Pages

Objective Type Multiple Choice Questions in Telugu (బహుళైశ్చిక ప్రశ్నలు # 4)

పురాణ, ఇతిహాస, కావ్యపరిజ్ఞానం పెంపొందించే ప్రశ్నలు # 4

1. తిరుమలేశుని దర్శనానికి ముందు ఏ దేవుణ్ణి దర్శించాలి?

అ) వాసుదేవుడు    ఆ) వామనుడు    ఇ) వరాహస్వామి    ఈ) వెంకటేశ్వర స్వామి (ఇ)


2. సతీసావిత్రి భర్త?

అ) సత్యవ్రతుడు     ఆ) సత్యవంతుడు     ఇ) సత్యకీర్తి     ఈ) సత్యమూర్తి  (ఆ)


3. శకుంతల పెంపుడు తండ్రి?

అ) కణ్వమహర్షి    ఆ) మృకండ మహర్షి     ఇ) భృగు మహర్షి    ఈ) అత్రి మహర్షి (అ)


4. శ్రీవారి 'ముత్యాలహారతి' ఎవరు ప్రారంభించారు?

అ) అన్నమయ్య     ఆ) పెదతిరుమలయ్య     

ఇ) తాళ్లపాక తిమ్మక్క     ఈ) తిరిగొండవెంగమాంబ  (ఈ)


5. ఆంధ్రభోజుడు ఎవరు?

అ) మహాకవి కాళిదాసు     ఆ) శ్రీకృష్ణదేవరాయలు 

ఇ) భోజరాజు                    ఈ) త్యాగరాజు  (ఆ)


6. శ్రీపద్మావతీ అమ్మవారు వెలసిన క్షేత్రం?

అ) శ్రీనివాసమంగాపురం     ఆ) అలిమేలుమంగాపురం 

 ఇ) నారాయణవనం     ఈ) నాగులాపురం  (ఆ)


7. మహాభారతములో పర్వాలు ఎన్ని?

అ) పదకొండు     ఆ) పన్నెండు     ఇ) పద్దెనిమిది     ఈ) ఇరవైఎనిమిది  (ఇ)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు