి ఉచ్చారణ సక్రమముగా నుండును.

తెలుగు వ్యాకరణం - పద్యాలు - భేదాలు

తెలుగు వ్యాకరణం  - పద్యాలు - భేదాలు 
పద్యాలు - భేదాలు 
వృత్తాలు: అక్షర గణాలతో ఏర్పడే పద్యాలు. 
ఉదా: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం మొదలైనవి.
వృత్తపద్యాలు గణాలు పాదాలు అక్షరాల సంఖ్య యతి స్థానం ప్రాసనియమం 
ఉత్పలమాల భ - ర - న - భ - భ - ర - వ    42010ఉంది 
చంపకమాలన - జ - భ - జ - జ - జ - ర 42111ఉంది 
శార్దూలంమ -స - జ - స - త - త - గ    41913ఉంది 
మత్తేభంస - భ - ర - న - మ - య - వ                       42014ఉంది 

జాతి పద్యాలు : ఇవి మాత్రాగణాలతో ఏర్పడతాయి. వీటిలో సూర్య గణాలు(ఇవి 2 : న గణం - lll గలం - Ul) ఇంద్ర గణాలు(ఇవి 6: నల - నగ - సల - భ - ర - త) ఉంటాయి. ప్రాసనియమం  ఉంటుంది. 
ఉదా: కందం, ద్విపద, తరువోజ మొదలైనవి.
జాతి పద్యం గణాలు పాదాలు యతి స్థానం ప్రాస నియమం విశేషాలు 
కందం గగ - భ - జ - స - నల 44 వ గణం మొదటి అక్షరం ఉంది1. బేసి గణంలో జ గణం ఉండకూడదు.
2. 6 వ గణం నలం / జ గణం ఉండాలి.
3. 2 - 4 పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి. 
ద్విపద 3 ఇంద్ర గణాలు + 1 సూర్య గణం 23వ  గణం  తొలి అక్షరంఉంది-
తరువోజ 3 ఇంద్ర గణాలు + 1 సూర్య గణం + 3 ఇంద్ర + 1 సూర్య గణాలు 41-3-5-7 గణాల తొలి అక్షరాలు ఉంది-

ఉపజాతులు : ఇవి కూడా మాత్రాగణాలతో ఏర్పడతాయి. ప్రాసనియమం పాటించవు. యతికి బదులు ప్రాసయతి పాటిస్తాయి. ఉదా: ఆటవెలది, తేటగీతి, సీసం
ఉపజాతి పద్యం గణాలు పాదాలు యతిస్థానం ప్రాసనియమం 
ఆటవెలది 3 సూర్య గణాలు + 2 ఇంద్ర గణాలు + 5 సూర్య గణాలు
ఇనగణత్రయంబునింద్రద్వయంబు హంసపంచకంబు ఆటవెలది 
41 - 4 గణాల మొదటి అక్షరాలు లేదు 
తేటగీతి 1 సూర్య గణం  + 2 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు41 - 4 గణాల మొదటి అక్షరాలు లేదు
సీసం 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు 41-3-5-7 గణాల మొదటి అక్షరాలు లేదు

10th Class Telugu Grammar Study Material

పదజాలం 
(అ) కింది పదాల్ని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
1. ధారవోయు : పెళ్ళిలో వధూవరుల కాళ్లు కడుగుటకు నీటిని ధారగా పోస్తారు. 

2. గొంతు కలుపు : ప్రధాన గాయకుడు పాడుతుంటే మిగతావాళ్లు అనుసరిస్తూ గొంతు కలుపుతారు. 

(ఆ) కింది వాటికి సరైన సమాధానాన్ని గుర్తించండి. 
1. శృతి హేమ ఘటములో పాయసం తెచ్చింది. గీత గీసిన పదానికి అర్థం. 
ఎ) రాగి               బి) అల్యూమినియం            సి) బంగారం             డి) ఇత్తడి                 (సి)

2. 'మరాళము' పదానికి అర్థం?
ఎ) కొంగ           బి) పక్షి          సి) కాకి            డి) హంస               (డి)

3. నాయకులు ప్రజల క్షేమం  కోరుకుంటారు. గీత గీసిన పదానికి సమానార్థక పదం?
ఎ) హితం          బి) మతం          సి) గతం            డి) వ్రతం                (ఎ)

4. మహమ్మదీయులు మసీదులో నమాజు చేస్తారు. గీత గీసిన పదానికి అర్థం?
ఎ) పఠనం          బి) ప్రార్థన            సి) పాట           డి) కోరస్                 (బి)

5. 'వటుడు' పదానికి పర్యాయపదంలు 
ఎ) వరుడు, పెళ్లికూతురు              బి) పెళ్లికుమారుడు, బ్రహ్మచారి 
సి) బ్రహ్మచారి, పెళ్లికానివాడు         డి) బ్రహ్మచారి, పెళ్లైనవాడు                 (సి)

6. తఖీమీర్ ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడు. గీత గీసిన పదానికి సమానార్థక పదాలు 
ఎ) చిన్నవాడు, బలహీనుడు                 బి) మంచివాడు, పేరు పొందినవాడు 
సి) బీదవాడు, చురుకైనవాడు                డి) గొప్పవాడు, పేరు పొందినవాడు       (డి)

7. తిరుపతి ప్రసిద్ధమైన పుణ్య క్షేత్రము. గీత గీసిన పదానికి నానార్ధాలు 
ఎ) భార్య, వరిమడి                     బి) గుడి, భార్య 
సి) దేవాలయం, భార్య                 డి) ఆలి, క్షేత్రము                    (ఎ)

8. ఉపాధ్యాయుడు, బృహస్పతి    నానార్ధాలు గల పదం 
ఎ) ఉపాధ్యాయుడు          బి) విష్ణువు           సి) బ్రహ్మ           డి) గురువు           (డి)

9. చట్టమునకు ప్రకృతి పదం. 
ఎ) నియమం        బి) చుట్టము            సి) న్యాయం          డి) శాస్త్రం           (బి)

10. కీర్తికి వికృతి పదం. 
ఎ) కీర్తన             బి) కీరితి          సి) గొప్ప            డి) హారతి                  (బి)

11. భృగు వంశమున పుట్టినవాఁడు వ్యుత్పత్త్యర్థం గల పదం. 
ఎ) బ్రహ్మ           బి) బలి              సి) భార్గవుడు             డి) వ్యాసుడు             (సి)

12. 'భాష' కు సరైన  వ్యుత్పత్త్యర్థం. 
ఎ) మాట్లాడేది          బి) భాషించునది          సి) వినేది           డి) చెప్పేది        (బి)

సరళా దేశ సంధి

సరళా దేశ సంధి 
సూత్రము : 
1. ద్రుతప్రకృతికము మీద పరుషములకు సరళములు వచ్చును. 
2. ఆదేశ సరళములకు ముందున్న దృతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు 
ఉదాహరణలు ;
కడువంబెట్టు = కడువన్ + బెట్టు చక్కజేయున్ = చక్కన్ +  చేయును                       
నిన్ను జూపి = నిన్నున్ + చూపి             ధృతింబూని = ధృతిన్ + పూని 
చక్కబడు = చక్కన్ + పడు చేయంజాలడో = చేయన్ + చాలడో 
శాంతిఁ బొందుట = శాంతిన్ + పొందుట ఒప్పు జుమీ = ఒప్పున్ + చుమీ 
అర్థిబొంది = ఆర్థిన్ + పొంది 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు