Pages

బహుళైశ్చిక ప్రశ్నలు - అలంకారాలు మరియు ఛందస్సు - 10వతరగతి

     బహుళైశ్చిక ప్రశ్నలు - అలంకారాలు  మరియు ఛందస్సు   - 10వతరగతి 

అలంకారాలు:

1. 'బళి బళి యని పొగడె భూత పంచక మనఘా' - అనే వాక్యంలో ఉన్న అలంకారం 

అ) ఛేకానుప్రాస            ఆ) లాటానుప్రాస  ఇ) వృత్త్యనుప్రాస    ఈ) యమకము         (ఇ)

2. 'బ్రతుక వచ్చు గాక! బహుబంధనములైన 

వచ్చు గాక, లేమి వచ్చుగాక 

జీవధనములైన చెడుగాక ! ఏడుగాక" - ఈ పాదాలలోని   అలంకారం 

అ) అంత్యానుప్రాస   ఆ) యమకము  ఇ) వృత్త్యనుప్రాస    ఈ)  లాటానుప్రాస        (అ)

3. 'ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు చేకుఱు భంగిన్ 

    దాత కీవియుఁ  బాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే' 

అ) రూపకాలంకారము    ఆ) ఉపమాలంకారము   ఇ) శ్లేష     ఈ)  అతిశయోక్తి         (ఆ)

ఛందస్సు 

1. 'విప్రాయ ప్రకట వ్రతాయ భవతే  విష్ణు స్వరూపాయ, అనే పద్య పాదంలో గీత గీసిన పదం ఏ గణం?

అ) 'భ' గణము   ఆ) 'ర' గణము   ఇ) 'స' గణము     ఈ) 'న' గణము              (ఇ)

2. శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా 

అ) నజభజజజర    ఆ) సభరనమయవ    ఇ) మసజసతతగ     ఈ) భరనభభరవ     (ఇ)

3. 'కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం' - అనే పద్యపాదం, ఏ వృత్తానికి చెందింది?

అ) మత్తేభము    ఆ) శార్దూలము    ఇ) తరలము      ఈ) ఉత్పలమాల               (అ)

4. తేటగీతి పద్యపాదంలో యతిస్థానము 

అ) 3వ గణాద్యక్షరం    ఆ) 4వ గణాద్యక్షరం   ఇ) 5వ గణాద్యక్షరం     ఈ) 13వ అక్షరం     (ఆ)

5. 14వ అక్షరము యతిస్థానము గల వృత్త్యపద్యం ఏది?

అ) తేటగీతి    ఆ) శార్దూలము   ఇ) ఆటవెలది      ఈ) మత్తేభము               (ఈ)

6. 'ఈరే కోర్కులు వారలన్ మరచిరేయిక్కాలమున్ భార్గవా' అనే పద్యపాదం, ఏ వృత్తానికి చెందింది?

అ) మత్తేభము   ఆ) శార్దూలము   ఇ) చంపకమాల      ఈ) ఉత్పలమాల              (ఆ)

7. ప్రాసనియమం గల పద్యం 

అ) కందము    ఆ) ఆటవెలది   ఇ) తేటగీతి     ఈ) సీసము               (అ)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు