Pages

Showing posts with label Quiz. Show all posts
Showing posts with label Quiz. Show all posts

పోటీపరీక్షల ప్రత్యేకం - లింగములు, విభక్తులు, విరామ చిహ్నాలు

పోటీపరీక్షల ప్రత్యేకం - లింగములు, విభక్తులు, విరామ చిహ్నాలు 

1. దార నపుంసక లింగ శబ్దమైనా అర్థ ప్రాధాన్యాన్ని అనుసరించి ఏ లింగం?

ఎ) నపుంసక లింగం  బి) పుం లింగం  సి) స్త్రీ లింగం డి) ఏదీకాదు    (సి)

2. 'ఘటమందు జలమున్నది' - ఈ వాక్యం లోని విభక్తి ?

ఎ) చతుర్థీ  బి) తృతీయా  సి) ప్రథమ  డి) సప్తమా        (డి)

3. తెలుగుభాషలో లింగములు ఎన్ని ?

ఎ) మూడు  బి) నాలుగు   సి) రెండు డి) ఆరు    (ఎ)

4. ఈ క్రింది వాటిలో పురుషార్థ బోధకశబ్దమైనా నంపుసక లింగం ఏది?

ఎ) దార  బి)సర్వతము  సి) మిత్రుడు   డి) వృక్షము      (సి)

5. లింగ ప్రాధాన్యం తెలుగు భాషలో దేన్ని అనుసరించి నిర్ణయిస్తారు?

ఎ) శబ్ద ప్రాధాన్యం  బి) అర్థ ప్రాధాన్యం  సి) శబ్దార్థ ప్రాధాన్యం  డి) ఏదీకాదు   (బి)

6. 'ధీరుడు' ఏ లింగానికి సంబంధించింది? |

ఎ) స్త్రీ లింగం బి) పుంలింగం  సి) నపుంసక లింగం డి) ఏదీకాదు    (బి)

7. సంస్కృత  భాషలో లింగ ప్రాధాన్యం దేన్ని అనుసరించి నిర్ణయిస్తారు?

ఎ) అర్థ ప్రాధాన్యం  బి) శబ్దార్థ ప్రాధాన్యం  సి) శబ్ద ప్రాధాన్యం  డి) ఏదికాదు   (సి)

8. 'పర్వతము' నపుంసకార్డమైనా శబ్దాన్ని అనుసరించేది ఏ లింగం?

ఎ) స్త్రీ లింగం  బి) నపుంసక లింగం  సి) పుం లింగం  డి) ఏదీకాదు    (సి)

9. విభక్తులకు గల మరోపేరు?

ఎ) ప్రత్యయాలు  బి) ఉప విభక్తులు  సి) కారకాలు  డి) నామ వాచకాలు       (సి)

10. ఈ క్రింది వాటిలో విధేయ విశేషణం ఏది?

ఎ) గోవు   బి) రాముడు  సి) ధన్యము  డి) అతడు       (సి)

11. ప్రథమా విభక్తి దేనికి చివర చేరుతుంది?

ఎ) సర్వనామం  బి) నామ వాచకం  సి) విధేయ విశేషణం  డి) పైవన్నీ     (డి)

12. విభక్తులు ఎన్ని?

ఎ) ఏడు  బి) ఎనిమిది  సి) ఆరు  డి) తొమ్మిది     (బి)

13. విభక్తులు దేనితో అన్వయం కలిగిస్తాయి? 

ఎ) కర్త  బి) క్రియ  సి) కర్మ  డి) విశేషణం      (బి)

14. కర్తర్థ్రక వాక్యంలో వచ్చే ప్రత్యయం ఏది? 

ఎ) తోడు  బి) చేత  సి) కొఱకు డి) వలన        (బి)

15. కర్మ పదం జడ వాచకమైతే దాని చివర ఏ విభక్తి చేరుతుంది? 

ఎ) తృతీయ  బి) ప్రథమా  సి) షష్ఠి  డి) చతుర్థి          (బి)

16. ఏ అర్థంలో 'తోడు' పత్యయం చేరుతుంది?

ఎ) భావార్థం  బి) కారణార్థం  సి) సహర్థం  డి) త్యాగార్థం     (సి)

17. సంప్రదానం లో వచ్చే విభక్తి ప్రత్యయం ఏది?

ఎ) ద్వితీయ  బి) ప్రథమా  సి) చతుర్థి  డి) పంచమా        (సి)

18. నిన్,నున్, కూర్చి, గురించి ఏ విభక్తి ప్రత్యయాలు ?

ఎ) ప్రథమా  బి) తృతీయ  సి) ద్వితీయ  డి) చతుర్థి     (సి)

19. పూర్వము, ఉత్తరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినపుడు ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది?

 ఎ) కొఱకు  బి) వలన  సి) కంటే  డి) పట్టి              (సి)

 20. భయ, అపాయ, పరాజయ, జుగుప్సార్థా ల్లో వచ్చే విభక్తి ప్రత్యయం ఏది? 

ఎ) కంటే  బి) వలన  సి) కొఱకు డి) యొక్క            (బి)

21. తెలుగుభాష లో విరామ చిహ్నాలు ఏ భాషా ప్రభావం వల్ల వచ్చాయి?

ఎ) ఫ్రెంచి  బి) ఇంగ్లీష్  సి) హిందీ  డి) లాటిన్      (బి)

22. సంబంధాన్ని తెలిపే సందర్భంలో చేరే విభక్తి ప్రత్యయం ఏది? 

ఎ) అందు  బి) యొక్క  సి) చేత  డి) కొఱకు            (బి)

23. ఈ క్రింది వాటిలో ఔప విభక్తులేవి? 

25. లోపల ప్రత్యయం ఏ సందర్భంలో చేరుతుంది?

ఎ) ఇ - టి - ఉ  బి) ఇ - తి - మ  సి ) ఇ - టి - తె  డి) ఇ - ఉ - అ          (సి)

24. వాక్యంలో ఏదైనా మాటలోపించిన చోట మొదటగాని, చివరగాని సూచించే గుర్తు ఏది? 

ఎ) . బి );  సి) ....  డి) !       (సి)

ఎ) వస్తువులను కలిపే సందర్భం  బి) కాలాన్ని సూచించేపుడు  సి) వస్తువులను వేరు చేసే సందర్భం డి) సంబంధాన్ని తెలిపే సందర్భం       (సి)

25. వాక్యంలో పదాన్నిగాని, అక్షరాన్ని గాని ప్రత్యేకంచి సూచించే గుర్తు 

ఎ) వాక్యాంత బిందువు   బి) కింద గీత   సి) పొట్టి గీత  డి) జంట నిలువు గీతలు         (బి)

 26. ఉదాహరణను సూచించే గుర్తు? 

ఎ) -  బి) :  సి)||  డి) ;          (బి)

27. (II) అనే గుర్తుకు గల పేరు?

 ఎ) రాగ చిహ్నం  బి) ఇబిడ్  సి) జంట నిలువుగీతలు  డి) కొటేషన్       (బి)

28. ఈ క్రింది వాటిలో వాక్యాంత బిందువు ఏది?

ఎ) కామా  బి) సెమికొలన్  సి) ఫుల్ స్టాప్  డి) కోలన్ డాష్    (సి)

29. పాత్రల మాటలను సూచించే గుర్తును ఏమంటారు?

ఎ) కుండలీకరణం  బి) నక్షత్ర చిహ్నం  

సి) జంట ఉల్లేఖన చిహ్నలు  డి) బంధన చిహ్నం         (సి)

30. జంట నిలువు గీతలు (II) ఎక్కడ ఉపయోగిస్తారు?

ఎ) వాక్యం కింద పట్టిక ఇచ్చేపుడు  బి) ఉదాహరణ సూచించే గుర్తు  

సి) పదాన్ని సంక్షిప్తంగా రాసి చివర చేర్చే గుర్తు డి) పదాన్ని ప్రత్యేకంగా చూపించేపుడు        (సి)

 31. '1' రాగ చిహ్నందేన్ని సూచిస్తుంది?

ఎ) ఉదాహరణను  బి) విరామాన్ని  సి) సదరు చిహ్నం  డి) ఆశ్చర్యాన్ని          (డి)

 32. ముఖ్యమైంది అని సూచించే గుర్తు

ఎ) బంధన చిహ్నం  బి) నక్షత్ర చిహ్నం  

సి) ఒంటి ఉల్లేఖన చిహ్నం  డి) అనంకరణ చిహ్నం        (బి) 

Quiz

గత పరీక్షల ముఖ్యమైన ప్రశ్నలు - ప్రకృతి - వికృతిలు, వ్యతిరేక పదాలు

 గత పరీక్షల ముఖ్యమైన ప్రశ్నలు - ప్రకృతి - వికృతిలు, వ్యతిరేక పదాలు

1. వికృతులు అంటే?

ఎ) తత్సమాలు  బి) తద్భవాలు   సి) ప్రాకృతాలు  డి) గ్రామ్యాలు    (సి)

2. భాషా పరంగా ప్రకృతులు అంటే?

ఎ) తద్భవాలు  బి) సంస్కృత పదాలు  సి) ప్రాకృతాలు  డి) దేశ్యాలు    (బి)

3. 'ఓగికము' పదానికి ప్రకృతి ఏది?

ఎ) అన్నము  బి) భోజనము  సి) భుక్తి  డి) ఆహారం        (డి)

4. చంద్రుడు పదానికి వికృతి ఏది?

ఎ) చందమామ  బి) సెందురుడు  సి) చందురుడు  డి) సూర్యుడు        (సి)

5. 'యోధు' డు పదానికి వికృతి ఏది? 

ఎ) వీరుడు  బి) జోదు  సి) జోదుడు  డి) యోద్ధ        (బి)

6. సంద్రము పదానికి ప్రకృతి ఏది?

ఎ) సాగరము  బి) వారధి  సి) జలనిధి   డి) సముద్రం         (డి)

7. పద్యము పదానికి వికృతి ఏది?

ఎ) పజ్జెము   బి) పద్దెము   సి) పద్దియము   డి) పథ్యము            (సి)

8. నెయ్యము పదానికి ప్రకృతి?

ఎ) నేస్తము   బి) స్నేహము   సి) మైత్రి  డి) మిత్రుడు     (బి)

9. 'గమ్యము' పదానికి వ్యతిరేక పదం ఏది?

ఎ) గమనం   బి) ఆగమనం  సి) ఆగమం  డి) ఆగమ్యం         (డి) 

10. 'విజయము' పదానికి వ్యతిరేక పదం ఏది?

ఎ) జయం  బి) గెలుపు   సి) అపజయం  డి) అవిజయం         (సి)

11. కంఠము పదానికి వికృతి ఏది?

ఎ) మెడ  బి) గొంతు  సి) స్వరము  డి) కరము           (బి)

12. సుమతి పదానికి వ్యతిరేక పదం ఏది?

ఎ) దుర్మతి బి) వ సుమతి  సి) అ సుమతి  డి) కుమతి           (డి)

13. 'విద్దియ ' పదానికి ప్రకృతి ఏది?

ఎ) విజ్జె  బి) విద్య  సి) విధ్య   డి) విజ్జే          (బి)

14. 'దానవులు' పదానికి వ్యతిరేక పదం ఏది?

ఎ) రాక్షసులు  బి) మానవులు  సి) గంధర్వులు  డి) కిన్నేరులు        (బి)

15. నాగరికతకు వ్యతిరేక పదం ఏది?

ఎ) నగరీకరణం  బి) అ నాగరికత  సి) సు నాగరికత (డి) కు నాగరికత          (బి)

పర్యాయపదాలు, నానార్ధాలు, పొడుపుకథలు కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

పర్యాయపదాలు, నానార్ధాలు, పొడుపుకథలు కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు  

1. "అంబోధి" పదానికి అర్థం?

  1) సరస్సు    2) కొలను    3) సముద్రం     4) చెరువు   (3)

2. ‘అహరహం’ అంటే అర్థం?

  1) రాత్రి     2) పగలు    3) సాయంత్రం    4) ప్రతిదినం  (4)

3. ‘ఈప్సితం’ అంటే అర్థం?

  1) జుగుప్స     2) అసహ్యం    3) కోరిక      4) బీభత్సం  (3)

4. ‘ఉద్వృత్తి’ అంటే అర్థం?

  1) ఆపద      2) గర్వం     3) ఉపవృత్తి      4) భిక్షాటనం   (2)

5. జతపరచండి.

  పదం:

  a) ఖలుడు      b) హాలికుడు    c) కులిశం     d) కూర్మం

  అర్థం

  i) రైతు      ii) నీచుడు     iii) తాబేలు      iv) వజ్రాయుధం

  1) a-i, b-iii, c-ii, d-iv

  2) a-ii, b-i, c-iv, d-iii

  3) a-i, b-ii, c-iii, d-iv

  4) a-i, b-ii, c-iv, d-iii   (2)

6. ఒక పదానికి ఒకే అర్థం వచ్చే వివిధ పదాలను ఏమంటారు?

  1) నానార్థాలు      2) పర్యాయ పదాలు     3) వ్యుత్పత్త్యర్థాలు      4) జాతీయాలు     (2)

7. 'అంబోధి' పదానికి పర్యాయ పదం ఏది?

  1) సముద్రం      2) కడలి     3) సాగరం     4) పైవన్నీ    (4)

 8.'భేకం, దర్దురం, మండూకం' పర్యాయ పదాలున్న పదం?

  1) మకరం    2) భ్రమరం      3) కప్ప       4) చేప     (3)

9. ‘ఖగం’ పదానికి పర్యాయ పదం ఏది?

  1) పక్షి      2) విహంగం      3) పులుగు       4) పైవన్నీ    (4)

10. 'నిశ, యామిని, రజనీ' పర్యాయ పదాలున్న పదం?

  1) రాత్రి       2) వెన్నెల       3) చీకటి       4) చంద్రుడు    (1)

11. ‘కంఠీరవం’ పదానికి పర్యాయ పదం?

  1) కేసరి       2) మృగరాజు     3) సింహం       4) పైవన్నీ    (4)

12.ఒక పదానికి అనేక అర్థాలుంటే దాన్ని ఏమంటారు?

  1) పర్యాయ పదాలు     2) నానార్థాలు      3) వ్యుత్పత్యర్థాలు       4) నైఘంటికార్థాలు    (2)

13. ‘అనృతం’ పదానికి నానార్థాలు?

  1) అసత్యం      2) సేద్యం      3) వాణిజ్యం       4) పైవన్నీ    (4)

14.'మిత్రుడు' పదానికి నానార్థాలు?

  1) సూర్యుడు       2) స్నేహితుడు      3) హితుడు       4) పైవన్నీ   (4)

15. 'సింహం, గుర్రం, ఆంజనేయుడు' అనే అర్థాలున్న పదం?

  1) పుండరీకం       2) కేసరి       3) కరము         4) అశని     (2)

16. 'పుండరీకం' పదానికి నానార్థం కానిది?

  1) పులి       2) తీయమామిడి       3) ఆకాశం        4) తెల్ల తామర   (3)

17. 'గుణం' పదానికి నానార్థాలు?

  1) వింటినారి       2) స్వభావం     3) దారం       4) పైవన్నీ     (4)

18. 'కుండలి' పదానికి నానార్థాలు?

  1) పాము       2) నెమలి      3) వరుణుడు      4) పైవన్నీ      (4)

19. ఒక పదానికి సంబంధించిన పుట్టుక, నేపథ్యం దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసే పదాలు?

  1) పర్యాయ పదాలు      2) వ్యుత్పత్త్యర్థాలు       3) నైఘంటికార్థాలు       4) నానార్థాలు      (2)

 20. ‘మరణం పొందనిది’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?

  1) అనృతం      2) ఘృతం     3) అమృతం      4) అనఘం     (3)

21. ‘స్వభావం చేత ఐశ్వర్యం గలవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?

  1) ఇంద్రుడు      2) విష్ణువు      3) కుబేరుడు       4) ఈశ్వరుడు     (4)

22. ‘అజ్ఞానమనెడి అంధకారాన్ని పోగొట్టేవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?

  1) సూర్యుడు      2) చంద్రుడు       3) గురువు         4) దేవుడు    (3)

23. ‘సాధువుల హృదయాన శయనించి ఉండువాడు మంగళ ప్రదుడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?

  1) బ్రహ్మ         2) శివుడు      3) విష్ణువు        4) ఇంద్రుడు     (2)

24. ‘దాశరథి’ అనే పదానికి వ్యుత్పత్తి?

  1) దశరథుని కుమారుడు       2) దశరథుని తమ్ముడు     

 3) దశరథుని పురోహితుడు      4) దశరథుని గురువు    (1)

25. ‘పద్మము గర్భముగా కలవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?

  1) బ్రహ్మ        2) విష్ణువు      3) ఇంద్రుడు       4) నారదుడు     (1)

26. ‘పున్నామ నరకం నుంచి తప్పించువాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?

  1) కుమారుడు       2) పుత్రుడు      3) తనయుడు        4) ఆత్మజుడు      (2)

27. ‘ఆదేశం, ఆన, ఉత్తరువు, నిర్దేశం’ అనే పర్యాయ పదాలున్న పదం?

  1) ఆకరం       2) ఆరోపం     3) అనుమతి       4) ఆజ్ఞ     (4)

28. పదాల అర్థం ఉన్నదున్నట్లుకాకుండా, దాన్ని పరిశీలిస్తే జాతి వాడుకలో ఉన్న ప్రసిద్ధమైన భాషా విశేషం స్ఫురించడాన్ని ఏమంటారు?

  1) సామెత       2) జాతీయం      3) వ్యుత్పత్తి       4) పొడుపు కథ   (2)

29. ‘చెవికి ఇంపును కలిగించు’ అనే అర్థంలో ఉన్న జాతీయం?

  1) చెవిలో జోరీగ      2) చిలుక పలుకులు     3) వీనుల విందు      4) తలలో నాలుక      (3)

30. ‘ఆరంభంలోనే ఆటంకం’ కలిగే సందర్భంలో ఉపయోగించే జాతీయం?

  1) పురిటిలోనే సంధి      2) ఆరంభ శూరత్వం   

  3) ఆదిలోనే హంసపాదు      4) ఆదిలోనే ఆటంకం     (3)

31.‘గురువు చెప్పిన మాటలు పెడచెవిని పెట్టినందున రవి చెడిపోయాడు’- ఈ వాక్యంలో ‘పెడచెవినిపెట్టు’ అనే జాతీయానికి అర్థం?

  1) విని ఆచరించడం      2) పూర్తిగా మునిగిపోవడం   

  3) చెప్పుచేతల్లో నడవడం        4) పట్టించుకోక పోవడం     (4)

32. ‘విశేష జ్ఞానం సంపాదించు’ అనే అర్థం వచ్చే జాతీయం?

  1) నల్లేరుపై బండినడక      2) నాలుగాకులెక్కువ చదవడం       

3) భగీరథ ప్రయత్నం      4) నోరు మెదల్చడం     (2)

33. అల్పాక్షరాల్లో అనల్ప భావాన్ని, అనుభవాన్ని సందేశాత్మకంగా అందించేదాన్ని ఏమంటారు?

  1) జాతీయం       2) సామెత      3) పొడుపు కథ        4) తట్టుకథ   (2)

34. 'సామెత'కు పర్యాయ పదాలు?

  1) నానుడి-జనశ్రుతి       2) సుద్దు        3) సాటువ-శాస్త్రం        4) పైవన్నీ     (4)

35. ‘ఉల్లి చేసే మేలు తల్లిైయెునా చేయదు’ అనేది ఏ రకమైన సామెత?

  1) మనస్తత్వ సామెత      2) హాస్యపు సామెత      3) వైద్యపు సామెత       4) ఆరోగ్య సామెత     (3)

36. ‘చిన్నతనంలో మాట విననివాడు పెద్దయ్యాక అసలే వినడు’ అనే అర్థంలో ప్రసిద్ధమైన సామెత?

  1) హితం వినని మూర్ఖుడు     2) చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు      

3) ఉట్టికెగరలేనివాడు స్వర్గానికెగిరినట్లు      4) మొక్కై వంగనిది మ్రానై వంగునా      (4)

37. నిగూఢార్థస్ఫోరకంగా, అంతు చిక్కకుండా తికమకలు పెట్టేది?

  1) జాతీయం       2) సామెత      3) పొడుపు కథ       4) నానుడి    (3)

39. ‘నెత్తి మీద రాయి నోట్లో వేలు’ అనే పొడుపు కథకు అర్థం?

  1) ఉంగరం       2) వడ్డాణం      3) తాయెత్తు       4) అంత్రం    (1)

40.‘తండ్రి గరగర, తల్లి పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు’ ఈ పొడుపు కథకు విడుపు?

  1) కొబ్బరికాయ       2) పనసపండు        3) దోసకాయ        4) బీరకాయ     (2)

41. ‘కిటకిట తలుపులు కిటారు తలుపులు, ఎప్పుడు తీసినా చప్పుడు కావు’ ఏమిటవి?

  1) చూపులు       2) కిటికీ తలుపులు       3) కనురెప్పలు       4) పెదవులు    (3)

42. 'పుత్రుడు' పదానికి వికృతి?

  1) తనయుడు       2) కొమరుడు        3) బొట్టెడు       4) బొట్టె     (4)

43. ‘జాతర’ పదానికి ప్రకృతి?

  1) జాత్ర        2) యాతర       3) యాత్ర       4) జాగృత     (3)

45. ‘గరువము, జతనము’ అనే పదాలకు ప్రకృతి రూపాలు?

  1) గారవము, ప్రయత్నము      2) గర్వము, యత్నము     

3) గార్వము, ప్రయత్నము     4) గీము, ప్రయత్నము     (2)

46.‘ధూర్జటి ’ అనే పదానికి అర్థం?

  1) విఘ్నేశ్వరుడు       2) విష్ణువు      3) బ్రహ్మ        4) శివుడు     (4)

47. 'వల్మీకం' అంటే అర్థం? 

  1) చెట్టు        2) ఊరు      3) పుట్ట      4) అడవి     (3)

48. ‘దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూడటం’ అనే అర్థం వచ్చే జాతీయం?

  1) కాలుగాలిన పిల్లి       2) కడలో నీరు కదలకుండా      

3) ఆటకట్టుచేయు        4) గోతికాడనక్క       (4)

49. ‘ఇనుడు’ అనే మాటకు పర్యాయ పదాలు?      

  1) రవి, చంద్రుడు        2) రవి, ఇంద్రుడు       3) రవి, భానుడు      4) భానుడు, ఇంద్రుడు     (3)

50.‘భృంగారం’ అనే మాటకు వికృతి?

  1) భారం        2) భంగారం      3) బొంగరం      4) బంగారం      (4)

51. ‘పారు’ అనే క్రియా రూపానికి నానార్థాలు?

  1) పాలు, క్షీరం      2) ప్రవ హించు, పరుగెత్తు       3) కీర్తి, యశస్సు      4) ప్రవహించు, నాశనం     (2)

52. ‘హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధ గతినందున్’ - ఈ వాక్యంలో ‘హరిత్తులు’ అనే పదానికి అర్థం?

  1) పులులు        2) నాగళ్లు       3) సింహాలు       4) పాములు       (3)

53. ‘వజ్రంబు శిరీష పుష్పంబులనూహించు భేదింప’ ఈ వాక్యంలో శిరీషపుష్పమనగా?

  1) మంకెన పూవు         2) మోదుగు పూవు       3) దిరిసెన పూవు        4) సంపెంగ పూవు      (3)

54.‘వారిజ గర్భుడు’ అను పదానికి పర్యాయ పదాలు?

  1) సూర్యుడు, రవి       2) రవి, బ్రహ్మ      3) బ్రహ్మ, చతుర్ముఖుడు      4) రవి, చతుర్ముఖుడు     (3)

55. ‘తాత, ముత్తాతల కాలం నుంచి వస్తున్నది’ అనే అర్థానిచ్చే పదం?

  1) వంశపారంపర్యం        2) పెట్టింది పేరు      3) ఉట్టిపడుట        4) చూడముచ్చట   (1)

56. ‘శ్రీరామ రక్ష, గీటురాయి, స్వస్తి వాచకం’ అనే మాటలు?  

  1) చిట్టిమాటలు      2) సామెతలు       3) జాతీయాలు       4) పెద్దల మాటలు     (3)

57. ‘గురువు’ అనే పదానికి ఉన్న నానార్థాలు?

  1) తండ్రి, పురోహితుడు, ఉపాధ్యాయుడు       2) తండ్రి, ఇంద్రుడు, పురోహితుడు    

  3) బ్రహ్మ, ఒజ్జ, ఇంద్రుడు      4) బ్రహ్మ, యముడు, సూర్యుడు     (1)

58. సిరియె భోగోలబ్ధికి ‘జీవగఱ్ఱ’-ఈ వాక్యంలో ‘జీవగఱ్ఱ’ అనే జాతీయానికి వివరణ?

  1) జీవనాధారం      2) చేతికర్ర      3) కొరత        4) లెక్కచేయక పోవడం       (1)

59.‘యత్నం’ అనే పదానికి వికృతి?

  1) యాగము        2) జతనం       3) జగం        4) జంధ్యము    (2)

60. ‘ముద్ర’ అనే పదానికి నానార్థాలు?

  1) చంద్రుడు, అచ్చువేయడం      2) గుర్తు, నీరు      

3) ఒక అలంకారం, రెల్లు పూవు      4) గుర్తు, ఒక అలంకారం      (4)

61. 'పనిలేక ఖాళీగా ఉన్నవాడు పనిచేస్తున్నవాడిని చెడగొట్టినప్పుడు' ఈ సామెతను ఉపయోగిస్తాం?

  1) కందకులేని దురద కత్తికెందుకు        2) కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు       

3) కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లు       4) కూసే గాడిదవచ్చి మేసే గాడిదను చెరిపినట్లు     (4)

62. 'పారావారం' అనే పదానికి వ్యుత్పత్త్యర్థం?

  1) ప్రజలను మేల్కొలుపునది      2) పనికిరాని పూర్వపు కథ     

3) భూమిని ధరించునది       4) అంతులేని తీరంగలది      (4)

Telugu Grammar - మాదిరి ప్రశ్నలు - సంధులు, సమాసాలు

 Telugu Grammar - మాదిరి ప్రశ్నలు - సంధులు, సమాసాలు 

1. పితౄ  ణము పదాన్ని విడదీసి రాస్తే

ఎ) పితౄ  + ఋణం   బి) పితృ + ఋణం  సి) పితృ + రుణం  డి) పితృ  + ఋణము     (బి)

 2. ఒకే స్థాన కరణ ప్రయత్నంలో ఉత్పత్తి అయ్యే అక్షరాలను ఏమంటారు?

ఎ) గుణాలు  బి) వృద్ధులు  సి) సవర్ణాలు  డి) స్వరాలు     (సి)

3. 'అత్యంత' పదాన్ని విడదీసి రాస్తే

ఎ) అత్య + అంత  బి) అత + యంత  సి) అత్య + ఆంత  డి) అతి + అంత     (డి)

4. 'య - వ - ర' లను ఏమంటారు?

ఎ) యణ్ణులు బి) వృద్ధులు సి) గుణాలు  డి) ఇక్కులు      (ఎ)

 5. పూర్వపర స్వరంబులకు పరస్వరం ఏకాదేశమగునుటను ఏమంటారు?

ఎ) సమాసము  బి) సంధి  సి) సవర్ణము  డి) అలంకారము    (బి)

6. ఈ క్రింది వాటిలో వృద్ధులు ఏవి?

ఎ) ఆ - ఈ  బి) ఏఐ  సి) ఐ ఔ  ಡಿ)ಓ ಔ        (సి)

7. 'వాజ్మ..యము' పదాన్ని విడదీసి రాస్తే 

ఎ) వాక్కు + మయము  బి) వాగ్ + మయము   సి) వాజ.. + మయము  డి) వాక్ +మయము        (డి)

8. 'నెమ్మనము' పదాన్ని విడదీసి రాస్తే?

ఎ) నెఱ + మనము  బి) నెమ్ని + మనము  సి) నెమ్ము + మనము  డి) నే + మనము     (ఎ)

9. 'ఏ - ఓ - ఆర్” లను ఏమంటారు?

ఎ) వృద్ధులు  బి) గుణాలు  సి) యజ్ఞులు  డి)త్రికాలు       (బి)

10. హింద్వార్యులు' పదం ఏ సంధి?

ఎ) గుణ సంధి  బి) వృద్ధి సంధి  సి) యణాదేశ సంధి  డి) సవర్ణదీర్ఘ సంధి      ( సి)

11. ఒక + ఒక కలిస్తే వచ్చే పదం

ఎ) ఒకొక  బి) ఒక్కొక  సి) ఒక యొక డి) ఒకానొక    ( డి)

12. 'మా + అత్త' పదాన్ని సంథి చేసి రాస్తే

ఎ) మాయత్త - బి) మా అత్త సి) మాయ యత్త డి) మాయఅత్త      (ఎ)

13. ఏకైక పదం ఏ సంధి?

ఎ) గుణసంధి  బి) వృద్ధి సంధి  సి) యణాదేశ సంధి  డి) సవర్ణదీర్ఘ సంధి     (బి)

14. రెండు అచ్చుల మధ్య సంధి జరుగనపుడు వచ్చే కార్యం ఏది ?

ఎ) వైకల్పికం  బి) నిత్యం  సి) యడాగమము  డి) నుగానమము        (సి)

15. ఈ క్రింది వాటిలో ద్విరుక్తటకార సంధి పదాలు

ఎ) కుట్టు సురు  బి) చిట్టెలుక  సి) కట్టెదరు  డి) పైవన్నీ   (డి)

16. సమాసంలో మొదటి పదం నామవాచకంగా, రెండో పదం విశేషంగా వచ్చే సమాసం పేరు?

ఎ) విశేషణోత్తర పదకర్మధారయం   బి) ఉపమాన పూర్వపద కర్మధారయం

  సి) విశేషణ పూర్వపదకర్మధారయం   డి) ఉపమాన ఉత్తర పదకర్మధారయం          (ఎ)

17. పదాంతంలోని 'క - చ - ట - త - ప' లకు 'న - మ' అనునాసికాలు పరమైతే వచ్చే సంధిని ఏమంటారు?

ఎ) యణాదేశ సంథి  బి) అనునాసిక సంధి  సి) జశ్త్వ సంథి డి) గుణసంధి          (బి)

18. ఇత్తునకు అచ్చు పరంబగునపుడు సంధి

ఎ) యడాగమం  బి) బహుళం  సి) వైకల్పికం  డి) నిత్యం       (సి)

19. కేవల సంస్కృత పదాలతో ఏర్పడే సమాసాన్ని ఏమంటారు?

ఎ) సాధ్యము  బి) మిశ్రమం  సి) ఆచ్ఛికం  డి) సిద్ధము              (డి)

20. స కారత వర్గానికి చ కార, చవర్గాక్షరాలు పరంగా వస్తే వరుసగా శకార చవర్గాక్షరాలే వచ్చే సంథిని ఏమంటారు?

 ఎ) జశ్త్వ సంధి బి) శ్చుత్వసంధి సి) విసర్గ సంధి డి) ష్టుత్వసంధి           (బి)

21. ఒకే పదాన్ని రెండు సార్లు ఉచ్ఛరించిన పుడు రెండోసారి ఉచ్ఛరించినదాన్ని ఏమంటారు?

ఎ) పునరుక్తి  బి) ఫుతం  సి) ఆశ్రుడితం  డి) ద్విరుక్తం         ( సి)

22. సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉన్న సమాసం ఏది?

ఎ) ద్వంద్వము  బి) తత్పురుష  సి) బహువ్రీహి  డి) ద్విగువు            (డి)

23. 'ప్రతిదినం' పదం ఏ సమాసం? 

ఎ) అవ్యయిభావం                                    బి) ద్వంద్వము  

సి) విశేషణ పూర్వపదకర్మధారయం  డి) ఉపమాన పూర్వపద కర్మధారయం          (ఎ)

24. ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధి

ఎ) వైకల్పికము  బి) నిత్యం  సి) బహుళం  డి) యడాగమం    (బి)

25. 'పది + తొమ్మిది' పదాలను సంధి చేసి రాస్తే

ఎ) పది తొమ్మిది బి) పది దొమ్మిది  సి) పందొమ్మిది డి) తొమ్మిది పది        ( సి)

26. ఇ - ఉ - ఋ లకు అసవర్ణము లైన అచ్చులు పరమగునపుడు జరిగే సంధి

ఎ) గుణ సంధి బి) యణాదేశ సంధి సి)  జశ్త్వ సంధి డి) శ్చుత్వ సంథి      (బి)

27. సమాసం అంటే? 

ఎ) పూర్వ సరస్వరాల కలయిక                            బి) బహువచనం 

 సి) రెండు విభిన్న పదాలు ఏక పదంగా కలయిక  డి) విభిన్న పదాలు    (సి)

28. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము?

ఎ) ఆదేశం  బి) బహుళం  సి) ఏకాదేశం  డి) వైకల్పికం       ( బి)

29. సమాసాలు దేన్ని అను సరించి ఏర్పడతాయి?

ఎ) అర్థాన్ని బట్టి  బి) శబ్దాన్ని బట్టి  సి) శబ్దార్థాలను బట్టి  డి) స్వతంత్రంగా   (సి)

30. కర్మధారయ యందలి పేదాది శబ్దాలకు 'ఆట' శబ్దము పరమగునపుడు

ఎ) టుగాగమంబగు  బి) రుగాగమంబగు  సి) నుగాగమంబగు  డి) దుగాగమంబగు     (బి)

31. సమాసంలో మొదటి పదాన్ని ఏమంటారు? -

ఎ) ఉత్తర పదం బి) తటస్థ పదం సి) పూర్వపదం డి) పూర్వోత్తర పదం           (సి)

32. మీగడ పదాన్ని విడదీసిరాస్తే

ఎ) మీ + కడ  బి) మీదు + కడ  సి) మీదు + గడ  డి) మీ + గడ        (బి)

33. 'తటా కోదకము' పదం ఏ సమాసం?

ఎ) సాధ్యము   బి) మిశ్రమం   సి) సిద్ధము   డి) ఆచ్ఛికం           (సి) 

34. సమాసంలో పదాల మధ్య సంబందాన్ని స్పష్టపరచేవి?

ఎ) ప్రత్యయం   బి) విగ్రహవాక్యం   సి) విభక్తి   డి) అర్థభేదం          (బి)

35. 'సిరివల్లభుడు' పదం ఏ సమాసం?

ఎ) సాధ్య సమాసం  బి) ఆచ్ఛిక సమాసం  సి) మిశ్ర సమాసం  డి) సిద్ధ సమాసం          (సి)

36. శబ్దాన్ని అనుసరించి ఏర్పడే సమాసాలు ఎన్ని? 

ఎ) రెండు  బి) మూడు  సి) నాలుగు  డి) ఐదు                 (బి) 

37. అర్ధాన్ని బట్టి సమాసాలు ఎన్ని విధాలు? 

ఎ) ఐదు  బి) నాలుగు  సి) ఆరు  డి) ఏడు             (సి) 

38. తత్యమ పదాలతో ఏర్పడే సమాసాన్ని ఏమంటారు?

ఎ) సిద్ధం  బి) సాధ్యం   సి) మిశ్రమం  డి) ఆచ్ఛికం                (బి)

39. విగ్రహవాక్యంలో 'అందు' ప్రత్యయం వచ్చే తత్పురుషం ఏది?

ఎ) ద్వితీయా  బి) తృతీయా  సి) సప్తమ  డి) పంచమీ             (సి)

40. 'రాజునాజ్ఞ' పదం ఏ సమాసం?

ఎ) సిద్ధము  బి) సాధ్యము  సి) మిశ్రమం  డి) ఆచ్ఛికం           (బి)

41. 'శీతోష్ణాలు' పదం ఏ సమాసం?

ఎ) విశేషణ పూర్వపద కర్మధారయం   బి) విశేషణోత్తర పదకర్మధారయం  

సి) విశేషణోభయ పదకర్మధారయం  డి) ఉపమాన పూర్వపద కర్మధారయం             (సి)

42. ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం పేరు?

ఎ) కర్మ ధారయం  బి) తత్పురుష  సి) ద్వంద్వము  డి) బహువ్రీహి            (బి)

43. అన్య పదప్రాధాన్యం గల సమాసం ఏది? 

ఎ) ద్విగువు  బి) ద్వంద్వము   సి) బహువ్రీహి  డి) విశేషణోత్తర పదకర్మధారయం                 (సి)

44. విశేషణ విశేష్యాలతో ఏర్పడే సమాసం ఏది ?

ఎ) తత్పురుష  బి) కర్మధారయం  సి) వ్యధికరణం  డి) ద్విగువు            (బి)    

45. 'పద్మముఖి' పదం ఏ సమాసం?

ఎ) ఉపమానోత్తర పదకర్మధారయం   బి) ఉపమాన పూర్వపదకర్మధారయం 

 సి) విశేషణోత్తర పదకర్మధారయం   డి) బహువ్రీహి          (బి)

46. కమలనాభుడు పదం ఏ సమాసం? 

ఎ) తత్పురుష                       బి) బహువ్రీహి   

సి) ఉపమాన పూర్వపదం  డి) ఉపమానోత్తర పదకర్మధారయం            (బి)

తెలుగు వ్యాకరణం - నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, పొడుపుకథలు - మాదిరి ప్రశ్నలు

తెలుగు వ్యాకరణం - నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, పొడుపుకథలు - మాదిరి ప్రశ్నలు

1. 'కళ్యాణం' పదానికి నానార్థాలు ఏవి ?

ఎ) పెళ్లి   బి) శుభం   సి) మంగళం   డి) పైవన్నీ            (డి)


1. నానార్థాలు అంటే ఏమిటి?

ఎ) ఒకే అర్థాన్నిచ్చే వేరు వేరు పదాలు  బి) ఒకే పదానికి ఉన్న అనే కార్థాలు  

సి) ఒకే పదానికి 'పుట్టు' పూర్వోత్తరాలు  డి) ఒకే పదానికి వ్యతిరేక పదాలు   (బి)


2. రాజు పదానికి నానార్థాలు ఏవి?

ఎ) రాజు,పాలకుడు  బి) రాజు, రక్షకుడు  

సి) క్షత్రియుడు, ప్రభువు, చంద్రుడు  డి) పాలకుడు, ఆధిపతి      (సి)


3. వ్యుత్పత్యర్థాల ప్రయోజనం ఏమిటి? 

ఎ) భాషా సంపద పెంపు  బి) పదాల మూలం సి) పదం పుట్టు పూర్వోత్తరాలు డి) పైవన్నీ      (డి)


4. పితామహుడు పదానికి నానార్థాలు ఏవి?

ఎ) బ్రహ్మ, తండ్రి   బి) బ్రహ్మ, తాత  సి) తాత,ముత్తాత    డి) బ్రహ్మ, విష్ణువు          (బి)


5. వంశము పదానికి నానార్థాలు ఏవి?

ఎ) కులము, మతము     బి) మొలక, వెదురు   సి) కులము, వెదురు, పిల్లనగ్రోవి   డి) కులము, గోత్రము          (సి)


6. సుధ పదానికి నానార్థాలు ఏవి?

ఎ) అమృతం, సున్నం   బి) నేయి, తెనె    సి) అమృతం, నేయి   డి) అమృతం , పాలు      (డి)


7. 'ధ్వని' నానార్థాలు ఏవి?

ఎ) దిక్కు, శబ్దం   బి) శబ్దం, వ్యంశ్యం   సి) దిశ, దెస   డి) స్వర్గం, తరంగం          (బి)


8. 'అమరులు' పదానికి వ్యుత్పత్తి అర్థం ఏది? 

ఎ) అమరం రానివారు  బి) అర మరలు లేనివారు

  సి) మరణం లేనివారు  డి) మరలు తెలియని వారు          (సి) 


9. 'కంఠీరవము' అనగా వ్యుత్పత్తి ఏది?

 ఎ) కంఠమందు విషము గలది  బి) కంఠమందు ఆభరణం గలది 

  సి) కంఠమందు భాష గలది  డి) కంఠమందు శబ్దము గలది.          (డి)


 10. 'విషయం' పదానికి నానార్థాలు ఏవి? 

ఎ) సంగ్రహం, సంక్షిప్తం  బి) దేశం, వస్తువు, సమాచారం  

సి) సమాచారం, పరిజ్ఞానం  డి) సంగతి, సమాచారం         (బి)


11. 'పుత్రుడు' పదానికి వ్యుత్పత్తి ఏది? 

ఎ) పితృలోక వారసుడు  బి) పున్నామ నరకానికి పంపేవాడు 

సి) పున్నామ నరక రక్షకుడు  డి) వంశానికి వారసుడు           (సి)


12. పొడుపుకథ అంటే ఏమిటి?

 ఎ) నిగూఢార్థం కలది  బి) జ్ఞాన దాయకమైంది   సి) మనసుకు హత్తుకొనేది   డి) పైవన్నీ    (డి)


13. వ్యుత్పత్యర్థం అంటే ఏమిటి?

ఎ) పదానికి అర్థం  బి) పదానికి మూలం   సి) పదానికి నానార్థం  డి) పదానికి పర్యాయపదం       (బి)


14. 'మానవుడు' పదానికి వ్యుత్పత్తి ఏది?

ఎ) భూలోక వాసి    బి) జరామరణాలున్న వాడు.  

సి) మనువు వల్ల పుట్టినవాడు  డి) మనసుతో ఆలోచించేవాడు.            (సి)


15. పొడుపు కథ లక్షణం ఏమిటి?

ఎ) కొండంత భావాన్ని గోరంతలో చెప్పేది   బి) తికమక పెట్టేది  

 సి) మానసిక ఆనందం  కలిగించేది   డి) పైవన్నీ          (డి)


16. 'దైత్యులు' పదానికి వ్యుత్పత్తి ఏది?

 ఎ) ద్విజులు  బి) దితి యొక్క కుమారులు   సి) దేవతలు  డి) సురలు          (బి)


17. పొడుపు కథకు మరోపేరు?

ఎ) సామెత   బి) జాతీయం   సి) ప్రహేళిక   డి) నానుడి     (సి)


18. పొడుపు కథల్లో కనిపించే అలంకారం ఏది?

ఎ) ఉపమా   బి) రూపకం   సి) అతిశయోక్తి    డి) రూపకాతిశయోక్తి          (డి)


19. 'పద్మభవుడు' పదానికి వ్యుత్పత్తి ఏది?

ఎ) పద్మం నాభిలో ఉన్న వాడు  బి) పద్మం నుంచి పుట్టినవాడు  

 సి) పద్మం అలంకారంగా కలవాడు  డి) పద్మాన్ని వికసింపజేసేవాడు.           (బి)


20. ఏడు బారలమాను వంగి నీళ్లు త్రాగుతుంది ఏమిటి?

ఎ) కొబ్బరి చెట్టు  బి) తాటి చెట్టు  సి) ఏతాము  డి) ఒంటె         (సి) 


21. అందడు, ఆగడు, అరగడు ఎవరాతడు? -

ఎ) చంద్రుడు    బి) సూర్యుడు   సి) శివుడు   డి) నక్షత్రం     (బి)

 

22. ఒళ్లంతా కళ్లుంటాయి. కాని ఇంద్రుడు కాడు, మెడనల్లగా ఉంటుంది, కాని శివుడు కాడు, పాములను పట్టి చంపుతుంది. గరత్మంతుడు కాదు

ఎ) ఇంద్రుడు   బి) శివుడు   సి) నెమలి    డి) గరుత్మంతుడు           (సి)


23. ఆరు కాళ్లున్నాయి. కాని తుమ్మెదకాదు. తొండం ఉంటుంది. దోవు కాదు,  రెక్కలుంటాయి కాని పక్షి కాదు. ఏమిటది? 

ఎ) తుమ్మెద   బి) ఈగ  సి) పక్షి   డి) దోమ         (బి)


24. అక్కా చెల్లెళ్లు ఏడుస్తారు. ఐతే దగ్గరకు చేరలేరు. 

ఎ) కాళ్లు   బి) చేతులు   సి) కళ్లు  డి) చెవులు          (సి)


25. నెత్తి మీద రాయి. నోట్లో వేలు. ఏమిటి దీని అర్థం?

ఎ) కంఠహారం   బి) వడ్డాణం   సి) ఉంగరం  డి) నాగరం         (సి)


తెలుగు వ్యాకరణం - భాషా భాగాలు, వచనాలు, కాలాలు - మాదిరి ప్రశ్నలు

 తెలుగు వ్యాకరణం -  భాషా భాగాలు, వచనాలు, కాలాలు - మాదిరి ప్రశ్నలు  

1. క్రియా నామ వాచకానికి గల మరోపేరు? 

ఎ) గుణ నామవాచకం బి) జాతి నామవాచకం 

 సి) కృదంత నామవాచకం డి) సమస్త నామవాచకం      (సి)


2. నావువాచకానికి మరోపేరు?

ఎ) విశేషణం  బి) సర్వనామం  సి) విశేష్యం  డి) అవ్యయం    (సి)


3. అవ్యయాలు ఎన్ని విధాలు? 

ఎ) నాలుగు  బి) మూడు  సి) రెండు  డి) ఐదు    (సి)


4. సంస్కృత భాషలో వచనాలు ఎన్ని?

ఎ) రెండు  బి) నాలుగు  సి) మూడు  డి) ఐదు    (సి)


5. 'సదస్సు' - అనేది ఏ నామవాచకం? 

ఎ) సమస్త నామవాచకం  బి) జాతి నామవాచకం 

 సి) సంజ్ఞా నామవాచకం డి) గుణ నామవాచకం  (బి)

 

6. 'తర్వాత' అనే అర్థం వచ్చే క్రియా పదం ఏది?

ఎ) శత్రర్థకం  బి) అనంతర్యార్థకం  సి) భేదర్థకం  డి) తుమన్నర్థకం     (బి)


7. 'మంచి' అనే పదం ఏ విశేషణం?

ఎ) క్రియా విశేషణం  బి) గుణ విశేషణం  సి) విధేయ విశేషణం  డి) ఏదీకాదు     (బి)


8. 'ఆ - ఈ - ఏ అనేవి ఏ సర్వనామాలు? 

ఎ) సంబంధ సర్వనామాలు  బి) నిర్దేశాత్మక సర్వనామాలు

  సి) సంఖ్యావాచక సర్వనామాలు డి) పురుష బోధకాలు     (బి)


9. భూత కాలాన్ని తెలిపే అసమాపక క్రియను ఏమంటారు?

ఎ) భేదర్థకం  బి) శత్రర్థకం  సి) తుమన్నర్థకం  డి) క్త్వార్థం       (డి)


10. అన్ని కాలాల్లో వర్తించే క్రియా పదాలు ఏవి?

ఎ) క్వార్థకాలు  బి) సమాపక క్రియలు  సి) భూతకాల క్రియలు  డి)తద్ధర్మార్థక క్రియలు    (డి)


11. సంభార వాచక పదాలు ఏవి?

ఎ) బియ్యం  బి) చింత పండు  సి) ఉప్పు  డి) పైవన్నీ    (డి)


12. ఈ క్రింది వాటిలో స్థల వాచక పదాలు? 

ఎ) అక్కడ  బి) ఎక్కడ సి) ఇక్కడ డి) పైవన్నీ     (డి)


13. 'వండితే, తింటే' అనేవి ఏ క్రియా రూపాలు? 

ఎ) భేదర్థకాలు  బి) శత్రర్థకాలు  సి) క్వార్థకాలు  డి) తుమన్నర్థకాలు      (ఎ)


14. ఈ క్రింది వాటిలో నిత్య బహువచనం ఏది? 

ఎ) పాలు  బి) చేలు  సి) చెట్లు  డి) ఆకులు    (ఎ)

 

15. ప్రస్తుతాన్ని తెలియ జేసే కాలాన్ని ఏమంటారు? 

ఎ) వర్తమాన కాలం బి) భూత కాలం సి) భవిష్యత్ కాలం డి) తద్ధర్మ   (ఎ)


16. తెలుగుభాషలో వచనాలు ఎన్ని?

ఎ) మూడు  బి) రెండు  సి) నాలుగు  డి) ఐదు   (బి)


17. 'సాటి' పదం ఏ వాచక పదం ?

ఎ) సంఖ్యావాచకం  బి) తుల్యవాచక పదం  సి) గుణ వాచకం  డి) సంజ్ఞా వాచకం    (బి)

 

18. తెలుగుభాష లో ప్రధానంగా వాడుకలో ఉన్న కాలాలు ఏన్ని?

ఎ) నాలుగు  బి) మూడు  సి) రెండు  డి) ఆరు     (బి)


19. కృష్ణానది ఏ వాచక పదం?

ఎ) గుణ వాచకం  బి) సంభార వాచకం  సి) సంజ్ఞా వాచకం  డి) స్థల వాచకం     (సి)


20. సహజ సిద్ధంగా జరిగే పనులను తెలియజేసే కాలాన్ని ఏమంటారు?

ఎ) భూత  బి) భవిష్యత్  సి) తద్ధర్మ  డి) వర్తమాన    (సి)


21. గత కాలాన్ని తెలిపేది?

ఎ) భవిష్యత్ బి) వర్తమాన  సి) భూత  డి) తద్ధర్మ    (సి)


22. ఈ క్రింది వాటిలో క్రీడా వాచక పదం కానిది?

ఎ) అచ్చన గాయలు బి) చొట్టు  సి) ఓమన గుంటలు డి) పెసలు    (డి)


23. ఈ క్రింది వాటిలో సర్వనాము పదాలు ఏవి?

ఎ) అందరు  బి) కొందరు  సి) ఎందరు  డి) పైవన్నీ    (డి)


24. 'రమ్య' చదువుతున్నది - ఇది ఏకాలం?

ఎ) భూత   బి) తద్ధర్మ  సి) భవిష్యత్  డి) వర్తమాన    (డి)


25. తెలుగు భాషలో లేనిది, సంస్కృతంలో ఉన్న వచనమేది?

ఎ) ఏకవచనం  బి) ద్వివచనం  సి) బహువచనం  డి) ఏదీకాదు    (బి)


26. 'వానలు కురిసిన పంటలు పండును' - ఇది ఏ కాలం?

ఎ) భూత  బి) తద్దర్మ  సి) వర్తమాన   డి) భవిష్యత్    (బి) 


27. 'సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు' - ఏ కాలం?

ఎ) భూతకాలం  బి) తద్ధర్మ  సి) వర్తమాన  డి) భవిష్యత్    (బి)


28. జరుగబోవు పనిని తెలియజేసే కాలాన్ని ఏమంటారు?

ఎ) వర్తమాన  బి) భూత  సి) భవిష్యత్ డి) తద్ధర్మ         (సి)

తెలుగు వ్యాకరణం - వర్ణమాలు, కళలు, ద్రుత ప్రకృతికాలు - మాదిరి ప్రశ్నలు

 తెలుగు వ్యాకరణం - వర్ణమాలు,  కళలు, ద్రుత ప్రకృతికాలు - మాదిరి ప్రశ్నలు 

1. అచ్చులకున్న మరోపేరు?

ఎ) వ్యంజనాలు  బి) స్వరాలు  సి) ప్రాణాలు  డి) హల్లులు    (బి)


2. వ్యంజనాలంటే ఏమిటి?

ఎ) అచ్చులు  బి) హల్లులు  సి) మహ ప్రాణాలు  డి) ఉభయాక్షరాలు   (బి)


3. వర్ణమాలలో ప్రస్తుతం అచ్చులుఎన్ని? 

ఎ) 16   బి) 123  సి) 14  డి) 15     (బి)


4. సరళాలు ఏవి?

ఎ) క,చ,ట,త,ప లు  బి) గ,జ,డ,ద,బలు  సి) శ - ష - సహ లు  డి) ఘ,ఝ,ఢ, ధ,భ లు    (బి)


5. ప్రస్తుతం వర్ణమాలలో అచ్చుల నుంచి తొలగించిన అక్షరాలు ఏవి? 

ఎ) ఋ, ౠ   బి) .....   సి) 142  డి) ఏవీ కావు    (సి)


6. పరుషాలు ఏవి?

ఎ) గ,జ,జ,ద,బ లు  బి) బ,భ,ద,ధ,న లు  సి) క,చ,ట,త,ప లు  డి) ఖ,ఛ,ర,థ,ఫ లు    (సి)


7. వర్ణమాలలో హల్లులు మొత్తం ఎన్ని? 

ఎ) 56  బి) 36  సి) 37 డి) 4 - 40  (సి)


8. వత్తున్, వచ్చెదన్ వంటి ద్రుత ప్రకృతికాలు ఏ పురుష కు చెందినవి?

ఎ) ప్రథమ పురుష ఏకవచనాలు  బి) ఉత్తమ పురుష బహువచనాలు

 సి) ఉత్తమ పురుష ఏకవచనాలు  డి) మధ్యమ పురుషు ఏకవచనాలు    (సి)


9. ఈ క్రింది వాటిలో అవ్యయ ద్రుత ప్రకృతికం ఏది? 

ఎ) వచ్చితిన్  బి) వచ్చెదను  సి) వలెన్ డి) రాగలను   (సి)


10. అనునాసికాలు  ఏవి?

ఎ) ...,ఞ, ణ, న, మ బి) థ, ధ, న, మ సి) ప, ఫ, బ, భ, మ డి) ఛ, ఝ, ణ, న     (ఎ)


11. ద్రుతం అంటే ఏమిటి? 

ఎ) 'న' కారం  బి) ను సి) ని డి) న్   (ఎ)


12. ద్రుత ప్రకృతికం అంటే ఏమిటి? 

ఎ) 'న' కారం చివర ఉన్నది   బి) 'న్' చివర ఉన్నది సి) 'ను' కారం చివర ఉన్నది డి) పైవన్నీ    (డి)


13. తుమన్నర్థక ద్రుత ప్రకృతికం ఏది?

ఎ) కొట్టగన్  బి) కొట్టిడున్  సి) కొట్టుచున్  డి) కొట్టినన్     (డి)


14. ఈ క్రింది వాటిలో 'కళ'  ఏది?

ఎ) చేసినన్  బి) చేయగన్  సి) తినినన్  డి) మిన్నక    (డి)


15. కళలు అంటే ఏమిటి? 

ఎ) శత్రర్థకాలు బి) తుమన్నర్థకాలు  సి) ఆశీర్వాద్యర్థకాలు డి) ద్రుత ప్రకృతికాలు కానివి    (డి)


16. 'ప్రసన్నులయ్యెడున్' అనేది ఏ అర్థానికి సంబంధించిన ద్రుత ప్రకృతికం?

ఎ) ఛేదర్థకం  బి) ఆశీర్వాద్యర్థకం  సి) శత్రర్థకం  డి) తుమన్నర్థాకం    (బి)


17. 'చేయుచున్' అనే ద్రుత ప్రకృతికం ఏ క్రియకు సంబంధించింది?

ఎ) అనంతర్యార్థకం  బి) శత్రర్థకం  సి) తుమన్నర్థకం  డి) ఛేదర్థకం    (బి)


18. 'తిని' తినక క్రియలు దేనికి సంబంధించినవి?

ఎ) ద్రుతాలు  బి) కళలు  సి) ద్రుతప్రకృతికాలు  డి) అవ్యయాలు    (బి)

అభ్యుదయ కవిత్వం - Telugu General Knowledge

 అభ్యుదయ కవిత్వం - Telugu General Knowledge

1. అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? 

జవాబు:  1986 ఏప్రిల్ 9 లక్నోలో 

2. అభ్యుదయమనే పదానికి  సమానార్థకమైన ఆంగ్లపదం? 

జవాబు:  ప్రోగ్రెస్ 

3. వచన కవితకు ఆద్యుడు ? 

జవాబు: శిష్టా 

4. భారతీయ అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 

జవాబు:  1935 అలహాబాద్ లో

5. భావకవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన ఉద్యమం? 

జవాబు: అభ్యుదయ కవిత్యోద్యమం 

6. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది?

 జవాబు: 1943లో 

7. 'తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది' అని అన్నది ?

జవాబు:  గజ్జెల మల్లారెడ్డి 

8. మహాప్రస్థానం ఎవరికి అంకితమిచ్చారు?

జవాబు: కొంపల్లి జనార్దనరావు 

9. 'అభ్యుదయం' అనే పదానికి గల అర్థం? 

జవాబు: మంగళం, శుభం, ప్రగతి శీలం 

10. ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభకు అధ్యక్షులు ?

 జవాబు: తాపీ ధర్మారావు 

11. 'వచ్చాను వచ్చాను వ్యాస సంతితివాణ్ణి' అని అన్నది? 

జవాబు:  అనిసెట్టి సుబ్బారావు 

12. 'నవమి చిలుక, విష్ణు ధనువు' అనేవి ఎవరి రచనలు ?

 జవాబు:  శిష్టా

13. మహాప్రస్థానానికి పీఠికగా యోగ్యతా పత్రం రాసింది ఎవరు? 

జవాబు: చలం 

14. 'విషాద భారతం' రచించింది ? 

జవాబు: సి. విజయలక్ష్మి

15. 'రుధిర జ్యోతి' అనే కవితా సంపుటి ఎవరిది ?

 జవాబు:  శ్రీరంగం నారాయణబాబు 

16. 'ఫీడేలు రాగాల డజను' అనే గేయసంపుటి ? 

జవాబు:  పఠాభి 

17. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటి ఎప్పుడు వెలువడింది ? 

జవాబు: 1950 

18. 'నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను' అని అన్నది ఎవరు? 

జవాబు:  పఠాభి 

19. 'ప్రపంచం ఒక లంకా నగరం బ్రతుకొక అశోక వృక్షం' అని అన్నదెవరు ? 

జవాబు:  బెల్లంకొండ రామదాసు

20. 'ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు' అని అన్నది ?

 జవాబు:  సోమసుందర్ 

21. నయాగరా కవులు? 

జవాబు: . కుందుర్తి, ఏల్చూరి, బెల్లంకొండ

22. 'జయభేరి' ఎవరి రచన?

జవాబు : శ్రీశ్రీ

23. 'కుందుర్తి ఆంజనేయులు' బిరుదు ? 

జవాబు:  వచన కవితా పితామహుడు  

24. 'వజ్రాయుధం' ఎవరి రచన? 

జవాబు:  సోమసుందర్

25. 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.....' అని అన్నది ? 

జవాబు:  వేములపల్లి శ్రీకృష్ణ

26.  అభ్యుదయ కవిత్యోద్యమ ఆవిర్భావానికి ముందే అభ్యుదయ దృక్పథంతో రచనలు చేసిందెవరు?

 జవాబు:  శిష్టా ఉమామహేశ్వరరావు, పఠాభి, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబు 

27. 'పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి' అని అన్నది?

జవాబు : శ్రీశ్రీ

28. శ్రీశ్రీ ఏ రచన అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో వంటిది? 

జవాబు:  ప్రతిజ్ఞ 

29. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి...'అన్న శ్రీశ్రీ రచన ? 

జవాబు:  జయభేరి 

30. అభ్యుదయ యుగంలో అచ్చయిన తొలి కావ్యం? 

జవాబు:  నయాగారా(1944లో) 

31. శ్రీశ్రీ 'మహాప్రస్థానం' మొదట ఏ పత్రికలో ప్రచురితమైంది?

 జవాబు:  జ్వా ల 

32. 'భగవంతుడికి బహిరంగ లేఖ' అనే కవితా ఖండిక ఎవరిది ? 

జవాబు:  కుందుర్తి ఆంజనేయులు 

33. 'అరుణరేఖలు' రాసింది ? 

జవాబు:  తెన్నేటి సూరి 

34. గెరిలా వీరులనుద్దేశించి 'ఇక్కడ కావు ముళ్లు తీసేది నడువు కామ్రేడ్ అని అన్నది ? 

జవాబు:  గంగినేని వెంకటేశ్వరరావు

35. 'శ్మశానం' ఎవరి రచన? 

జవాబు:  బెల్లంకొండ రామదాసు

36. అనిసెట్టి రచించిన ప్రముఖ అభ్యుదయ కావ్యం ? 

జవాబు: అగ్నివీణ 

37. 'ఉదయిని' అనే కావ్యం ఎవరిది? 

జవాబు:  గంగినేని వెంకటేశ్వరరావు

38. 'శంఖారావం ' రచన ఎవరిది? 

జవాబు:  గజ్జెల మల్లారెడ్డి 

39. రెంటాల గోపాలకృష్ణ రచించిన అభ్యుదయ కావ్యాలు? 

జవాబు:  సంఘర్షణ, సర్పయాగం 

Quiz

 క్విజ్ 

1) నమ్మాళ్వార్ శిష్యుడు?

అ) మధురకవి ఆళ్వార్                 ఆ) తిరుప్పాణ్ ఆళ్వార్

ఇ) కులశేఖరాళ్వార్                     ఈ) పేయాళ్వార్                     (అ)

 2) నమ్మాళ్వార్‌ కు గుడి కట్టించినవారు ఎవరు?

అ) తిరుప్పాణ్ ఆళ్వార్              ఆ) మధురకవి ఆళ్వార్

ఇ) కులశేఖరాళ్వార్                  ఈ) పేయాళ్వార్                 (ఆ)

3) ఆంజనేయుడు ఎవరి దగ్గర మంత్రి? 

అ) రాముడు                       ఆ) వాలి 

ఇ) ఇంద్రుడు                     ఈ) సుగ్రీవుడు             (ఈ)

 4) ఆంజనేయుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించాడు? 

అ) రాముడు                 ఆ) వాలి 

ఇ) ఇంద్రుడు              ఈ) సూర్యుడు                     (ఈ)

5) ఆంజనేయుడు ఎవరి వరంవల్ల పుట్టాడు?

అ) వరుణదేవుడు                ఆ) వాయుదేవుడు

ఇ) అగ్నిదేవుడు                  ఈ) సూర్యదేవుడు               (ఆ)

6)  హిరణ్యకశిపుడిని శ్రీమహావిష్ణువు ఏ అవతారంలో సంహరించాడు?

అ) కూర్మావతారం                ఆ) మత్స్యావతారం

ఇ) నృసింహావతారం           ఈ) వరాహావతారం               (ఇ)

7) హిరణ్యాక్షుణ్ణి  శ్రీమహావిష్ణువు ఏ అవతారంలో సంహరించాడు?

అ) కూర్మావతారం                   ఆ) మత్స్యావతారం

 ఇ) నృసింహావతారం               ఈ) వరాహావతారం                   (ఈ)

పురాణ ప్రశ్నలు - జవాబులు - Epic Questions - Answers

పురాణ ప్రశ్నలు - జవాబులు

1.వరుణుని భార్య(5);(శ్యామలాదేవి)

2. మిత్రవిందకు శ్రీకృష్ణుని వల్ల పుట్టిన కుమారుడు(2); (వహ్ని)

3. సొంత ఇంటిని ఇలా అంటారు(3), (స్వగృహం)

4. హద్దు(2); (మేర)

5. సూర్యుని కూతురు(3); (తపతి)

6. దేవయాని భర్తయైన చంద్రవంశపురాజు (3); (యయాతి)

7. ఆకాశం, స్వర్గం అను అర్థాలనిచ్చే పదం(2); (దివి)

8. వసంతఋతువు(3); (ఆమని)

9. యుద్ధం(2); (పోరు)

10. సమూహం (3) (వితతి)

11. అగ్నిదేవుని ముఖ్యపట్టణము (4);(తేజోవతి)

 12. మఱదలు'కుగల మరియొక పేరు(2); (శ్యాలి)

13. లక్కతో నిర్మించిన ఇల్లు(4); (లాక్షాగృహం)

14. ధనం (2); (విత్తం)

15. దక్షుని భార్య(3); (ధరణి)

16. దోపిడి దొంగ(3); (దోపరి)

17. మయుని పెద్దకొడుకు (3); (మాయావి)

18. వసుదేవుని భార్యల్లో ఒకరు (3); (మదిర)

19. నలుని భార్య(4); (దమయంతి)

20. దక్షుని కూతురు(4); (మరుద్వతి)

21. వశిష్ఠుని పెద్దకొడుకు(2); (శక్తి)

22. పరిమళము (2).(తావి)

Quiz - ఏ వాహనం ఎవరిది?

ఏ వాహనం ఎవరిది?

సరస్వతీ దేవి హంస 
లక్ష్మీదేవి గుడ్లగూబ 
అగ్ని దేవుడు మేక 
కుబేరుడు నరుడు 
శనైశ్చరుడు కాకి 
కుమారస్వామి నెమలి 
దుర్గాదేవి సింహం 
ఆంజనేయుడు ఒంటె 
విష్ణువు గరుత్మంతుడు 
బ్రహ్మహంస
మన్మథుడుచిలుక
ఇంద్రుడుఐరావతం
సూర్యుడు7 గుర్రాలు(అశ్వాలు)
జుగులాంబప్రేతం

Objective Type Multiple Choice Questions in Telugu (బహుళైశ్చిక ప్రశ్నలు # 4)

పురాణ, ఇతిహాస, కావ్యపరిజ్ఞానం పెంపొందించే ప్రశ్నలు # 4

1. తిరుమలేశుని దర్శనానికి ముందు ఏ దేవుణ్ణి దర్శించాలి?

అ) వాసుదేవుడు    ఆ) వామనుడు    ఇ) వరాహస్వామి    ఈ) వెంకటేశ్వర స్వామి (ఇ)


2. సతీసావిత్రి భర్త?

అ) సత్యవ్రతుడు     ఆ) సత్యవంతుడు     ఇ) సత్యకీర్తి     ఈ) సత్యమూర్తి  (ఆ)


3. శకుంతల పెంపుడు తండ్రి?

అ) కణ్వమహర్షి    ఆ) మృకండ మహర్షి     ఇ) భృగు మహర్షి    ఈ) అత్రి మహర్షి (అ)


4. శ్రీవారి 'ముత్యాలహారతి' ఎవరు ప్రారంభించారు?

అ) అన్నమయ్య     ఆ) పెదతిరుమలయ్య     

ఇ) తాళ్లపాక తిమ్మక్క     ఈ) తిరిగొండవెంగమాంబ  (ఈ)


5. ఆంధ్రభోజుడు ఎవరు?

అ) మహాకవి కాళిదాసు     ఆ) శ్రీకృష్ణదేవరాయలు 

ఇ) భోజరాజు                    ఈ) త్యాగరాజు  (ఆ)


6. శ్రీపద్మావతీ అమ్మవారు వెలసిన క్షేత్రం?

అ) శ్రీనివాసమంగాపురం     ఆ) అలిమేలుమంగాపురం 

 ఇ) నారాయణవనం     ఈ) నాగులాపురం  (ఆ)


7. మహాభారతములో పర్వాలు ఎన్ని?

అ) పదకొండు     ఆ) పన్నెండు     ఇ) పద్దెనిమిది     ఈ) ఇరవైఎనిమిది  (ఇ)

పురాణం క్విజ్ - Mythography quiz

పురాణం ప్రశ్నలు - సమాధానాలు 
1. గాయత్రీ మంత్రం ఏ వేదంలోనిది? - (ఋగ్వేదం)

2. మన్మథుని మరోపేరు ఏమిటి? - (అనంగుడు)

3. విశ్వామిత్రుడిచ్చిన అస్త్రాలన్నింటినీ రామలక్ష్మణులు ఎక్కడ ధరించారు? - (మనసులో)

4. నచికేతునికి యముడు బోధించిన ఉపనిషత్తు పేరేమిటి? - (కఠోపనిషత్తు)

5. పూర్వజన్మలో అంజనాదేవి ఎవరు? - (పుంజికస్థల అనే అప్సరస)

6. శత్రువు శౌర్యాన్ని, తేజస్సును నశింపజేయగల అస్త్రం ఏది? - (తేజప్రభ)

7. పరీక్షిత్తు ఎవరి కుమారుడు? - (అభిమన్యుడు)

8. వశిష్ఠుడి వద్ద ఉన్న గోవు పేరేమిటి? - (శంబల)

9. జనకుడి సోదరుడు ఎవరు? - (కుశధ్వజుడు)

10. పూష, గభస్తిమాన్, సువర్ణ సదృశ, హిరణ్యరేత అనే పేర్లు ఎవరికీ ఉన్నాయి? - (సూర్యుడికి)

The Mahabharata Quiz - part 1

మహాభారతం - క్విజ్ 
1. బ్రహ్మర్షులు సత్రయాగం నిర్వహించిన ప్రదేశం ఏది? - (నైమిశారణ్యం)

2. బ్రహ్మర్షులచే  సత్రయాగం చేయించిన ముని ఎవరు? - (శౌనకుడు)

3. శౌనకాది మునులకు మహాభారత కథను ఎవరు వినిపించారు? -  (ఉగ్రశ్రవనుడు)

4. మహాభారత రచన ఎంతకాలం సాగింది? - (మూడు సంవత్సరాలు)

5. దేవలోకంలో మహాభారతం వినిపించమని వ్యాసుడు ఎవరిని కోరాడు? -  (నారద మహాముని)

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు