Pages

బహుళైశ్చిక ప్రశ్నలు - నానార్థాలు - 10వతరగతి

   బహుళైశ్చిక ప్రశ్నలు - నానార్థాలు  - 10వతరగతి 

కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరియైన నానార్థాలు గుర్తించి, వాటి సంకేతాన్ని రాయండి.  

1. కులములో అందరూ యోగ్యులు ఉండరు. 

అ) వంశము, శరీరము          ఆ) వంశము, గోత్రము 

 ఇ) వంశము, నేల           ఈ) వంశము, కాలము                 (అ )

2. లక్ష్మీదేవికి భర్త హరి. 

అ) విష్ణువు, శివుడు         ఆ) విష్ణువు, సింహం     

ఇ) విష్ణువు, బ్రహ్మ      ఈ) విష్ణువు, సముద్రం                (ఆ)

3. క్షేత్రములో మంచి పంటలు పండుతాయి. 

అ) భూమి, నేల              ఆ) భూమి, పుణ్యస్థానం     

 ఇ) భూమి, జలము     ఈ) భూమి, గుడి               (ఆ)

4. సిరి సంపదలు కలవాడు పుణ్యాత్ముడు. 

అ) సంపద, లక్ష్మి               ఆ) సరస్వతి, లక్ష్మి             

ఇ) పార్వతి, లక్ష్మి      ఈ) శచి, సరస్వతి                  (అ)

5. రాజులు రాజ్యాన్ని పాలిస్తారు.  

అ) ప్రభువు, పాలకుడు       ఆ) చంద్రుడు, ప్రభువు

ఇ) ప్రభువు, దేవుడు             ఈ) ప్రభువు, విష్ణువు                  (ఆ )

6. సూర్యుడు మంచి తేజము కలవాడు. 

అ) ప్రకాశము, పరాక్రమము       ఆ) ప్రకాశము,  కాంతి    

 ఇ) ప్రకాశము, వెలుగు    ఈ)ప్రకాశము,  తేజము                  (అ)

7. ధర్మాన్ని మనము రక్షిస్తే ధర్మము మనల్ని రక్షిస్తుంది. 

అ) పుణ్యము, విల్లు             ఆ) న్యాయము, రక్షణ            

ఇ) పుణ్యము, మంచి     ఈ) పుణ్యము, హింస                  (అ)

8. "చిత్రము"   అనే పదానికి నానార్థాలు 

అ) విచిత్రము, అలంకారం             ఆ) చిత్తరువు, అద్భుతరసం              

ఇ) ఆశ్చర్యం, అచ్చెరువు     ఈ) గొడుగు, చిత్తరువు                (ఆ)

9. విష్ణువు, ఇంద్రుడు - అనే నానార్థాలు  గల పదము 

అ) హరుడు     ఆ) ధాత     ఇ) హరి     ఈ) ఇంద్రుడు        (ఇ )

10. "గురువు" అనే పదానికి నానార్థాలు

అ) బోధకుడు, అధిపతి               ఆ) ఉపాధ్యాయుడు, బృహస్పతి             

ఇ) తండ్రి, ఇంద్రుడు              ఈ) గురుడు, అధ్యాపకుడు                (ఆ)

11. "పుణ్యము, విల్లు, యజ్ఞము" - అనే పదానికి నానార్థాలు

అ) ధర్మము              ఆ) సత్యము 

ఇ) న్యాయము               ఈ) క్రతువు               (అ )

12. "అర్థము" - అనే పదానికి నానార్థాలు

అ) సగము, శబ్దార్థము               ఆ) ధనము, శబ్దార్థము          

ఇ) కార్యము, ప్రయోజనం                ఈ) యాచన, భోగము               (ఆ)

13. "బంగారు, ఉమ్మెత్త, మంచు " -   మొదలైన నానార్థాలు  గల పదము 

అ) సువర్ణము               ఆ) కుటజము        ఇ) హిమము         ఈ) హేమము              (ఈ)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు