Pages

బహుళైశ్చిక ప్రశ్నలు - సంధులు - 10వతరగతి

    బహుళైశ్చిక ప్రశ్నలు - సంధులు   - 10వతరగతి 

1. 'గర్వోన్నతి' అనే పదాన్ని విడదీస్తే 

అ) గర్వ + ఓన్నతి           ఆ) గర్వ + ఉన్నతి  

 ఇ) గర్వు +  ఉన్నతి            ఈ) గర్వము + ఉన్నతి                   (ఆ)

2. 'అణ్వాయుధాలు' అనే సంధి పదాన్ని విడదీస్తే 

అ) అణు + వాయుధాలు          ఆ) అణు + ఆయుధాలు 

ఇ) అణ్వ + ఆయుధాలు      ఈ) అణువ + ఆయుధాలు               (ఆ)

3. 'అత్యద్భుతము' లో గల సంధి. 

అ) సవర్ణదీర్ఘసంధి     ఆ) వృద్ధి సంధి  ఇ) యణాదేశ సంధి      ఈ) యడాగమ సంధి        (ఇ)

4. 'అభి + ఆగతులు' - ఈ సంధి కలిపితే 

అ) అభ్యాగతులు   ఆ) అభీఆగతులు ఇ) అభాగతులు       ఈ) అభ్యంగతులు                   (అ)

5. 'వదాన్యోత్తముడు' - విడదీసి, సంధి రాస్తే 

అ) వదా + న్యోత్తముడు (అత్వ సంధి)       ఆ) వదాన్య + ఉత్తముడు (గుణసంధి)

ఇ) వదాన్యో + త్తముడు (వృద్ధి సంధి)        ఈ) వదాన్య + ఓత్తముడు                   (ఆ )

6. సవర్ణదీర్ఘసంధికి ఉదాహరణ  

అ) దానవేంద్రుడు        ఆ) అభ్యాగతుడు    ఇ) ఇష్టార్థములు     ఈ)కాళ్ళు గడుగు     (ఇ)

7. 'నలినాక్షుడు' - విడదీసి, సంధి రాస్తే 

అ) నలినా + క్షుడు (అత్వసంధి)            ఆ) నలిన + అక్షుడు (సవర్ణదీర్ఘసంధి)          

ఇ) నలిన + ఆక్షుడు (సవర్ణదీర్ఘసంధి)      ఈ) నలినా +  అక్షుడు (వృద్ధి సంధి)                 (ఆ)

8. 'మాణవకోత్తమ' పదంలో గల సంధి 

అ) అత్వసంధి       ఆ) గుణసంధి ఇ) వృద్ధి సంధి     ఈ) సవర్ణదీర్ఘసంధి                (ఆ)

9. వారు + ఏరీ - దీంట్లో పూర్వ పర స్వరాలు వరుసగా  

అ) ఉ + ఏ      ఆ) ఏ + ఉ     ఇ) రు + ఏ      ఈ) వా + రీ         (అ)

10. 'అచ్చోటు' విడదీసి, సంధి రాస్తే 

అ) ఆ + చ్చోటు (త్రికసంధి)                ఆ) ఆ + చోటు (త్రికసంధి)             

ఇ) అ  + చ్చోటు (త్రికసంధి)             ఈ) ఆ + చోటు (అత్వసంధి)               (ఆ)

11. 'ఇవ్విధము' లో గల సంధి 

అ) ప్రాతాధి సంధి      ఆ) గసడదవాదేశ సంధి   ఇ) త్రికసంధి      ఈ) ఇత్వ సంధి    (ఇ)

12. 'అనుటెట్లు' - విడదీసి, సంధి రాస్తే 

అ) అనుట + ఎట్లు (అత్వసంధి)              ఆ) అను + టెట్లు (ఉత్వ సంధి)       

ఇ) అనుట + ఇట్లు (ఇత్వ సంధి)               ఈ) అనుటె +  ఎట్లు (విత్వ సంధి)              (అ)

13. 'ధారవోసె'  - విడదీసి, సంధి రాస్తే

అ) ధార +  వోసె (యణాదేశ సంధి)             ఆ) ధార +  పోసె (గసడదవాదేశ సంధి)        

ఇ) ధార +  వోసె (అత్వసంధి)          ఈ) ధారవు  + ఓసె (ఉత్వ సంధి)             (ఆ)

14. 'బ్రహ్మాండము' అనే పదాన్ని విడదీసి, సంధి రాస్తే

అ) బ్రహ్మ + అండము (సవర్ణదీర్ఘసంధి)              ఆ) బ్రహ్మా + అండము (అత్వసంధి)         

ఇ) బ్రహ్మాం + డము (అనునాసిక సంధి)         ఈ) బ్రహ్మ + అండము (గుణసంధి)              (అ)

15. 'కుల + ఆచార్యుడు' కలిపి, సంధి పేరు రాయండి. 

అ) కులాచార్యుడు (గుణసంధి)                ఆ)  కులాచార్యుడు (సవర్ణదీర్ఘసంధి)       

ఇ) కులోచార్యుడు (గుణసంధి)        ఈ) కులపు ఆచార్యుడు (పుంప్వా దేశ సంధి)              (ఆ)

16. 'ఇక్కాలము' దీనిలో గల సంధి  

అ) సవర్ణదీర్ఘసంధి               ఆ) త్రికసంధి        ఇ) గుణసంధి         ఈ) ఇత్వ సంధి              (ఆ)

17. 'వేయి + ఏటికిన్' కలిపి  సంధి పేరు రాస్తే

అ) వేయేటికిన్ (ఇత్వ సంధి)              ఆ) వేయీటికిన్ (సవర్ణదీర్ఘసంధి)        

ఇ) వెయ్యేటికిన్ (విత్వ సంధి)         ఈ) వెయ్యేటికిన్ (ఇత్వ సంధి)             (అ)

18. 'దానవ + ఇంద్రుడు' కలిపి  సంధి పేరు రాస్తే

అ) దానవాంద్రుడు (సవర్ణదీర్ఘసంధి)                ఆ) దానవేంద్రుడు (గుణసంధి)        

ఇ) దానవాంధ్రుడు (అత్వసంధి)         ఈ) దానవేందుడు (ఉత్వ సంధి)               (ఆ)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు