Pages

అభ్యుదయ కవిత్వం - Telugu General Knowledge

 అభ్యుదయ కవిత్వం - Telugu General Knowledge

1. అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? 

జవాబు:  1986 ఏప్రిల్ 9 లక్నోలో 

2. అభ్యుదయమనే పదానికి  సమానార్థకమైన ఆంగ్లపదం? 

జవాబు:  ప్రోగ్రెస్ 

3. వచన కవితకు ఆద్యుడు ? 

జవాబు: శిష్టా 

4. భారతీయ అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 

జవాబు:  1935 అలహాబాద్ లో

5. భావకవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన ఉద్యమం? 

జవాబు: అభ్యుదయ కవిత్యోద్యమం 

6. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది?

 జవాబు: 1943లో 

7. 'తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది' అని అన్నది ?

జవాబు:  గజ్జెల మల్లారెడ్డి 

8. మహాప్రస్థానం ఎవరికి అంకితమిచ్చారు?

జవాబు: కొంపల్లి జనార్దనరావు 

9. 'అభ్యుదయం' అనే పదానికి గల అర్థం? 

జవాబు: మంగళం, శుభం, ప్రగతి శీలం 

10. ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభకు అధ్యక్షులు ?

 జవాబు: తాపీ ధర్మారావు 

11. 'వచ్చాను వచ్చాను వ్యాస సంతితివాణ్ణి' అని అన్నది? 

జవాబు:  అనిసెట్టి సుబ్బారావు 

12. 'నవమి చిలుక, విష్ణు ధనువు' అనేవి ఎవరి రచనలు ?

 జవాబు:  శిష్టా

13. మహాప్రస్థానానికి పీఠికగా యోగ్యతా పత్రం రాసింది ఎవరు? 

జవాబు: చలం 

14. 'విషాద భారతం' రచించింది ? 

జవాబు: సి. విజయలక్ష్మి

15. 'రుధిర జ్యోతి' అనే కవితా సంపుటి ఎవరిది ?

 జవాబు:  శ్రీరంగం నారాయణబాబు 

16. 'ఫీడేలు రాగాల డజను' అనే గేయసంపుటి ? 

జవాబు:  పఠాభి 

17. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటి ఎప్పుడు వెలువడింది ? 

జవాబు: 1950 

18. 'నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను' అని అన్నది ఎవరు? 

జవాబు:  పఠాభి 

19. 'ప్రపంచం ఒక లంకా నగరం బ్రతుకొక అశోక వృక్షం' అని అన్నదెవరు ? 

జవాబు:  బెల్లంకొండ రామదాసు

20. 'ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు' అని అన్నది ?

 జవాబు:  సోమసుందర్ 

21. నయాగరా కవులు? 

జవాబు: . కుందుర్తి, ఏల్చూరి, బెల్లంకొండ

22. 'జయభేరి' ఎవరి రచన?

జవాబు : శ్రీశ్రీ

23. 'కుందుర్తి ఆంజనేయులు' బిరుదు ? 

జవాబు:  వచన కవితా పితామహుడు  

24. 'వజ్రాయుధం' ఎవరి రచన? 

జవాబు:  సోమసుందర్

25. 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.....' అని అన్నది ? 

జవాబు:  వేములపల్లి శ్రీకృష్ణ

26.  అభ్యుదయ కవిత్యోద్యమ ఆవిర్భావానికి ముందే అభ్యుదయ దృక్పథంతో రచనలు చేసిందెవరు?

 జవాబు:  శిష్టా ఉమామహేశ్వరరావు, పఠాభి, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబు 

27. 'పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి' అని అన్నది?

జవాబు : శ్రీశ్రీ

28. శ్రీశ్రీ ఏ రచన అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో వంటిది? 

జవాబు:  ప్రతిజ్ఞ 

29. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి...'అన్న శ్రీశ్రీ రచన ? 

జవాబు:  జయభేరి 

30. అభ్యుదయ యుగంలో అచ్చయిన తొలి కావ్యం? 

జవాబు:  నయాగారా(1944లో) 

31. శ్రీశ్రీ 'మహాప్రస్థానం' మొదట ఏ పత్రికలో ప్రచురితమైంది?

 జవాబు:  జ్వా ల 

32. 'భగవంతుడికి బహిరంగ లేఖ' అనే కవితా ఖండిక ఎవరిది ? 

జవాబు:  కుందుర్తి ఆంజనేయులు 

33. 'అరుణరేఖలు' రాసింది ? 

జవాబు:  తెన్నేటి సూరి 

34. గెరిలా వీరులనుద్దేశించి 'ఇక్కడ కావు ముళ్లు తీసేది నడువు కామ్రేడ్ అని అన్నది ? 

జవాబు:  గంగినేని వెంకటేశ్వరరావు

35. 'శ్మశానం' ఎవరి రచన? 

జవాబు:  బెల్లంకొండ రామదాసు

36. అనిసెట్టి రచించిన ప్రముఖ అభ్యుదయ కావ్యం ? 

జవాబు: అగ్నివీణ 

37. 'ఉదయిని' అనే కావ్యం ఎవరిది? 

జవాబు:  గంగినేని వెంకటేశ్వరరావు

38. 'శంఖారావం ' రచన ఎవరిది? 

జవాబు:  గజ్జెల మల్లారెడ్డి 

39. రెంటాల గోపాలకృష్ణ రచించిన అభ్యుదయ కావ్యాలు? 

జవాబు:  సంఘర్షణ, సర్పయాగం 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు