బహుళైశ్చిక ప్రశ్నలు - పర్యాయ పదాలు - 10వతరగతి
కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించి, వాటి సంకేతాన్ని రాయండి.
1. బ్రహ్మచారి కమండలం, గొడుగు ధరించాడు.
అ) వరుడు, వటుడు ఆ) వర్ణి , మాణవకుడు
ఇ) పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఈ) వరుణుడు, ఇంద్రుడు (ఆ)
2. మీ కులములో నీ వంటి వాడు లేడు.
అ) వంశం, జాతి ఆ) గోత్రం, ఇల్లు ఇ) వంశం, గ్రామం ఈ) వంశం, నగరం (అ)
3. నీ కర్ణములకు కుండలాలు ఉన్నాయి.
అ) చెవి, శ్రోత్రం ఆ) చెవి, కన్ను ఇ) చెవి, మెడ ఈ) చెవి, ముక్కు (అ)
4. బ్రహ్మ ప్రజలను సృష్టిస్తాడు.
అ) విష్ణువు, శివుడు ఆ) నీరజభవుడు, దాత
ఇ) బ్రహ్మ, బ్రాహ్మణుడు ఈ) బ్రహ్మ, ఇంద్రుడు (ఆ)
5. హాలికులు నేడు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అ) రైతు, కృషీవలుడు ఆ)రైతు, బ్రహ్మచారి
ఇ) రైతు, ఇనుడు ఈ) రైతు, కార్మికుడు (అ)
6. ఈ ధరణీ మండలంలో వర్షాలు లేవు
అ) ధాత్రి, భూమి ఆ) భూమి, స్వర్గం ఇ) నరకం, భూమి ఈ)భూమి, అరణ్యం (అ )
7. మీ తమ్ముడు వామనుడు, అయినా గొప్పవాడు.
అ) విష్ణువు, శివుడు ఆ) పొట్టివాడు, కుబ్జుడు
ఇ) వామనుడు, కుజుడు ఈ) బ్రహ్మ, రుద్రుడు (ఆ)
8. సమరములు లేని దేశంలో ప్రజలు ఆనందంగా ఉంటారు.
అ) కరువు, క్షామం ఆ) కలహం, తగవు
ఇ) రణము, యుద్ధము ఈ) ఆయుధము, యుద్ధము (ఇ )
9. జీవనదులు సైతం జలకళ తగ్గి, చెరువులను తలపిస్తున్నాయి.
అ) ఇసుక, మట్టి ఆ) నీరు, ఉదకము ఇ)సముద్రము, నది ఈ)నాచు, పద్మము (ఆ )
10. మహారాజు గారి యశస్సు దశదిశలా వ్యాపించింది.
అ) పేరు, గొప్ప ఆ) ప్రఖ్యాతి, వైభవం
ఇ) దానం, ధర్మం ఈ) కీర్తి, ఖ్యాతి (ఈ)
11. జలధి అనేక జీవరాశులకు నిలయం
అ) సముద్రం, నది ఆ) సముద్రం, సాగరం
ఇ) పయోధి, సరస్సు ఈ) వారధి, తటాకం (ఈ)
12. నీ చరణములకు పసుపు రాస్తారు
అ) పాదము, అంఘ్రి ఆ) అడుగు, కాలు
ఇ) పదము, పద్మము ఈ) ఆంజ, ఆజ్ఞ (అ)
13. లోచనము, నేత్రము - అనే పర్యాయపదాలు గల పదము
అ) శ్రవణము ఆ) ముఖము ఇ) అక్షి ఈ) వదనము (ఇ)
14. 'మరాళము'అనే పదానికి సమానార్థక పదాలు
అ) నెమలి, నీలకంఠము ఆ) హంస, అంచ
ఇ) మొసలి, మకరి ఈ) ఏనుగు, కరి (ఆ)
15. ఈశ్వరుడు, ముక్కంటి - అనే పర్యాయపదాలు గల పదము
అ) రవి ఆ) ధాత ఇ) హరుడు ఈ) హరి (ఇ)
16. పుడమి, ధరణి - అనే సమానార్థక పదాలు
అ) భూమి ఆ) జిహ్వ ఇ) నేత్రము ఈ) అంబరము (అ)
17. "యజ్ఞము" అనే మాటకు సమానార్థక పదాలు
అ) చక్రాంగము, నేత్రము ఆ) రసన, ఆశ
ఇ) క్రతువు, యాగము ఈ) ఇష్టి, ధాత (ఇ)
18. నీరజభవుడు, చతుర్ముఖుడు - అనే సమానార్థక పదాలు
అ) బ్రహ్మ ఆ) హరి ఇ) హరుడు ఈ) రవి (అ)
19. ధాత్రి, ధరణి - అనే సమానార్థక పదాలు
అ) పుడమి ఆ) అంబరము ఇ) ఆకాశము ఈ) అంతరాళము (అ)
0 comments:
Post a Comment